AP Panchayat elections AP Panchayat elections 2021 Roja jogi ramesh ycp mla nimmagadda ramesh kumar guntur chittoor collectors ramesh kumar doubts unanimous ycp chandrababu opposition parties ap government andhra pradesh ys jagan amaravati vijayawada ap local body elections local body elections high court tdp chandrababu naidu రోజా జోగి రమేష్ వైసీపీ ఎమ్మెల్యే గుంటూరు చిత్తూరు కలెక్టర్లు సందేహాలు వైసిపి చంద్రబాబు ఏపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ వైయస్ జగన్ విజయవాడ స్థానిక సంస్థల ఎన్నికలు హైకోర్టు టిడిపి చంద్రబాబు నాయుడు politics
నిమ్మగడ్డ చిన్న మెదడు చితికినట్టుందన్న రోజా .. ఏకగ్రీవాలు వద్దనటానికి మీరెవరు ? వైసీపీ నేతల ఫైర్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతోంది. ప్రభుత్వానికి కౌంటర్ వేస్తూ నిర్ణయాలు తీసుకుంటూ నిమ్మగడ్డ రమేష్ కుమార్, నిమ్మగడ్డ కు షాక్ లిస్తూ జగన్ సర్కార్ ఎన్నికల రాజకీయాన్ని హీటెక్కిస్తున్నాయి. తాజాగా అత్యధిక ఏకగ్రీవాలు జరిగిన జిల్లాలపై సంచలన నిర్ణయం తీసుకున్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆయా జిల్లాల కలెక్టర్లకు ఏకగ్రీవాలపై వివరణాత్మకంగా నివేదికలను పంపించాలని ఆ నివేదికలను పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పటివరకు ఏకగ్రీవాలు ప్రకటించకూడదని నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ తాజా నిర్ణయం పై వైసీపీ నేతలు భగ్గుమంటున్నారు .
ఏకగ్రీవాలపై పంచాయతీకి పార్లమెంట్ కి లింక్ పెట్టి నెల్లూరులో నిమ్మగడ్డ హాట్ కామెంట్స్ ..ఆసక్తికర చర్చ

ఏకగ్రీవాలను ఆపాలని చెప్పటం ఆయన మీద ఆయనకు నమ్మకం లేకనే
నగరి వైసీపీ ఎమ్మెల్యే రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ కి చిన్న మెదడు చితికిపోయినట్లు ఉందని రోజా పేర్కొన్నారు. తనకు కావలసిన అధికారులను నియమించుకున్న తర్వాత కూడా, ఆయన ఏకగ్రీవాలను ఆపాలని చెప్తున్నారంటే ఆయనకు ఆయనపై నమ్మకం లేదనిపిస్తోంది అంటూ రోజా వ్యాఖ్యానించారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రజల తీర్పును గౌరవించకపోతే బాగోదని రోజా అభిప్రాయపడ్డారు. ఏకగ్రీవాలు ప్రజాభిప్రాయం మేరకే జరిగాయని అన్నారు రోజా . గుంటూరు, చిత్తూరు జిల్లా కలెక్టర్లకు ఎన్నికల కమిషన్ ఏకగ్రీవాలపై సమగ్ర నివేదికలను ఇవ్వాలని కోరడాన్ని రోజా తప్పుబట్టారు.

ఏకగ్రీవం అనేది గ్రామంలోని ప్రజలు చేసుకునేది .. ఎస్ఈసి అభ్యంతరం దేనికి ?
సమర్ధత లేని వ్యక్తిని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా చంద్రబాబు నియమించారని ఓటు ఎలా బదిలీ చేసుకోవాలి అనే ప్రాధమిక విషయం కూడా తెలియని వ్యక్తి ఎన్నికల కమిషనర్ అని వైసిపి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏకగ్రీవం అనేది గ్రామంలోని ప్రజలు చేసుకుంటారని దీనిని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎందుకు నిలిపివేయాలని చూస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. స్థానిక ఎన్నికల్లో ఏకగ్రీవాలు వద్దని చెప్పడానికి ఎస్ ఈ సి ఎవరని వైసిపి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వివిధ జిల్లాల్లో జరిగిన ఏకగ్రీవ లని సక్రమమైన ఏకగ్రీవాలు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జోగి రమేష్ సైతం రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై నిప్పులు చెరిగారు.

పంచాయతీ ఎన్నికల్లో దుమారంగా మారిన ఏకగ్రీవాలు .. ఒకరిపై ఒకరు మాటలయుద్ధం
పంచాయతీ ఎన్నికలలో అత్యధిక ఏకగ్రీవ పంచాయతీల చేయాలని అధికార వైసీపీ ప్రయత్నం చేస్తుంటే, ప్రతిపక్ష టీడీపీ బలవంతపు ఏకగ్రీవాలు అంటూ ఏకగ్రీవాలను వ్యతిరేకిస్తోంది. ఇదే సమయంలో ఏకగ్రీవాలను బలవంతంగా చేస్తున్నారంటూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సైతం అనుమానం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. తాజాగా ఏకగ్రీవాలు శృతి మించితే అధికారుల వైఫల్యం కింద తీసుకోవలసి వస్తుందని చెప్పిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చిత్తూరు, గుంటూరు జిల్లాలో అత్యధికంగా పంచాయతీలు ఏకగ్రీవం కావడంపై సంచలన నిర్ణయం తీసుకున్నారు.
సమగ్ర నివేదిక ఇవ్వాలని కలెక్టర్లకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.

సీరియస్ అయిన వైసీపీ నేతలు .. రోజా తీవ్ర అసహనం
వివరణాత్మక నివేదికను పంపించాలని అధికారులను ఆదేశించారు. అధికారులు నివేదికలు పంపించిన తర్వాత వాటిని పరిశీలించిన అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా ఏకగ్రీవ పంచాయతీల విషయంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీసుకున్న నిర్ణయం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వైసీపీ నేతలు , ముఖ్యంగా చిత్తూరు జిల్లా నాయకులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే రోజా , జోగి రమేష్ వంటి నేతలు నిమ్మగడ్డపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు .