వదినకు వెన్నుపోటు: దేవినేనిపై రోజా, 'యూపీ తీగ లాగితే జగన్ డొంక కదిలింది'
దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి పూర్తి చేసిన ప్రాజెక్టులను ప్రారంభిస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఫోటోలకు ఫోజులు ఇస్తున్నారని వైసిపి నగరి ఎమ్మెల్యే రోజా గురువారం నాడు ఎద్దేవా చేశారు.
విజయవాడ: దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి పూర్తి చేసిన ప్రాజెక్టులను ప్రారంభిస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఫోటోలకు ఫోజులు ఇస్తున్నారని వైసిపి నగరి ఎమ్మెల్యే రోజా గురువారం నాడు ఎద్దేవా చేశారు.
ప్రాజెక్టుల పేరుతో కోట్లు దండుకుంటున్నారని ఆరోపించారు. చంద్రబాబు సొంత మామకు వెన్నుపోటు పొడిచారన్నారు. మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు తన వదినకు వెన్నుపోటు పొడిచారని ధ్వజమెత్తారు.
మాయావతి సోదరుడి సంస్థకు జగన్ జగతికి లింక్: పయ్యావుల
మన దేశంలో నల్ల ధనం మూలాలు ఎక్కడ బయటపడినా అందులో వైసిపి అధినేత జగన్ పేరు వినిపిస్తోందని టిడిపి నేత పయ్యావుల కేశవ్ అన్నారు. యూపీ మాజీ సీఎం మాయావతి సోదరుడు ఆనంద్ కుమార్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన సంస్థలే జగన్‌కు చెందిన జగతిలో పెట్టారన్నారు.
ఆనంద్ కుమార్ జమ చేసిన రూ.104 కోట్ల పైన ఐటీ శాఖ విచారణ జరిపిందని, హింగోరా ఫిన్ వెస్ట్, భాస్కరా ఫండ్స్ మేనేజ్‌మెంట్స్, డెల్టాన్, ఎగ్జిమ్ ప్రయివేటు లిమిటెడ్ కంపెనీలు ఆనంద్ సంస్థల్లో రూ.1300 కోట్ల పెట్టుబడులు పెట్టినట్లు తేలిందన్నారు.
రూ.10 షేర్‌ను రూ.10వేల చొప్పున కొన్నాయన్నారు. ఈ నల్లధనం మూలాలను ఐటీ పరిశీలించిందని, అప్పుడు హింగోరా సంస్థ జగతిలోని పెట్టుబడులు పెట్టినట్లుగా తేలిందన్నారు. ఆనంద్ కుమార్ అవినీతిపై తీగ లాగితే జగన్ అక్రమాల డొంక కూడా కదిలిందన్నారు.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications