హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సినిమాలు లేని ఆర్టిస్ట్ కథ, వైయస్ ఫినిష్ అని చంద్రబాబు హెడ్డింగ్ వచ్చిన రోజే: రోజా సంచలనం

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్/అమరావతి: తమ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై శ్రీనివాస రావు హత్యాయత్నం వెనుక తెలుగుదేశం పార్టీ పెద్దల హస్తం ఉందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా గురువారం అన్నారు. జగన్‌కు భద్రత పెంచాలని ఆమె డిమాండ్ చేశారు. ఎయిర్ పోర్టు రెస్టారెంట్ యజమాని హర్షవర్ధన్‌ను ఎందుకు విచారించడం లేదని ప్రశ్నించారు. ఆయన కాల్ డేటా పరిశీలించాలన్నారు.

విమానాశ్రయంలో ఏపీ ప్రభుత్వానికి సంబంధం లేనప్పుడు గతంలో జగన్‌ను రన్ వే పైన ఎలా అరెస్ట్ చేశారని, విజయవాడలో తనను ఎలా అడ్డుకున్నారో చెప్పాలని ప్రశ్నించారు. తనను ఎయిర్ పోర్టు నుంచి ఎలా కిడ్నాప్ చేశారని ప్రశ్నించారు. ఈ అంశాలలో చంద్రబాబు హ్యాండ్ ఉందా, లోకేష్ హ్యాండ్ ఉందా అని ప్రశ్నించారు.

చంద్రబాబును కాపాడుకోవడానికి శివాజీని అరెస్ట్ చేయాలి

చంద్రబాబును కాపాడుకోవడానికి శివాజీని అరెస్ట్ చేయాలి

ఆపరేషన్ గరుడలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై దాడి జరుగుతుందని నటుడు శివాజీ చెప్పారని రోజా గుర్తు చేశారు. చంద్రబాబును కాపాడుకోవడానికైనా శివాజీని విచారించాలని ఆమె డిమాండ్ చేశారు. ఆపరేషన్ గరుడ చేసేది మామూలు సినిమాలు లేని ఆర్టిస్ట్ అన్నారు. సిగ్గులేకుండా ముఖ్యమంత్రి ఈ అంశంపై గగ్గోలు పెడుతున్నారన్నారు. శివాజీ అమెరికాలో దాచుకున్నారని, అతనికి దమ్ముంటే ఇక్కడకు రావాలన్నారు. ఆపరేషన్ గరుడ పేరుతో అల్లర్లు సృష్టించే ప్రయత్నాలు సృష్టించిన శివాజీని అరెస్ట్ చేయాలన్నారు.

నేను సరే.. మోడీ-లక్ష్మీపార్వతిల మాటేమిటి: శివాజీ దిమ్మతిరిగే కౌంటర్, జగన్ మీద దాడిపై ఇలానేను సరే.. మోడీ-లక్ష్మీపార్వతిల మాటేమిటి: శివాజీ దిమ్మతిరిగే కౌంటర్, జగన్ మీద దాడిపై ఇలా

వైయస్‌ను ఫినిష్ అని హెడ్‌లైన్ వచ్చిన రోజే కనిపించకుండా పోయారు

వైయస్‌ను ఫినిష్ అని హెడ్‌లైన్ వచ్చిన రోజే కనిపించకుండా పోయారు

చంద్రబాబుకు వెన్నుపోట్లు అలవాటు అని, తన రాజకీయ జీవితానికి అడ్డు వచ్చిన వారిని అడ్డం తొలగించుకుంటాడని తెలుసునని చెప్పారు. పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్‌ను చూశామని చెప్పారు. వైయస్ విషయంలోను చూశామని, నాతో పెట్టుకుంటే నువ్వు ఫినిష్ అని చెప్పారని, ఆ హెడ్ లైన్ పేపర్ వచ్చిన రోజే వైయస్ కనిపించకుండా పోయారన్నారు. కుటుంబ సభ్యులు అడ్డువచ్చినా పక్కకు తప్పిస్తారన్నారు. జగన్ మీద దాడిపై పూర్తిస్థాయిలో దర్యాఫ్తు జరగాలన్నారు.

 కేంద్రం కాళ్లు పట్టుకొని స్టే తెచ్చుకుంటారు

కేంద్రం కాళ్లు పట్టుకొని స్టే తెచ్చుకుంటారు

చంద్రబాబుపై ఏదైనా విచారణ ప్రారంభమవుతుందంటే కేంద్రం కాళ్లు పట్టుకొని స్టే తెచ్చుకుంటారని, ఇప్పుడు రాహుల్ గాంధీని కలిసేందుకు వెళ్లాడని రోజా ఆరోపించారు. ఏ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా టీడీపీ పుట్టిందో అదే పార్టీతో ఇప్పుడు ఎన్నికలకు వెళ్లేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారంటే అతని అధికార దాహం అర్థమవుతోందన్నారు. ఈ రోజు దేశం, రాష్ట్రం బాగుండాలన్ని చంద్రబాబును దేశం నుంచి తరిమికొట్టిన రోజే సాగుతుందన్నారు. రాహుల్ గాంధీకి ఏపీతో ఏం పని అని, ఆయన పుండు మీద కారం చల్లేందుకు వస్తున్నారా అని ప్రశ్నించారు, ఇప్పుడు మాత్రం అతని వద్దకే పరుగెత్తుకెళ్తున్నారంటే ఎంత సిగ్గులేని వ్యక్తో అందరం గమనించాలని అన్నారు. తన పునాదులు కదులుతున్నాయని, పైగా జగన్‌ను అడ్డు తొలగించుకోవాలనే ప్లాన్ కూడా ఫెయిలవడంతో ఈ కేసుపై విచారణ జరగకుండా ఉండేందుకు ఢిల్లీకి వెళ్లారన్నారు.

కేసును నిర్వీర్యం చేసే పనిలో

కేసును నిర్వీర్యం చేసే పనిలో


సిట్ పైన నమ్మకం లేదని, సీబీఐ విచారణ చేయాలని గవర్నర్‌ను కోరుతున్నామని రోజా చెప్పారు. సేవ్ నేషన్, సేవ్ ఏపీ, సేవ్ తెలంగాణ కోసమైనా చంద్రబాబును అధికారం నుంచి దూరం పెట్టాలని చెప్పారు. కేంద్ర విచారణ సంస్థలను భ్రష్టుపట్టించిన కాంగ్రెస్‌తో జతకట్టేందుకు చంద్రబాబు డిల్లీకి వెళ్లారని చెప్పారు. నిందితుడు శ్రీనివాస రావు కాల్ డేటాలో తమ నేతలు ఉన్నారని కేసును నిర్వీర్యం చేసే పనిలో టీడీపీ నేతలు ఉన్నారని ఆరోపించారు.

చాలా పెద్ద స్కెచ్

చాలా పెద్ద స్కెచ్

ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న జగన్ పైన జరిగిన హత్యాయత్నాన్ని నీరుగార్చే పని చేస్తున్నారని రోజా ఆరోపించారు. నిందితుడ్ని అరెస్టు చేయకముందే డీజీపీ హోంమంత్రి, డీజీపీ తమ అభిప్రాయాన్ని చెప్పారని, దీనిని బట్టే కుట్ర అర్థమవుతోందన్నారు. జగన్ వంటి వ్యక్తిని అంతమొందించాలంటే దాని వెనుక చాలా పెద్ద స్కెచ్, చాలా పెద్ద లాభం ఉండాలనే విషయం చంద్రబాబుకు తెలుసునని, జగన్ వల్ల ఎక్కువ లాభం చంద్రబాబుకే అన్నారు. నాడు వైయస్ చనిపోయిన తర్వాత ఎక్కువ లాభపడింది చంద్రబాబు అన్నారు.

జగన్‌కు వస్తున్న ఆదరణ చూసి ఎదగలేమనే స్కెచ్

జగన్‌కు వస్తున్న ఆదరణ చూసి ఎదగలేమనే స్కెచ్

జగన్‌కు వస్తున్న ఆదరణ చూసి భయపడిన టీడీపీ, ఆయన లేకుంటేనే మనం రాజకీయంగా ఎదగలమనే ఆలోచనతోనే హత్యకు స్కెచ్ వేశారని రోజా ఆరోపించారు. చంద్రబాబు, డీజీపీల వ్యాఖ్యలు దారుణం అన్నారు. మేం అనుకుంటే ఖైమా ఖైమా చేసేవాళ్లమని ఓ ఎంపీ, సోమిరెడ్డి.. మేం గిచ్చుకోవడాలు.. లేపేయాలంటే పెద్ద ప్లాన్ వేస్తామని చెప్పాలంటే వాళ్లు ప్రజాప్రతినిధులా రౌడీలా అని ప్రశ్నించారు. శ్రీనివాస రావు అనే నిందితుడికి జగన్‌ను చంపాల్సిన అవసరం లేదని చెప్పారు. కాబట్టి కుట్ర కోణంలో దర్యాఫ్తు చేయాలన్నారు. కత్తి జనవరి నుంచి రెస్టారెంటులో ఉందని చెప్పారని, అప్పటి నుంచి అక్కడ ఎందుకు ఉంచారో చెప్పాలన్నారు.

English summary
YSR Congress Party MLA Roja lashed out at Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu and Hero Sivaji.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X