• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

రోజా ఫిట్‌నెస్ వీడియో వైరల్..ఛాలెంజ్ విసిరిన నగరి ఎమ్మెల్యే..!

|

హైదరాబాద్ : కొంతమంది ఏం చేసినా ఎంతో ప్రత్యేకతను సంతరించుకుంటుంది. అదే పని సెలబ్రిటీలు చేస్తే కిక్కెక్కుతుంది ఆపై పిచ్చెక్కుతుంది. ఇంకొంత మంది అదే పని చేస్తే పరాకాష్టగా మారి కేరింతల వరకూ తీసుకెళ్తుంది. తాజాగా ఓ సెలబ్రిటీ ఇదే పని చేసి ఔరా అనిపించింది. మత్తు కళ్లతో, నవ్వుల పువ్వులు పూయిస్తూ ఆమె చేస్తున్న కసరత్తులు కుర్రకారును చిత్తు చేస్తున్నాయి. బ్లాక్ కలర్ టీషర్ట్, పింక్ కలర్ ట్రాక్ దరించి ఆమె చేసిన వర్కౌట్స్ కు యువత ఫిదా అవుతునన్నారు. చాలా మంది యువ కథానాయికలు ఈ వర్కౌట్స్ చేస్తున్నప్పటికి రాని గుర్తింపు నాలుగు పదుల వయసులో కూడా ఆమె చేస్తున్న కసరత్తులు యువతను జబర్దస్తు అనిపిస్తున్నాయంటే ఆశ్చర్యం కలిగిస్తోంది.

  YCP MLA Roja Workouts Video Gone Viral
   రోజా చేసింది కసరత్తు.. కుర్రకారు ఐపోయాలు చిత్తు..

  రోజా చేసింది కసరత్తు.. కుర్రకారు ఐపోయాలు చిత్తు..

  కొందరు సెలబ్రిటీలు ఎప్పుడూ వార్తల్లో ఉంటూనే ఉంటారు. ఔనన్నా కాదన్నా ప్రసార మాద్యమాల ఫోకస్ వారివైపు మళ్లుతూనే ఉంటుంది. వారు ఏం చేసినా, చివరకు టీ తాగినా మందు తాగినంత పబ్లిసిటీ వచ్చేస్తుంది. అది వారికున్న ఛరిష్మా. ఇక ఓ ప్రజా ప్రతినిధిగా, ఓ టీవీ షోలో తనకంటూ ప్రత్యేకత చాటుకున్న ఓ ప్రముఖ యాంకర్ గా, అంతకుముంది మంచి కథానాయకురాలిగా ఆమెకున్న ప్రత్యేకత మరెవ్వరికీ ఉండదు. ఇక రాజకీయాల్లో గాని, శాసనసభలో గాని ఆమె సాహసోపేత వ్యాఖ్యల పట్ల ప్రత్యర్తులు హడలిపోవాల్సిందే. ఇంతటి ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు పొందిన ఆమె తాజాగా చేసిన వర్కౌట్ల పట్ల ఫిదా అవుతున్నారు యువత.

   రోజా విడుదల చేసిన నిమిషం వర్కౌట్ విడియో.. తెగ చూసేస్తోన్న యువత..

  రోజా విడుదల చేసిన నిమిషం వర్కౌట్ విడియో.. తెగ చూసేస్తోన్న యువత..

  ఇంతకీ కుర్రకారును తన కసరత్తులతో ఛిత్తు చేసిన ఆ సెలబ్రిటీ ఎవరనుకుంటున్నారా..? ఇంత చెప్పిన తర్వాత మీరు ఓ అవగాహనకు వచ్చిఉండిఉంటారని తెలుస్తోంది. ఆమె సినిమా సన్నివేశాలను ఎంతో రక్తి కట్టిస్తుంది, టీవీషోలైతే నవ్వులు పూయిస్తుంది, రాజకీయాలైతే సంచలనాలు సృష్టిస్తుంది, శాసనసభ ఐతే ప్రత్యర్థుల్లో భయాన్ని కల్పింస్తుంది, నియోజకవర్గంలోనైతే ప్రజా సమస్యలు తీరుస్తుంది. ఆమే నగరి ఎమ్మెల్యే రోజా. నగరి ఎమ్మెల్యే అనేకన్నా, జబర్ధస్తు జడ్జి రోజా అంటే ఎక్కువ మంది చటుక్కున గుర్తు పెట్టుకుంటారు. రోజా చేసిన కసరత్తుకు సంబందించిన వీడియో ఉప్పుడు తాజా వైరల్ అవుతోంది.

   రోజా చేసిన వర్కౌట్ పట్ల యువతలో చర్చ.. వైరల్ గా మారిన రోజా కసరత్తు వీడియో..

  రోజా చేసిన వర్కౌట్ పట్ల యువతలో చర్చ.. వైరల్ గా మారిన రోజా కసరత్తు వీడియో..

  రోజా చేసిన వర్కౌట్స్ పట్ల యువతలో పెద్ద ఎత్తున చర్చ జరగుతున్నట్టు తెలుస్తోంది. రోజా చేసిన కసరత్తుకు సంబంధించిర వీడియో యువత సెల్ ఫోన్లలో షికార్లు చేస్తోంది. సహజంగా నాలుగు పదులు దాటిన కధానాయకులను తెలుగు ప్రేక్షకులు పెద్దగా ఆదరించరు. వారు ఏం చేసిన, ఎంత గొప్ప సినిమాలో నటించి ఒప్పించి, మెప్పించినా అంతంత మాత్రంగానే ఉంటుంది. దీర్ఘకాలం గుర్తు పెట్టుకోవడం అంత సాద్యం కాదంటారు తెలుగు ప్రేక్షకులు. కాని రోజా విషయంలో అభిమానుల అభ్రిప్రాయం పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఆమె ఏది చేసినా మనస్సూర్తిగా ఆస్వాదిస్తుంటారు సగటు తెలుగు ప్రేక్షకుడు.

  సెల్ఫీ విడియోలతో హల్ చల్ చేస్తున్న సినీ తారలు.. రోజా వీడియోకు ఊహించని ఆదరణ..

  కరోనా వైరస్ క్లిష్ట సమయంలో ప్రజలందరూ స్వీయ నియంత్రణ పాటిస్తూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో సెలబ్రిటీలు సెల్ఫీ వీడియోల ద్వారా కాస్త ప్రజలకు వినోదాన్ని పంచుతున్నారు. చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రాణా, రకూల్ ప్రీతి సింగ్, అనసూయ, సుమ, మోహన్ బాబు, మంచులక్ష్మీ, రామ్ చరణ్ దంపతులతో పాటు మరికొందరు కారోనా సమయంలో హల్ చల్ చేస్తున్నారు. ఇక రోజా ఒక్క నిమిషం వర్కౌట్ చేసిన వీడియో గురించి మాత్రం ఇరవై నాలుగు గంటలు చర్చ జరుగతోంది, యువతలో రచ్చ కూడా జరుగుతోంది. మరి వర్కౌట్ నేను చేసాను మీ సంగతేంటన్న ప్రశ్నకు సమాధానం మాత్రం రోజా వీడియోను పదేపదే చూస్తున్న యువతే చెప్పాలి.

  English summary
  There seems to be a lot of debate among youngsters about workouts done by Roja. A video related to the exercise of Roja strokes the youth cell phones.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X