వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గేదేలరాజు హత్యలో కీలక నిందితుడు హత్య: 4 మర్డర్ కేసులు, మహేష్ నేర చరిత్ర ఇదీ

By Narsimha
|
Google Oneindia TeluguNews

విశాఖపట్టణం: గేదేల రాజు హత్య కేసులో నిందితుడుగా ఉన్న మహేష్ హత్యకు గురికావడం సంచలనం సృష్టిస్తోంది. మద్యం మత్తులో స్నేహితులతో ఘర్షణ పడితే స్నేహితులే అతడిని హత్యచేసినట్టుగా పోలీసులు చెబుతున్నారు. అత్యంత దారుణంగా మహేష్ హత్యకు గురికావడం విశాఖలో కలకలం రేపుతోంది. మహేష్ జీవితమంతా నేర చరిత్ర. సుఫారీ తీసుకొంటే ఎలాంటి దుర్మార్గానికైనా పాల్పడేవాడు మహేష్.అతడిపై పలు కేసులు నమోదయ్యాయి.

విశాఖ పట్టణానికి చెందిన గేదేల రాజును హత్య కేసులో నిందితుడిగా ఉన్న మహేష్ ప్రస్తుతం విజయనగరంలో తలదాచుకొంటున్నాడు. వైద్యం కోసం విశాఖ పట్టణానికి వచ్చి హత్యకు గురయ్యాడు.

విశాఖపట్టణంలోని మద్దలపాలెం కూరగాయల మార్కెట్‌లో ఓ మటన్‌షాపు వద్దకు వచ్చి స్నేహితులతో గడిపాడు అక్కడే హత్యకు గురయ్యాడు. ఆసుపత్రికి తరలిస్తుండగానే మహేష్ మృతి చెందినట్టుగా పోలీసులు చెబుతున్నారు.

మహేష్‌‌పై పలు కేసులు

మహేష్‌‌పై పలు కేసులు

గేదేలరాజు హత్యకేసులో నిందితుడిగా ఉన్న మహేష్‌పై పలు కేసులున్నాయి 2004లో నాలుగో పట్టణంలోని కవిత అనే వివాహితను హత్య చేశాడు.ఈ ఘటనపై కవితపై మహేష్‌పై కేసు నమోదైంది 2005లో మూడో టౌన్ పోలీస్ స్టేషన్ లో కనకరాజు అనే వ్యక్తిని హత్య చేశఆడు. ఈ కేసులో మహేష్ అరెస్టై బయటకు వచ్చాడు.2017లో మళ్ళ రమణ అనే వ్యక్తిని హత్య చేసినట్టు పోలీసుల రికార్డుల్లో నమోదైంది. అదే సంవత్సరంలో న్యూపోర్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో గేదేల రాజును హత్య చేశాడు. మద్దలపాలెం, హెచ్‌ బి కాలనీల్లో నివాసం ఉండేవాడు. గేదేలరాజు హత్య తర్వాత విజయనగరం జిల్లాకు షిఫ్ట్ అయ్యాడు.

యుక్తవయస్సు నుండే నేరాల బాటలోనే

యుక్తవయస్సు నుండే నేరాల బాటలోనే

మహేష్ యుక్త వయస్సు నుండే నేరాల బాట పట్టాడు. 18 ఏళ్ళ నుండి నేరాలే జీవితంగా జీవనం సాగించాడు 35 ఏళ్ల కాలంలో నాలుగు హత్యలకు పాల్పడ్డాడు. మహేష్ నేర జీవితంతో భార్య, పిల్లలు కూడ అతడికి దూరమయ్యారు. సుఫారీ తీసుకొంటే ఎంతటి దారుణానికైనా ఒడిగట్టేవాడని పోలీసులు చెబుతుంటారు. హత్యలు, దాడులు, దౌర్జన్యాలతో మహేష్ జీవనం సాగుతోంది. చివరకు మహేష్ కూడ స్నేహితుల చేతిలో హత్యకు గురయ్యాడు.

ఆసుపత్రికి వచ్చి హత్యకు గురైన మహేష్

ఆసుపత్రికి వచ్చి హత్యకు గురైన మహేష్

గేదేల రాజు హత్య తర్వాత మహేష్ విజయనగరం జిల్లా గుర్ల ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు అప్పుడప్పుడు విశాఖకు వచ్చేవాడు. అయితే ఆరోగ్యం బాగా లేదనే కారణంగా కెజిహెచ్ ఆసుపత్రికి వచ్చాడు చికిత్స చేసుకొన్న తర్వాత మద్దిలపాలెంలోని కూరగాయల మార్కెట్లోని మటన్ షాపు వద్దకు వెళ్ళాడు. అక్కడే స్నేహితులతో కలిసి రాత్రి 11 గంటల వరకు మద్యం తాగాడు. అదే ప్రాంతంలో మహేష్ హత్యకు గురికావడం సంచలనంగా మారింది.

మహేష్ హత్యపై పోలీసుల విచారణ

మహేష్ హత్యపై పోలీసుల విచారణ

మహేష్ హత్యపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. పాతకక్షలే కారణమా, యాధృచ్ఛికంగా ఈ హత్య చోటు చేసుకొందా, ఇంకా ఇతరత్రా కారణాలు ఏమైనా ఉన్నాయా అనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు. మద్యం మత్తులో జరిగిన గొడవే ఈ హత్యకు కారణమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మహేష్‌ను హత్య చేసిన నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు.

English summary
A rowdy sheeter involved in many murder cases, Suvvada Mahesh, was brutally killed by unknown persons at a mutton shop in the late night of Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X