అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆ ఒక్క నియోజకవర్గానికి రూ.1500 కోట్లు మంజూరు: ఈ సారి బకింగ్ హామ్..అక్రమ నిర్మాణాల తొలగింపు

|
Google Oneindia TeluguNews

అమరావతి: రాజధానిని తరలిస్తారనే అనుమానాలు వ్యక్తమౌతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఒకే ఒక్క నియోజకవర్గం అభివృద్ధికి ఏకంగా 1500 కోట్ల రూపాయలను మంజూరు చేయడం అందరి దృష్టినీ ఆకర్షించింది. అందరి కళ్లూ ఆ నియోజకవర్గం మీదే పడ్డాయి. అదే- మంగళగిరి. ఈ ఒక్క నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు, ఆధునికీకరణ కోసం ప్రభుత్వం 1500 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలపై ఆర్థిక మంత్రిత్వశాఖ తాజాగా ఆమోద ముద్ర వేసింది. ఈ మొత్తాన్ని రాజధాని ప్రాంత అభివృద్ధి మండలి (సీఆర్డీఏ)కు బదలాయించింది.

ప్రత్యేక కార్పొరేషన్..

ప్రత్యేక కార్పొరేషన్..

మంగళగిరి, దానికి ఆనుకునే ఉన్న తాడేపల్లి మండలాన్ని కూడా కలుపుకొని ప్రత్యేక కార్పొరేషన్ ను ఏర్పాటు చేయడానికి మున్సిపల్ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సీఆర్డీఏ సహా మున్సిపల్, గ్రామీణాభివృద్ధి శాఖలు సంయుక్తంగా మంగళగిరి-తాడేపల్లి కార్పొరేషన్ ఏర్పాటుకు అవసరమైన విధి విధానాలను రూపొందించబోతున్నాయి. ఈ ప్రాంత పరిధిలోని మున్సిపాలిటీలు, పంచాయతీలన్నింటినీ ఏకం చేస్తూ ఈ కార్పొరేషన్ ఏర్పాటు కానున్నట్లు తెలుస్తోంది. దీనికోసం సమగ్ర ప్రణాళికలను ఈ మూడు శాఖలు రూపొందించాల్సి ఉంటుంది. ప్రస్తుతం పాతూరు, కుంచనపల్లి, వడ్డేశ్వరం మున్సిపాలిటీలు వేర్వేరుగా కొనసాగుతున్నాయి.

మరోసారి అక్రమ నిర్మాణాల తొలగింపు

మరోసారి అక్రమ నిర్మాణాల తొలగింపు

ఇప్పటికే కృష్ణా నది పరీవాహక ప్రాంతాల్లో వెలసిన అక్రమ కట్టడాల తొలగింపు చర్యలకు దిగిన ప్రభుత్వం.. ఈ సారి బకింగ్ హామ్ కాలువపై కన్నేసింది. బకింగ్ హామ్ కాలువ పరిసరాల్లో వెలిసిన అక్రమ కట్టడాలను తొలగించేలా త్వరలో ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. రోడ్డు నిర్మాణానికి అడ్డుగా ఉన్న నివాసాలన్నింటిని తొలగించడానికి కసరత్తు చేపట్టబోతోంది. ఈ ప్రాంతంలో 100 అడుగుల రోడ్డు నిర్మాణం కోసం అధికారులు ప్రతిపాదనలను రూపొందించారు. గుంటూరు జిల్లా రేవేంద్రపాడు వరకూ ఈ వంద అడుగుల రోడ్డు నిర్మాణమౌతుంది.

బకింగ్ హామ్ పై నాలుగు వంతెనలు..

బకింగ్ హామ్ పై నాలుగు వంతెనలు..

రేవేంద్ర పాడు వరకూ 100 అడుగుల రోడ్డు నిర్మాణానికి సమాంతరంగా తాడేపల్లిని అనుసంధానించడానికి బకింగ్ హామ్ కాలువపై నాలుగు వంతెనలను నిర్మించడానికి సీఆర్డీఏ అధికారులు ప్రతిపాదనలను రూపొందిస్తున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పరిస్థితిని మార్చేందుకు తాడేపల్లి మంగళగిరి మున్సిపాలిటీలను రెంటినీ కలిపి అభివృద్ధి చేసేందుకు 1,500 కోట్ల రూపాయిలు కేటాయిస్తోంది. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇటీవలే ఈ విషయంపై ప్రకటన కూడా ఇచ్చారు. ఈ రెండు మండలాల్లోని గ్రామాలన్నిటినీ అనుసంధానిస్తూ అభివృద్ధిపరిచేలా సీఆర్‌డిఎ ఇందుకు అవసరమైన ప్లానింగ్ ను సిద్ధం చేస్తోంది.

English summary
Tadepalli and Mangalagiri, which are close to the residence of Chief Minister YS Jagan Mohan Reddy has assumed significance. The State government has already prepared elaborate plans to merge some neighbouring villages with the Tadepalli and Mangalagiri municipalities to boost their importance. The State government has already earmarked Rs 1,500 crore for development of two municipalities, while the Capital Region Development Authority (CRDA) is making plans for their development.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X