కొత్త రూ.2వేల నోటుతో ప్రయోజనం లేదు: చంద్రబాబు
రూ.వెయ్యి కోట్ల వరకు రూ.20, 10, 50, 100 నోట్లు ఉండేలా చూడాలని, పీవోఎస్ యంత్రాలకు రాయితీలు కల్పించాలని లేఖలో కేంద్రాన్ని కోరారు. తాజాగా, రాష్ట్రానికి ఆర్‌బీఐ రూ.1730 కోట్లు పంపిందని తెలిపారు.
పశ్చిమగోదావరి: రూ.2000 నోటుతో పేదలకు ఎలాంటి ప్రయోజనం ఉండదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. సోమవారం పశ్చిమగోదావరి జిల్లా ఉంగటూరు మండలం గొల్లగూడెంలో 5మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
దొంగలు, అవినీతి భతరం పట్టాలనే ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం పెద్దనోట్లను రద్దు చేసిందన్నారు. అయితే ఈ నిర్ణయంతో క్షేత్రస్థాయిలో పలు సమస్యలు తలెత్తాయన్నారు.

భవిష్యత్తులో నగదు లావాదేవీలు తగ్గి ఆన్‌లైన్ లావాదేవీలు పెరిగే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. పట్టిసీమ ప్రాజెక్టుకు భూములిచ్చిన రైతులకు ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా అభినందనలు తెలిపారు చంద్రబాబు.
మరో 5వేల కోట్లు పంపండి
పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో నెలకొన్న పరిస్థితులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ఏపీకి తక్షణమే మరో రూ.5వేల కోట్లు పంపాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. ఆన్‌లైన్ లావాదేవీలపై పన్ను మినహాయింపులు కల్పించాలని, సహకార బ్యాంకుల్లో రైతులకు నిబంధనలు సడలించాలని కోరారు.












Click it and Unblock the Notifications