అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

'అలాంటి తండ్రి ఎవరికీ వద్దు', 'ప్రత్యూషకు రూ. 25 లక్షలు సహయం'

రామసుబ్బారెడ్డి కూతురు ప్రత్యూషకు చంద్రబాబు రూ. 25 లక్షలను ప్రకటించారు.బాధితురాలిని నన్నపనేని రాజకుమారి చంద్రబాబు వద్దకు తీసుకెళ్ళింది.తన తండ్రి లాంటి వారు ఎవరికీ వద్దని ఆమె అభిప్రాయపడింది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

అనంతపురం: అనంతపురం జిల్లా తాడిపత్రిలో సంచలనం సృష్టించిన భార్య, కూతుళ్ళను హత్య చేసి నిందితుడు రామసుబ్బారెడ్డి ఆత్మహత్య చేసుకొన్నాడు.అయితే ఈ కుటుంబంలో మిగిలిన ఉన్న ప్రత్యూషకు రూ. 25 లక్షల సహయాన్ని ప్రకటించారు ఏపీ సిఎం చంద్రబాబునాయుడు.

ట్విస్ట్: ట్రిపుల్ మర్డర్ కేసు నిందితుడు రామసుబ్బారెడ్డి ఆత్మహత్యట్విస్ట్: ట్రిపుల్ మర్డర్ కేసు నిందితుడు రామసుబ్బారెడ్డి ఆత్మహత్య

అనంతపురం జిల్లా తాడిపత్రిలోని కృష్ణాపురంలో రామసుబ్బారెడ్డి అనే వ్యక్తి భార్య సులోచన, ఇద్దరు కూతుళ్ళను మంగళవారం నాడు దారుణంగా హత్య చేశాడు. అయితే బుదవారం నాడు నిందితుడు రామసుబ్బారెడ్డి ఆత్మహత్య చేసుకొన్నాడు.

Rs. 25 lakh financial assistance announces Chandrababu naidu to Pratyusha

అయితే ఈ కుటుంబంలో మిగిలి ఉన్న ప్రత్యూషను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళ కమిషన్ చైర్మెన్ నన్నపనేని రాజకుమారి బుదవారం నాడు పరామర్శించారు. ఆమెను ఘటన వివరాలను అడిగి తెలుసుకొన్నారు. అయితే తండ్రి మృతదేహన్ని చూసేందుకు కూడ ప్రత్యూష తొలుత ఇష్టపడలేదు. అయితే కన్నతండ్రి చివరిసారిగా చూసేందుకు ఎట్టకేలకు అంగీకరించింది. రాజకుమారి బాధితురాలిని ఓదార్చారు.ఆమెను అన్నిరకాలుగా ఆదుకొంటామని చెప్పారు.

అయితే అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వద్దకు నన్నపనేని రాజకుమారి బాధితురాలు ప్రత్యూషను తీసుకెళ్ళింది.

ప్రత్యూషకు రూ. 25 లక్షల పరిహరాన్ని ప్రకటించిన బాబు

తన తండ్రి రామసుబ్బారెడ్డి , తల్లి, ఇద్దరి చెల్లెళ్ళను కిరాతకంగా హత్య చేశాడని ప్రత్యూష బాబుకు చెప్పింది. ముక్తాపూర్ లోనిర్వహించిన సభలో బాధితురాలు మాట్లాడింది. రామసుబ్బారెడ్డి లాంటి వ్యక్తిని తన తండ్రి అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నట్టుగా ఆమె ప్రకటించింది. అత్యంత కిరాతకంగా సుత్తితో మోది చంపారని ఆమె సభలో కన్నీళ్ళు పెట్టుకొంటూ చెప్పారు. ప్రత్యూషకు 25 లక్షల ఆర్థిక సహయాన్ని ఇస్తున్నట్టు చంద్రబాబునాయుడు ప్రకటించారు.
అంతేకాదు ఆమె చదువుకు అయ్యే ఖర్చును కూడ భరించనున్నట్టు ఆయన ప్రకటించారు.

English summary
Rs. 25 lakh financial assistance announced Ap chierminister Chadrababu naidu to Pratyusha .She has met Ap chief minister Chandrababu naidu in Muktapur meeting with the help of Ap women comission chairperson on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X