వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపి ఉద్యోగుల సాయం 30 కోట్లు : అమ‌ర జ‌వాన్ల‌కు అండ‌గా ...!

|
Google Oneindia TeluguNews

పుల్వామా దాడిలో అమరులైన అమర జవాన్ల కుటుంబాలను ఆదుకోవడానికి రాష్ట్రంలోని అన్ని వర్గాలూ క‌దిలి వ‌స్తున్నా యి. దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీర జ‌వాన్ల కుటుంబాల‌కు 30 కోట్లు ఆర్దిక సాయం అందించేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వ ఉద్యోగులు ముందుకు వ‌చ్చారు. ప్రయివేటు పాఠ‌శాల‌లు..క‌ళాశాలలు..వ్య‌క్తులు సాయం ప్ర‌క‌టిస్తున్నారు.

ఉద్యోగుల సాయం 30 కోట్లు..
జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో ముష్క‌రుల చేతిలో బ‌లైన అమ‌ర జ‌వాన్ల కుటుంబాల‌కు ఏపి ఉద్యోగులు..సంస్థ లు పెద్ద మ‌న‌సుతో వారికి అండ‌గా నిలిచేందుకు ముందుకు వ‌స్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ ఔదార్యం చాటుకొన్నారు. రూ.30 కోట్ల ఆర్థికసహాయాన్ని అందించాలని ఎన్జీవోలు నిర్ణయించారు. ఎన్జీవో కేడర్‌ నుంచి గెజిటెడ్‌ అధికారులు, ఉపాధ్యాయుల వరకు రూ. 500 చొప్పున, నాలుగో తరగతి ఉద్యోగులు, పెన్షనర్ల నుంచి రూ. 200 చొప్పున సేకరించనున్నారు.

Rs 30 Cr assistance for Martyrs : AP Govt Employees decision..

ఇలా పోగుచేసిన రూ. 30 కోట్లను బాధిత కుటుంబాలకు సాయంగా అందించను న్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబును ఎన్జీవో అసోసియేషన్ నేత‌లు కలుసుకొని ఈ విషయం తెలియజేసి, ఎన్జీవోల తరఫున ఆ మేరకు సమ్మతి అందించారు. కాగా, అమ‌ర‌ జవాన్ల కుటుంబాలకు ఆంధ్రప్రదేశ్‌ ప్రైవేట్‌ స్కూళ్ల యాజమాన్యాల తరఫున రూ.25 లక్షల సాయం అందించారు . వివేకానంద స్కూలు యాజమాన్యం రూ.లక్ష , తణుకు ప్రగతి జూనియర్‌ కళాశాల యాజమాన్యం రూ.1.05 లక్షల విలువైన చెక్‌లను సీఎంకు అందజేసింది.

ముందుకొస్తున్న దాత‌లు..
కృష్ణా జిల్లా ముదినేపల్లికి చెందిన కొందరు దాతలు రూ.1.16 లక్షలు విరాళంగా సీఎంకు అందజేశారు. ముదినేపల్లి మండల టీడీపీ అధ్యక్షుడు శోభనాద్రిచౌదరి, డాక్టర్‌ వైఎల్‌ ప్రసాద్‌, పీ కుమారి నాయకత్వంలో వారు చెక్కును సీఎంకు అందజేశారు. హైకోర్టు ప్రభుత్వ న్యాయవాది ఎస్‌ఎస్‌ వర్మ తన వంతుగా రూ. 64,100 విలువైన చెక్‌ను తాత్కాలిక చీఫ్‌ జస్టిస్‌ సీ ప్రవీణ్‌కుమార్‌కు అందించారు. సీఆర్పీఎఫ్‌ కమాండెంట్‌కు ఆ చెక్‌ను జస్టిస్‌ ప్రవీణ్‌కుమార్‌ చేర్చారు.

ఇక‌, ఇప్ప‌టికే రాష్ట్ర ప్ర‌భుత్వం అధికారికంగా అమ‌ర జ‌వాన్ల‌కు ఒక్కోక్క‌రి కుటుంబానికి అయిదు ల‌క్ష‌ల చొప్పున రాష్ట్ర ప్ర‌భుత్వ సాయంగా అందించాల‌ని నిర్ణ‌యించింది. ఇక‌, ఇప్పుడు ఉద్యోగుల స్పూర్తిగా మ‌రి కొన్ని సంస్థ‌లు.. ప్ర‌ముఖు లు అమ‌ర జవాన్ల‌కు సాయం అందించేందుకు ముందుకు రానున్నారు. ఉద్యోగుల స్పూర్తికి ప్ర‌శంస‌లు అందుతున్నా యి. వీరి బాట‌లోనే మిగిలిన వారు న‌డిచే అవ‌కాశం క‌నిపిస్తోంది.

English summary
AP Govt employees Associations announced rs 30 cr for Pulwama martyrs families. Many privates schools also came forward to support the families.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X