వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆలయాల్లో అర్చకులకు ,మత ప్రార్ధనలు చేసే వారికి రూ.5 వేలు సాయం.. ఏపీ ప్రభుత్వ ఉత్తర్వులు

|
Google Oneindia TeluguNews

కరోనా నియంత్రణా చర్యల్లో భాగంగా దేశమంతా లాక్ డౌన్ విధించడంతో ఆ ప్రభావం ఆలయాలలో అర్చకత్వం మీద ఆధారపడి జీవనం సాగించే వారి బతుకులను కుదేలు చేస్తుంది. ఇక అర్చకులనే కాదు మసీదుల్లో ఇమామ్, మౌజమ్, చర్చ్ లలో పాస్టర్లను సైతం కరోనా లాక్ డౌన్ కష్టాలలోకి నెట్టింది . వీరిని ఆదుకోటానికి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వారందరికీ రూ. 5 వేల ఆర్ధిక సాయం అందించనుంది.

తెలుగురాష్ట్రాల్లో కొత్త ప్రయోగం .. కొబ్బరిపీచుతో గ్రామీణ రోడ్ల నిర్మాణంతెలుగురాష్ట్రాల్లో కొత్త ప్రయోగం .. కొబ్బరిపీచుతో గ్రామీణ రోడ్ల నిర్మాణం

లాక్ డౌన్ తో కష్టాల్లో అర్చకులు , మత ప్రార్ధనలు చేసేవారు

లాక్ డౌన్ తో కష్టాల్లో అర్చకులు , మత ప్రార్ధనలు చేసేవారు

ప్రపంచ వ్యాప్తంగా కరోనా తన ప్రభావాన్ని చూపిస్తుంది. ఇక మనదేశంలో కూడా కరోనా విస్తరిస్తుంది. ఇక ఏపీలో కరోనా కేసులు ఇంకా నమోదు అవుతూనే ఉన్నాయి. ఇక ఈ క్రమంలో లాక్ డౌన్ విధించారు. దీంతో ఆలయాల్లో పూజలు చేసి జీవనం సాగించే అర్చకుల జీవనం ఇప్పుడు చాలా దుర్భరంగా మారింది. అర్చకులకు , మతపరమైన ప్రార్ధనలు నిర్వహించే వారికి జీవనభృతి కరువయింది. వాళ్ళ కష్టాన్ని అర్ధం చేసుకున్న సీఎం జగన్ ఆర్ధిక ఇబ్బందులతో సతమతమవుతున్నా సరే వారికి ఆర్ధిక సాయం చెయ్యాలని నిర్ణయం తీసుకున్నారు.

 ఒకసారి సహాయం కింది 5,000 రూపాయలు ..67, 858 మందికి లబ్ది

ఒకసారి సహాయం కింది 5,000 రూపాయలు ..67, 858 మందికి లబ్ది

ఇక అందులో భాగంగా అర్చకులకు, ఇమామ్, మౌజమ్, పాస్టర్ లకు ఒకసారి సహాయం కింది 5,000 రూపాయలు మంజూరు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. లాక్ డౌన్ కారణంగా వారందరినీ ఆర్థికంగా ఆదుకోవాలని నిర్ణయం తీసుకున్న ఏపీ సర్కార్ ఈ పథకం కింద మొత్తం 33 కోట్ల 92 లక్షల రూపాయల నిధులను మంజూరు చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 67, 858 మందికి లబ్ది చేకూరుతుందని తెలుస్తుంది. వీరిలో 31,017 మంది అర్చకులకు లబ్ది చేకూరనుంది. అలాగే 7,000 మంది ఇమామ్ మరియు మౌజమ్ లకు ఆర్ధిక సాయం అందనుంది. 29,841 మంది పాస్టర్ లకు కూడా దీంతో లబ్ది చేకూరుతుంది.

Recommended Video

AP Minister Vellampalli Srinivas Satires On Pawan Kalyan
ఆర్ధిక కష్టాలున్నాసరే వారికి ఆర్ధిక భరోసా ఇచ్చిన సీఎం జగన్

ఆర్ధిక కష్టాలున్నాసరే వారికి ఆర్ధిక భరోసా ఇచ్చిన సీఎం జగన్

లాక్‌డౌన్ క్రమంలో ఆలయాల్లో భక్తుల దర్శనాలు నిలిపివేశారు. దీంతో ఆదాయం కోల్పోయిన అర్చకులు కడు దీన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఇక వారందరినీ ఆదుకునేందుకు ప్రభుత్వం చొరవ తీసుకుంది. కరోనా కొట్టిన దెబ్బకు ఆర్ధికంగా కుదేలైనా సరే సీఎం జ‌గ‌న్ నిరుపేదలైన అర్చకులను , మత ప్రార్ధనలు చేసే వారిని ఆదుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. చిన్న ఆలయాల్లో పనిచేసే అర్చకులకు రూ. 5,000లు గ్రాంట్‌ రూపంలో చెల్లించనున్నట్లు దేవదాయ శాఖ మంత్రి శ్రీనివాసరావు వెల్లడించారు . అదే విధంగా ఇమామ్, మౌజం, పాస్టర్ లకు కూడా ఒకసారి సహాయం కింది 5000 రూపాయలు మంజూరు చేయాలనీ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది .

English summary
The AP government has decided to serve priests pastors in churches, imams and mouzams in mosques. ap govt will provide financial assistance to 5,000 people who are struggling during the lockdown.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X