రూ.65 లక్షలు సీజ్
దేశ ప్రధాని పెద్ద నోట్లు రద్దు నిర్ణయం నల్లధనం ఉన్నవారి గుండెల్లో గుబులు పుట్టిస్తున్నది. వారి వద్ద ఉన్న నల్లధనాన్ని ఎలాగైనా తెల్లధనంగా మార్చుకొవాలన్న తపనతో పలువురు..
హైదరాబాద్: దేశ ప్రధాని పెద్ద నోట్లు రద్దు నిర్ణయం నల్లధనం ఉన్నవారి గుండెల్లో గుబులు పుట్టిస్తున్నది. వారి వద్ద ఉన్న నల్లధనాన్ని ఎలాగైనా తెల్లధనంగా మార్చుకొవాలన్న తపనతో పలువురు.. తప్పుదారులు పడుతున్నారు. ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం గుళ్ళాపల్లి గ్రోత్ సెంటర్ సమీపంలో ఓ కారులో అక్రమంగా తరలిస్తున్న 65 లక్షల రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పలు ప్రాంతాల్లో నల్లధనాన్ని మార్చుకునేందుకు వివిధ మార్గాల ద్వారా అక్రమంగా తరలిస్తున్నారనే సమాచారంతో జిల్లా వ్యాప్తంగా జాతీయ రహదారులపై పోలీసులు నాకాబందీ నిర్వహించారు.












Click it and Unblock the Notifications