హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రయాణికురాలిపై బస్సు డ్రైవర్ ఘాతుకం: చాయ్ గొడవలో వ్యక్తి హత్య

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదు నగరంలోని అంబర్‌పేట ఛే నంబర్ దగ్గర బస్సులో ఘర్షణ జరిగింది. సిగ్నల్ దగ్గర బస్సు ఆపాలని డ్రైవర్‌తో మహిళ వాగ్వాదానికి దిగింది. దీంతో ఆగ్రహానికి గురైన డ్రైవర్ ఫైర్ సిలిండర్‌కో మహిళపై దాడి చేశాడు.

మహిళ డ్రైవర్‌ను చితకబాదింది. మహిళలకు గాయాలు కావడంతో తోటి ప్రయాణికులు డ్రైవర్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మహిళ తలపై గాయంతో రక్తం కారడం టీవీ చానెళ్ల దృశ్యాల్లో కనిపించింది.

ఇదిలావుంటే, హైదరాబాదులోని బేగంపేటలో దారుణమైన సంఘటన జరిగింది. చాయ్ కోసం జరిగిన ఘర్షణలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. చాయ్ కోసం గుర్తు తెలియని వ్యక్తులు టీ స్టాల్ యజమానిని కత్తులతో పొడిచి చంపారు. చాయ్ తేవడంలో ఆలస్యం జరిగిందనే కారణంతో వారు దాడికి దిగినట్లు సమాచారం.

RTC bus driver attacks lady passenger: Tea stall owner killed

ఆస్పత్రికి తరలిస్తుండగానే దాడిలో గాయపడిన టీ స్టాల్ యజమాని జహంగీర్ ప్రాణాలు విడిచాడు. అతనిపై దాడి జరిగిన ఫుటేజీ దృశ్యాలను తెలుగు టీవీ చానెళ్లు ప్రసారం చేశాయి. టీ తేవడంలో జరిగిన ఆలస్యం కారణంగానే ఈ హత్య జరిగినట్లు చెబుతున్నారు. అయితే, దీని వెనక మరేమైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు ఆలోచన చేస్తున్నారు.

కాగా, కరీంనగర్ జిల్లాలోని గోదావరిఖని సంతోష్‌నగర్‌లో విషాద సంఘటన చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో దంపతులు కుమారుడితో సహా ఆత్మహత్యాయత్నం చేశారు. వీరిని గమనించిన స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

English summary
A bus driver attcked lady passenger for asking to stop the bus at Amberpet in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X