వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆర్టీసీ బస్సులే మొబైల్ రైతు బజార్లు..?, పట్టణాలు, గ్రామాల్లో.. వైఎస్ఆర్ జనతా బజార్లు..

|
Google Oneindia TeluguNews

తఏపీ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. లాక్ డౌన్ సమయంలో ఆర్టీసీ బస్సుల్లో కూరగాయాలు విక్రయించిన సంగతి తెలిసిందే. అయితే దాంతో లాభాలను ఆర్జించడంతో ఎంపికచేసిన బస్సులను మొబైల్ రైతు బజార్లుగా మార్చబోతున్నారు. దీనికి వైఎస్ఆర్ రైతు జనతా బజార్లు అని పేరు పెట్టబోతున్నారు.

ఆర్టీసీ బస్సులు నిర్దారిత కిలోమీటర్లు పూర్తయితే పక్కన పెడతారు. స్కాప్ కింద పక్కన పెడతారు, లేదంటే పార్టులుగా విడదీసి విక్రయిస్తారు. దీంతో సంస్థకు పెద్దగా ప్రయోజనం ఉండదు. కానీ తప్పని పరిస్థితుల్లో అలా చేస్తుంటారు. కానీ లాక్ డౌన్ తొలినాళ్లలో ఆర్టీసీ బస్సులను రైతు బజార్లుగా మార్చి కూరగాయాలను విక్రయించారు. పట్టణాలు, గ్రామాలకు తీసుకెళ్లి విక్రయించగా.. ప్రజల నుంచి కూడా మంచి స్పందన వచ్చింది.

rtc buses to be mobile rythu bazars in ap..

కాలం చెల్లిన బస్సుల ద్వారా గ్రామాలు/ పట్టణాల్లో కూరగాయాలు విక్రయిస్తారు. వీటికి వైఎస్ఆర్ జనతా బజార్లు అని పేరు పెడతారు. 13 జిల్లాల్లో 52 బస్సులను సంచార రైతు బజార్లుగా మార్చబోతున్నారు. వీటికి జనం నుంచి మంచి స్పందన వస్తోందని ఆశిస్తున్నారు. లాక్‌డౌన్‌ సమయంలో ఆర్టీసీ మొబైల్‌ రైతు బజార్లకు వినియోగదారుల నుంచి స్పందన రాగా.. ఆర్టీసీ మార్క్‌ఫెడ్‌తో ఒప్పందం చేసుకుంది.

నాన్‌ టిక్కెట్‌ రెవెన్యూ కింద ఆర్టీసీకి ఆదాయం ఆర్జించేందుకు ఉపకరిస్తోంది. ఆర్టీసీ వైద్య ఆరోగ్య శాఖకు సంజీవని బస్సులు, మార్క్‌ఫెడ్‌కు మొబైల్‌ రైతు బజార్లు బస్సులను తిప్పేందుకు అగ్రిమెంట్‌ చేసుకుంది.

English summary
rtc buses to be mobile rythu bazars in andhra pradesh state. 52 buses to be rythu bazars.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X