కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆందోళన: టీ బస్సుల్లో వారికి, ఏపీ బస్సుల్లో వీరికి నో!

By Srinivas
|
Google Oneindia TeluguNews

కర్నూలు/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలులో బస్సు పాసుల విషయంలో వివాదం తలెత్తింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన బస్సులలో తెలంగాణ విద్యార్థులకు, తెలంగాణ రాష్ట్రానికి చెందిన బస్సులలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన విద్యార్థుల బస్సు పాసులను నిరాకరించారు.

దీంతో విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. దీని పైన ఆర్టీసీ ఎండీ స్పందించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులను ఇరు రాష్ట్రాల బస్సులలో అనుమతించాలని చెప్పారు.

RTC MD clarifies on bus passes

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డీఎస్సీ-2014 నోటిఫికేషన్ షెడ్యూల్ విడుదలయింది. మొత్తం 9,061 ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి మంత్రి గంటా శ్రీనివాస రావు షెడ్యూల్‌ను విడుదల చేశారు. డిసెంబర్ 3 నుంచి జనవరి 17 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు.

మే 9, 10, 11 తేదీల్లో ఉపాధ్యాయ నియామక పరీక్షలు జరుగుతాయి. జూన్ 28న ఉపాధ్యాయ నియామక రాత పరీక్షలు జరుగుతాయి. పోస్టుల భర్తీలో స్కూల్ అసిస్టెంట్లు 1,849, భాషా పండితులు 812, పీఈటీ 156, ఎస్జీటీ 6,244 పోస్టులకు షెడ్యూల్ విడుదలయింది. వాటికి సంబంధించిన నోటిఫికేషన్ రేపు విడుదలకానుంది.

English summary
RTC MD clarifies on bus passes
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X