హైకోర్టు తీర్పు అందలేదు, సమ్మె కొనసాగిస్తాం: ఆర్టీసి సంఘాలు
హైదరాబాద్: వెంటనే విరమించాలని ఉమ్మడి హైకోర్టు ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఆర్టీసీ కార్మిక సంఘాలు తమ సమ్మెను కొనసాగించాలని నిర్ణయించాయి. చట్ట ప్రకారం నోటీస్ ఇచ్చి సమ్మెలోకి వెళ్లామని, కోర్టు తీర్పు కాపీ తమకు అందలేదని, అప్పటి వరకూ సమ్మె యథావిధిగా కొనసాగుతుందని ఈయూ, టీఎంయూ నేతలు స్పష్టం చేశారు.
తీర్పు ప్రతి అందిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని ఈయూ నేత పద్మాకర్ తేల్చిచెప్పారు. హైకోర్టు తీర్పుతో షాక్‌కు గురయ్యామని, సమ్మె విషయంలో హైకోర్టు నిర్ణయాన్ని గౌరవిస్తామని టీఎంయూ నేత అశ్వత్థామ రెడ్డి అన్నారు. హైకోర్టు నిర్ణయంపై అప్పీలుకు వెళ్లడం లేదా విధుల్లో చేరడంపై ఆలోచిస్తామని చెప్పారు.

న్యాయస్థానం తీర్పును స్వాగతిస్తున్నామని పిటీషనర్ సీఎల్ వెంకట్రావు తెలిపారు. ప్రజలు, విద్యార్థుల సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ కార్మికులు సమ్మెను విరమించాలని కోరారు.
ఆర్టీసీ కార్మికుల సమ్మెను సవాల్ చేస్తూ ఎంసీఐ మాజీ సభ్యుడు సీఎల్ వెంకట్రావు, చిత్తూరు వాసి మహ్మద్ గౌస్ వేసిన హౌస్‌మోషన్ పిటీషన్‌ను విచారించిన హైకోర్టు ధర్మాసనం ఆర్టీసీ కార్మికుల సమ్మె చట్ట విరుద్ధమని, కార్మికులు తక్షణమే విధుల్లో చేరాలని ఆదేశాలు జారీ చేయడం తెలిసిందే.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications