వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆర్టీఐ కమిషనర్ల నియామకంపై కిరణ్‌కు హైకోర్టు షాక్

By Srinivas
|
Google Oneindia TeluguNews

High Court
హైదరాబాద్: రాష్ట్ర సమాచార కమిషనర్ల నియామకంపై రాష్ట్ర ప్రభుత్వానికి గురువారం ఎదురు దెబ్బ తగిలింది. సమాచార కమిషనర్ల నియామకాన్ని పునఃసమీక్షించుకోవాలని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని గురువారం ఆదేశించింది.

గవర్నర్ నరసింహన్ తొలుత ఆమోదించని ఇంతియాజ్, విజయ నిర్మల, వెంకటేశ్వర్లు, తాంతియా కుమారిల నియామకంపై పునరాలోచన చేయాలని, వారి స్థానంలో ఆరు వారాల్లోగా కొత్త వారిని నియమించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

గవర్నర్ ఆమోదించని ఇంతియాజ్, విజయ నిర్మల, వెంకటేశ్వర్లు, తాంతియా కుమారిలను తొలగించాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అనే స్వచ్ఛంధ సంస్థ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన కోర్టు నలుగురి నియామకంపై పునఃసమీక్షించి, కొత్త వారిని నియమించాలని ఆదేశించింది.

కాగా, ఎనిమిది మందిని ఆర్టీఐ కమిషనర్లుగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గతంలో గవర్నర్‌కు ఫైల్ పంపగా, అందులో నలుగురికి గవర్నర్ ఆమోద ముద్ర వేయలేదు. ఆ నలుగురి ఫైలును ప్రభుత్వం మరోసారి పంపించి గవర్నర్‌చే ఆమోద ముద్ర వేయించుకుంది. దీంతో స్వచ్ఛంధ సంస్థ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

అప్పుడు విజయ్ బాబు, ప్రభాకర్, మధుకర్ రాజు, రతన్‌లకు గవర్నర్ ఆమోద ముద్ర వేశారు. ఇంతియాజ్, విజయ నిర్మల, వెంకటేశ్వర్లు, తాంతియా కుమారిల ఫైలును కిరణ్ ప్రభుత్వం రెండోసారి పంపించి ఆమోద ముద్ర వేయించుకుంది.

English summary
The state High Court gave shock to Kiran Kumar Reddy's government on four RTI commissioners appointment.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X