వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అధికార పార్టీ అయినా వైసీపీ ఎమ్మెల్యే ధర్నా చేశారు .. జగన్ స్పందించారు .. ఎందుకంటే

|
Google Oneindia TeluguNews

ఏపీలో వైసీపీ పాలనలో ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఎక్కడైనా అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఆందోళనల జోలికి వెళ్ళరు ఎందుకంటె పాలించేది తమ ప్రభుత్వం కాబట్టి. ప్రతిపక్ష పార్టీలు మాత్రం తమ నిరసనలు తెలుపుతాయి . కానీ ఏపీలో ప్రతిపక్షం ప్రతిపక్ష పాత్ర పోషించే స్థితిలో లేదు. ఇక అధికార పార్టీ అయినా ఓ ఎమ్మెల్యే రైతుల అసమస్యాల సాధన కోసం ధర్నా చేపట్టి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశారు.

చంద్రబాబే టార్గెట్ ..జగన్ నిర్ణయాన్ని స్వాగతించిన మోడీ .. పీపీఏపై జగన్ కమిటీ అందుకేచంద్రబాబే టార్గెట్ ..జగన్ నిర్ణయాన్ని స్వాగతించిన మోడీ .. పీపీఏపై జగన్ కమిటీ అందుకే

రాళ్ళపాడు ప్రాజెక్ట్ నుండి కామధేనువు ప్రాజెక్ట్ కు నీరు తరలించటంపై రైతుల ధర్నా ..వారితో పాటు ధర్నాలో వైసీపీ ఎమ్మెల్యే

రాళ్ళపాడు ప్రాజెక్ట్ నుండి కామధేనువు ప్రాజెక్ట్ కు నీరు తరలించటంపై రైతుల ధర్నా ..వారితో పాటు ధర్నాలో వైసీపీ ఎమ్మెల్యే

ఇక అసలు విషయానికి వస్తే అధికార వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రైతులతో కలిసి ధర్నాకు దిగారు. ప్రకాశం జిల్లా రాళ్లపాడు ప్రాజెక్ట్‌ వద్ద గత ప్రభుతం ఇచ్చిన జీవో రద్దు కోరుతూ రైతులు తీవ్ర ఆందోళనకు దిగారు . రాళ్లపాడు ప్రాజెక్టు నుంచి కామధేనువు ప్రాజెక్టుకు నీరు తరలించేలా గత ప్రభుత్వం జీవో ఇచ్చింది. దీంతో రాళ్ళపాడు ప్రాజెక్ట్ కింద ఆయకట్టు రైతులకు సాగునీటి సమస్యలు ఎక్కువ కావటం తో రైతులు పెద్ద ఎత్తునఆందోళన బాట పట్టారు. ఇక ఈ సమాచారం తెలిసిన వైసీపీ ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి రాళ్లపాడు ప్రాజెక్టు వద్దకు వెళ్లారు. రైతుల న్యాయమైన డిమాండ్ కు తన మద్దతునిస్తూ ఆయన కూడా రైతులతో కలిసి ధర్నాకు దిగారు.

మాగుంట మహీధర్ రెడ్డి ధర్నాపై ఆరా తీసిన వైవీ సుబ్బా రెడ్డి .. జగన్ కు సమాచారం ..రైతులకు జగన్ హామీ

మాగుంట మహీధర్ రెడ్డి ధర్నాపై ఆరా తీసిన వైవీ సుబ్బా రెడ్డి .. జగన్ కు సమాచారం ..రైతులకు జగన్ హామీ

రాళ్లపాడు ప్రాజెక్టు నుంచి కామధేనువు ప్రాజెక్టుకు నీరు తరలించేలా గత ప్రభుత్వం ఇచ్చిన జీవోను రద్దు చేయాలంటూ ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే తమతో కలిసి ధర్నాలో పాల్గొనటంతో రైతులు ఆశ్చర్యపోయారు.అధికార పార్టీ ఎమ్మెల్యే తమకు మద్దతుగా నిలవటంతో సంతోషం వ్యక్తం చేశారు. ఇక రాళ్లపాడు ప్రాజెక్టు వద్ద ఎమ్మెల్యే ధర్నాకు దిగారంటూ వార్తలు రావడంతో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి అసలు విషయం ఏమిటంటూ ఆరా తీశారు . ఇక విషయం తెలుసుకుని సీఎం జగన్ దృష్టికి రాళ్ళ పాడు ప్రాజెక్ట్ ఇష్యూ తీసుకెళ్లారు. దీంతో ఈ ఘటనపై ముఖ్యమంత్రి వైయస్ జగన్ స్పందించారు. రాళ్లపాడు ప్రాజెక్టు నుంచి నీరు తీసుకెళ్లే అంశంపై అధికారులను అడిగి తెలుసుకున్న సీఎం జగన్ అనంతరం జీవోను రద్దు చేస్తామని హామీ ఇవ్వడంతో ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి ధర్నా విరమించారు.

అధికార పక్షంలో ఉన్నా రైతుల కోసం ఆందోళన చేసిన వైసీపీ ఎమ్మెల్యే

అధికార పక్షంలో ఉన్నా రైతుల కోసం ఆందోళన చేసిన వైసీపీ ఎమ్మెల్యే

మొత్తానికి అధికార పక్షంలో ఉండి ఆందోళన చేసి ఏపీ సీఎం దృష్టికి రైతుల సమస్యను తీసుకెళ్ళారు ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి. ప్రస్తుతం ఈ విషయం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు కారణం అవుతుంది. మొత్తానికి మాగుంట మహీధర్ రెడ్డి మాత్రం ప్రస్తుతం రైతుల సమస్యపై సీఎం స్పందించటానికి కారణం అయ్యారని రైతుల్లో సంతోషం వ్యక్తం అవుతుంది.

English summary
Farmers have gone through a large scale concern with irrigation problems that have been undertaken under the Rallapadu project. This information was known to the MLC Magunta Maheedhar Reddy . He supported the farmers' legitimate demand and he went to the dharna with farmers. MLA Manugunta Reddy demanded to cancel the Govt given by the previous government to evict water from the Ralla padu project to the Kamadhenu project.Farmers were surprised by the MLA's participation in the dharna. They were happy that the ruling party MLA was supporting them. Jagan known about the issue and promised to solve the problem of farmers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X