• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

జగన్, కేసీఆర్ భేటీపై ఊహాగానాలు- ఆ తర్వాతే ముహుర్తం- నీటి పంచాయతీపై తెగేది అప్పుడే

|

ఏపీ, తెలంగాణ మధ్య జలజగడం ముదురుతోంది. ఇప్పటికే ఏపీలో నిర్మిస్తున్న రాయలసీమ లిఫ్ట్ వ్యవహారాన్ని తెలంగాణ కెలికితే... తెలంగాణలోని పాలమూరు-రంగారెడ్డి, దిండి, కల్వకుర్తి లిఫ్ట్ ల వ్యవహారాన్ని ఏపీ తెరపైకి తెచ్చింది. దీంతో వీరిద్దరి మధ్య జగడాన్ని తీర్చేందుకు ఏం చేయాలో తెలియక కేంద్రం తలపట్టుకుంటోంది. అయితే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య తగవు తీర్చేందుకు కృష్ణాబోర్డు, అపెక్స్ కౌన్సిల్ భేటీలు జరగాల్సి ఉండగా.. అవి కూడా నిర్వహించలేని పరిస్ధితి. మరోవైపు సీఎంలు కేసీఆర్, జగన్ మధ్య భేటీ కోసం డిమాండ్లు పెరుగుతున్నాయి. ఈ భేటీపై కొత్త ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి.

 జగన్, కేసీఆర్ పై పెరుగుతున్న ఒత్తిడి

జగన్, కేసీఆర్ పై పెరుగుతున్న ఒత్తిడి

ఏపీ-తెలంగాణ మధ్య సాగుతున్న జలజగడానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జగన్, కేసీఆర్ చర్చలు జరపాలనే డిమాండ్లు నానాటికీ పెరుగుతున్నాయి. రాజకీయ పార్టీల నుంచే కాక సాధారణ ప్రజల నుంచి కూడా ఈ మేరకు ఒత్తిడి పెరుగుతోంది. గతంలో సత్సంబంధాలు నెరుపుకున్న ఇద్దరు సీఎంలు ఇప్పుడు ఎందుకు కలవడం లేదని, కీలక అంశంపై చర్చలు జరిపేందుకు ఎందుకు వెనుకాడుతున్నారన్న సందేహాలు తలెత్తుతున్నాయి. దీంతో సహజంగానే కేసీఆర్, జగన్ పై ఒత్తిడి పెరుగుతోంది.

జగన్, కేసీఆర్ సైలెన్స్ పై అనుమానాలు

జగన్, కేసీఆర్ సైలెన్స్ పై అనుమానాలు

ఏపీ-తెలంగాణ మధ్య తాజా జల జగడానికి తెరదీసింది కేసీఆరే. ఏపీ నిర్మిస్తున్న రాయలసీమ లిఫ్ట్ పై తెలంగాణ కేబినెట్ భేటీలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలతోనే ఈ వివాదం రాజుకుంది. ఇప్పుడు కేసీఆర్ పూర్తిగా మౌనం వహిస్తున్నారు. తొలుత ఏపీపై తీవ్ర విమర్శలతో విరుచుకుపడిన తెలంగాణ మంత్రులు కొద్దిరోజులుగా మౌనంగా ఉంటున్నారు. ఇటు ఏపీ నుంచి కూడా విమర్శల దాడి తగ్గింది. సీఎం జగన్ అయితే మరోసారి కేసీఆర్ కు స్నేహహస్తం చాచారు. అయినా ఎవరూ చర్చల గురించి మాత్రం నోరు మెదపడం లేదు. దీంతో వీరి మౌనం వెనుక బలమైన కారణాలే ఉండొచన్న ప్రచారం జోరుగా సాగుతోంది.

హుజురాబాద్ ఎన్నిక తర్వాతే

హుజురాబాద్ ఎన్నిక తర్వాతే

హుజురాబాద్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధిగా నిలబడిన టీఆర్ఎస్ మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ను ఓడించేందుకు కంకణం కట్టుకున్న కేసీఆర్.. ఏపీ-తెలంగాణ వాటర్ వార్ ను తెరపైకి తెచ్చారన్న ప్రచారం ఇప్పటికే జోరుగా సాగుతోంది. తెలంగాణ సెంటిమెంట్ ను రగల్చడం ద్వారా హుజురాబాద్ గెలిచేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని, దీనికి ఏపీ సీఎం జగన్ కూడా సహకరిస్తున్నారనే ప్రచారం రెండు తెలుగు రాష్ట్రాల్లో సాగుతోంది. దీంతో హుజురాబాద్ ఉపఎన్నిక ముగిసేవరకూ వీరిద్దరూ భేటీ అయ్యే అవకాశాలు కనిపించడం లేదు.

హై ఓల్టేజ్ వార్ పైనే తెలుగు రాష్ట్రాల చూపు

హై ఓల్టేజ్ వార్ పైనే తెలుగు రాష్ట్రాల చూపు

హుజురాబాద్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధిగా బరిలోకి దిగిన ఈటల రాజేందర్ ను ఓడించేందుకు కేసీఆర్.. త్వరలో పార్టీలో చేరుతున్న టీటీడీపీ మాజీ అధ్యక్షుడు ఎల్.రమణను పోటీ పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ఎల్.రమణ, ఈటల మధ్య హోరాహోరీ పోరు తప్పేలా లేదు. దీంతో ఏపీ-తెలంగాణ వాటర్ వార్ కు కూడా లింక్ ఉందన్న ప్రచారాల నేపథ్యంలో ఈ ఉపఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారిపోయింది.

టీఆర్ఎస్, బీజేపీయే కాదు ఏపీలో వైసీపీ, టీడీపీల చూపూ హుజురాబాద్ ఉపఎన్నికపైనే ఉంది. ఈ ఉపఎన్నిక ముగిసిపోతే వాటర్ వార్ కు ఆటోమేటిగ్గా తెరపడుతుందని లేకపోతే కేసీఆర్, జగన్ భేటీ జరిగి దీనికో పరిష్కారం లభిస్తుందనే అంచనాలు పెరుగుతున్నాయి. మరోవైపు వాటర్ వార్ తో మరోసారి ఏపీ-తెలంగాణ పోరులో ఇరుకునపడిన టీడీపీ సైతం ఈ ఉపఎన్నిక ఎప్పుడు జరుగుతుందా, ఎప్పుడు వాటర్ వార్ కు తెరపడుతుందా అని ఎదురుచూస్తోంది.

English summary
rumours looms over two telugu states chief ministers ys jagan and kcr's meeting on ongoing water war of projects.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X