విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కదులుతున్న బస్సులో మంటలు .. డ్రైవర్ అలర్ట్ తో తప్పిన ప్రమాదం

|
Google Oneindia TeluguNews

విజయవాడ : విజయవాడ నుంచి హైదరాబాద్ బయల్దేరిన గరుడ బస్సులో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన బస్సు డ్రైవర్ ప్రయాణికులను అలర్ట్ చేయడంతో ప్రమాదం తప్పింది. అగ్ని ప్రమాదం నుంచి తప్పించుకోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

బయల్దేరిన కాసేపటికే మంటలు ..
విజయవాడ నుంచి గరుడ బస్సు బయల్దేరిన కొద్దిసేపటికే మంటలు వచ్చాయి. బస్సు కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం జూపూడి వద్దకు చేరుకోగానే మంటలను డ్రైవర్ గుర్తించాడు. వెంటనే బస్సు ఆపి ప్రయాణికులను అప్రమత్తం చేశాడు. ప్రయాణికులను కిందకు దింపి .. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వెంటనే రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేశారు. బస్సు వెనుకభాగం మొత్తం కాలిపోయాయి. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నారు. డ్రైవర్ అలర్ట్ గా ఉండటంతో ప్రమాదం తప్పింది. ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

running bus fire broken .. driver alert passengers are safe

షార్ట్ సర్క్యూట్ వల్లే మంటలు ?
ఎలక్ట్రికల్ వైరింగ్ లో షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగినట్టు నిర్ధారించారు. మంటలు చెలరేగిన కాసేపటికే బస్సు వెనుకభాగం మొత్తం వ్యాపించాయి. మంటల తీవ్రతతో బ్యాక్ సైడ్ మొత్తం కాలిపోయింది. కాసేపు ఆగితే పరిస్థితి ఏంటని ప్రయాణికులు మదనపడుతున్నారు. ఆ తర్వాత ప్రయాణికులను మరో బస్సులో హైదరాబాద్ కు పంపించారు.

English summary
Shortly after the bus departure from Vijayawada, the fire broke out. The driver Immediately the bus stopped and alerted the passengers. The passengers were dropped down and informed the firefighters. Immediately fire crews fire. The whole back of the bus was scorched. There were 50 passengers in the bus during the accident. The driver was alert and there was no danger.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X