హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రమాదం తప్పింది, ఇంజిన్ నుండి విడిన బోగీ (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రెడ్ సిగ్నలే కర్నాటక సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ రైలు ప్రయాణీకులను ప్రమాదం నుండి కాపాడింది. సిగ్నల్ గమనించిన డ్రైవర్ రైలు వేగం తగ్గించాడు. ఈ సమయంలో రైలు బోగీ స్క్రూ కప్లింగ్ అకస్మాత్తుగా విరిగిపోయింది. రైలు వేగంతో వెళ్తున్న సమయంలో బోగీల కప్లింగ్ పోతే పట్టాలు తప్పి పెను ప్రమాదం జరిగేదని రైల్వే వర్గాలు చెబుతున్నాయి.

యశ్వంతాపూర్ నుండి ఢిల్లీ హజ్రత్ నిజాముద్దీన్ వెళ్లే కర్నాటక సంపర్క్ క్రాంతికి ప్రయాణికుల నుండి ఎంతో డిమాండ్ ఉంది. దీంతో రైలు 24 బోగీలతో రాకపోకలు సాగిస్తోంది. ఈ ఎక్స్‌ప్రెస్ రైలు నగరంలోని కాచిగూడ రైల్వే స్టేషన్లో మాత్రం ఆగుతుంది. సోమవారం ఉదయం ఏడు గంటలకు రావాల్సిన ఈ రైలు కాచిగూడ స్టేషన్ చేరుకునే సరికి ఎనిమిది ఇరవై అయింది.

ఉప్పుగూడ రైల్వే గేట్ వద్ద రైళ్ల రాకపోలక కారణంగా కాపలాదారు గేటు వేయకుండా రెడ్ సిగ్నల్‌ను వేసి ఉంచాడు. గమనించిన రైలు డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి రైలు వేగాన్ని తగ్గించాడు. ఈ సమయంలో 6-7 బోగీల మధ్య కప్లింగ్ స్క్రూ ప్రమాదవశాత్తు విరిగిపోయింది. దీంతో వెనుక ఉన్న 19 బోగీలు ఇంజిన్ నుండి విడిపోయాయి. గమనించిన డ్రైవర్ రైలును ముందు స్టేషన్ ఫలక్‌నుమాలో ఆపాడు.

సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్

సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్

రెడ్ సిగ్నలే కర్నాటక సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ రైలు ప్రయాణీకులను ప్రమాదం నుండి కాపాడింది. సిగ్నల్ గమనించిన డ్రైవర్ రైలు వేగం తగ్గించాడు. ఈ సమయంలో రైలు బోగీ స్క్రూ కప్లింగ్ అకస్మాత్తుగా విరిగిపోయింది. రైలు వేగంతో వెళ్తున్న సమయంలో బోగీల కప్లింగ్ పోతే పట్టాలు తప్పి పెను ప్రమాదం జరిగేదని రైల్వే వర్గాలు చెబుతున్నాయి.

సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్

సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్

యశ్వంతాపూర్ నుండి ఢిల్లీ హజ్రత్ నిజాముద్దీన్ వెళ్లే కర్నాటక సంపర్క్ క్రాంతికి ప్రయాణికుల నుండి ఎంతో డిమాండ్ ఉంది. దీంతో రైలు 24 బోగీలతో రాకపోకలు సాగిస్తోంది. ఈ ఎక్స్‌ప్రెస్ రైలు నగరంలోని కాచిగూడ రైల్వే స్టేషన్లో మాత్రం ఆగుతుంది. సోమవారం ఉదయం ఏడు గంటలకు రావాల్సిన ఈ రైలు కాచిగూడ స్టేషన్ చేరుకునే సరికి ఎనిమిది ఇరవై అయింది.

సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్

సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్

ఉప్పుగూడ రైల్వే గేట్ వద్ద రైళ్ల రాకపోలక కారణంగా కాపలాదారు గేటు వేయకుండా రెడ్ సిగ్నల్‌ను వేసి ఉంచాడు. గమనించిన రైలు డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి రైలు వేగాన్ని తగ్గించాడు. ఈ సమయంలో 6-7 బోగీల మధ్య కప్లింగ్ స్క్రూ ప్రమాదవశాత్తు విరిగిపోయింది. దీంతో వెనుక ఉన్న 19 బోగీలు ఇంజిన్ నుండి విడిపోయాయి. గమనించిన డ్రైవర్ రైలును ముందు స్టేషన్ ఫలక్‌నుమాలో ఆపాడు.

సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్

సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్

దక్షిణ మధ్య రైల్వే జీఎం శ్రీవాస్తవ, హైదరాబాద్ డివిజనల్ మేనేజర్ రాకేష్ ఆరోన్ బాసర వద్ద రైల్వే తనిఖీలో ఉండటంతో సమాచారం అందుకున్న సికింద్రాబాద్ డివిజన్ మేనేజర్ ఎస్కే మిశ్రా ఉన్నతాధికారుల బృందంతో వెంటనే సంఘటన ప్రాంతానికి చేరుకొని పరిస్థితి పర్యవేక్షించారు. ప్రయాణీకులకు అసౌకర్యం కలగకుండా చూసుకున్నారు. అంతరం విచారణకు ఆదేశించారు.

English summary
Passengers of Hazrath Nizamuddin – Yeshwantapur Sampark Kranti Express faced anxious moments when coaches of the train detached between Yakutpura and Uppuguda railway stations in Hyderabad on Monday morning. No casualties were reported in the incident.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X