చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పుట్టపర్తిలో రష్యన్ అనుమానాస్పద మృతి: రేప్ కేసులో పదేళ్ల జైలు

By Pratap
|
Google Oneindia TeluguNews

Ananthapur
అనంతపురం/ చిత్తూరు: అనంతపురం జిల్లా పుట్టపర్తిలో రష్యాకు చెందిన వాల్డ్‌మిర్‌(36) అనే వ్యక్తి శుక్రవారం రాత్రి భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. వాల్డ్‌మిర్‌ గత నెల 26న పుట్టపర్తికి వచ్చారు. చిత్రావతి గుట్టమీద గల ప్రశాంతి భవనంలోని 8వ ఫ్లోర్‌లో గదిని అద్దెకు తీసుకున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. మతి స్థిమితంలేని కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.

పుట్టపర్తిలోని ఓ అపార్ట్‌మెంట్ ఎనిమిదో అంతస్తు పైనుంచి పడి అతను శుక్రవారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మరణించాడు. రష్యాకు చెందిన కుచ్‌మూస్త్ వ్లాదిమిర్ (36) శుక్రవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో తాను నివాసముంటున్న అపార్ట్‌మెంట్ పైనుంచి పక్క భవనంపై పడ్డాడు. దీంతో అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. నవంబర్ 26వ తేదీ వ్లాదిమిర్ పుట్టపర్తికి చేరుకున్నాడు.

అతని తల్లి గత ఏడాదిగా ఇదే అపార్ట్‌మెంట్‌లో 803వ నెంబరు గదిలో అద్దెకు ఉంటోంది. ఆమె రష్యాకు వెళ్లడంతో కుమారుడు వ్లాదిమిర్ బాబా సమాధి దర్శనార్థం పుట్టపర్తికి వచ్చాడు. శుక్రవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో అపార్ట్‌మెంట్‌లోని 8వ అంతస్తులో ఉంటున్న గది కిటికీలోంచి పక్కనే ఉన్న భవనంపై పడ్డాడు. వ్లాదిమిర్‌కు మతిస్థిమితంగా లేదని డిఎస్పీ తెలిపారు.

ఇదిలావుంటే, అయిదేళ్ళ బాలికను కిడ్నాప్‌ చేసి అత్యాచారం చేసిన కేసులో నిందితుడికి న్యాయమూర్తి పదేళ్ళ జైలు శిక్ష, రూ.10వేల జరిమానా విధించారు.తమిళనాడు రాష్ట్రం వేలూరుకు చెందిన ముబారక్‌ చిత్తూరు జిల్లా పలమనేరులోని ఓ హోటల్‌లో పని చేసేవాడు. అదే హోటల్లో పని చేసే ఓ మహిళ ఐదేళ్లకుమార్తెను కిడ్నాప్‌ చేసిన ముబారక్‌ అత్యాచారం చేసి పరా రయ్యాడు. పోలీసులు ముబారక్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

English summary
A Russian dead at puttaprthi jumping from an apartment in ananthapur district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X