• search
  • Live TV
విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

బ్యూటీషియన్‌పై దాడి కేసులో ఎన్నో ట్విస్ట్‌లు: ప్రియుడి మృతి, 'ఎస్' వెనుక మిస్టరీ!

By Srinivas
|

విజయవాడ: బ్యూటీషియన్ పద్మపై హత్యాయత్నం కేసులో ఎన్నో కొత్త ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. బ్యూటీషయన్‌పై హత్యాయత్నం కేసులో ప్రధాన నిందితుడు నూతన్ కుమార్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నరసారావుపేటలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.

తాను సహజీవనం చేస్తున్న బ్యూటీషియన్‌పై నూతన్ కుమార్ హత్యాయత్నం చేశాడని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అతను రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. దీంతో కేసు మరో మలుపు తిరిగింది. కేసులు, విచారణకు భయపడి అతను ఆత్మహత్య చేసుకున్నాడా మరేదైనా ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు.

బ్యూటీషియన్‌పై దారుణంగా దాడి

బ్యూటీషియన్‌పై దారుణంగా దాడి

బ్యూటీషియన్ పద్మపై గతవారంలో నూతన్ దాడి చేశాడు. ఆమెకు మత్తు ఇచ్చి, ఒంటిపై బట్టలన్నీ తీసి, కత్తితో పలుమార్లు పొడవడంతో పాటు, చేతులు నరికి, నుదుటిపై 'ఎస్' ఆకారాన్ని చెక్కి, ఎడమ చేతిపై ఎన్ అక్షరాన్ని తొలగించాడు. ఆమె చనిపోయిందని భావించి, అక్కడి నుంచి పారిపోయాడు. ఆ తర్వాత రెండు రోజులకు కొన ఊపిరితో ఉన్న పద్మను ఆమె భర్త గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు.

నూతన్ ఆత్మహత్య

నూతన్ ఆత్మహత్య

ఆమె భర్తకు దూరంగా ఉంటోంది. నూతన్‌తో సహజీవనం చేస్తోందని తెలుసుకున్న పోలీసులు అతని కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. నూతన్ ఎక్కడున్నాడో పోలీసులకు తెలిసి, అరెస్టు చేస్తామని చెప్పారు. అంతలోనే అతను ఆత్మహత్య చేసుకున్నాడు. అతని వద్ద సూసైడ్ నోట్ లభించలేదు. అతని కాల్ డేటాను పోలీసులు పరిశీలించారు.

నూతన్‌ది హత్యనా, ఆత్మహత్యనా?

నూతన్‌ది హత్యనా, ఆత్మహత్యనా?

నూతన్ రైలు పట్టాల వద్ద విగతజీవిగా కనిపించడంతో భయపడి ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తొలుత భావించారు. అయితే అతనిని ఎవరో హత్య చేసి పట్టాలపై పడేసి ఉంటారన్న అనుమానం కూడా వ్యక్తమవుతోంది. పద్మ తన వాంగ్మూలంలో సుబ్బయ్య అనే వ్యక్తి పేరు చెప్పింది. అతను ఎవరన్న విషయంపై విచారిస్తున్నారు. ఈ కేసులో సుబ్బయ్య రెండో నిందితుడు. అతనిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. నూతన్ కుమార్ వద్ద లభించిన ఆధార్ కార్డు ఆధారంగా ఆయన భార్యకు కబురు పెట్టారు. ఆమె తన భర్తను గుర్తించింది.

ఆ అక్షరాల వెనుక మిస్టరీ!

ఆ అక్షరాల వెనుక మిస్టరీ!

బ్యూటీషియన్ పద్మ చేతిని వైద్యులు తొలగించారు. ఐదు రోజులుగా ఎడమ చేతి నరాలు పనిచేయక పోవడంతో రక్త ప్రసరణ నిలిచిపోయింది. ఇన్ఫెక్షన్ సోకిన కారణంగా చేతిని తొలగించామని, రెండో చేతికి చికిత్స జరుగుతోందని డాక్టర్లు తెలిపారు. ఆమె పరిస్థితి విషమంగానే ఉంది. మిగతా అవయవాలు సక్రమంగా పని చేస్తే ఇతర ఆపరేషన్లు చేయనున్నారు. చికిత్సకు ఆమె స్పందించే తీరును బట్టి వైద్యం చేయనున్నారు. కాగా, పద్మ ఎడమ చేతిపై ఉన్న 'ఎన్' అన్న పచ్చబొట్టును కత్తితో చెరిపివేయడం, ఆపై నుదుటిపై 'ఎస్' అనే అక్షరాన్ని రాయడం వెనుక ఉన్న మిస్టరీ... సుబ్బయ్యను అరెస్ట్ చేస్తే వీడుతుందని పోలీసులు భావిస్తున్నారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
In a gory incident, a murderous attempt was made against a lady at Hanuman Junction near here yesterday. The hands and legs of a beautician from Hanuman Junction town in Krishna district were tied up and she was attacked with a knife by a few unidentified persons.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more