వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అయ్యో టీడీపీ గెలుస్తుందని స‌బ్బం హ‌రి జోస్యం చెప్పేసారు ! ఖచ్ఛితంగా తిరగబడుతుందా ?

|
Google Oneindia TeluguNews

మాజీ ఎంపి..స‌బ్బం హ‌రి నాడు వైయ‌స్ కు..ఆయ‌న మ‌ర‌ణం త‌రువాత జ‌గ‌న్ కు ఆప్తుడు. 2014 ఎన్నిక‌ల ముందు జ‌గ‌న్ కు దూర‌మ‌య్యారు. ఇక‌, 2014 ఎన్నిక‌ల పోలింగ్ ముందు రోజు వైసిపి పై వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసి ప‌రోక్షంగా టిడిపికి మేలు చేసారు. ఇక‌, ఇప్పుడు తిరిగి తాజా ఎన్నిక‌ల ఫ‌లితాల పై జోస్యం చెప్పారు. మ‌రి...ఆయ‌న వాద‌న నిజ‌మ‌య్యే అవ‌కాశం ఉందా..

<strong>చంద్ర‌బాబు ఎందుకిలా..సీయ‌స్ తో స‌హా అంద‌రూ కుమ్ముక్కేనా: ఏకాకి అవుతున్నారా..!</strong>చంద్ర‌బాబు ఎందుకిలా..సీయ‌స్ తో స‌హా అంద‌రూ కుమ్ముక్కేనా: ఏకాకి అవుతున్నారా..!

స‌బ్బం హ‌రి జోస్యం ఇదే..

స‌బ్బం హ‌రి జోస్యం ఇదే..

ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ టీడీపీనే గెలవబోతుందని భీమిలి అభ్యర్థి సబ్బంహరి జోస్యం చెప్పారు. టీడీపీకి పెద్ద సంఖ్య‌లో మహిళలు సంపూర్ణ మద్దతు ఇచ్చారని వివ‌రించారు. తెలుగుదేశం గెలిచిందంటే దానికి కారణం చంద్రబాబే అవుతారన్నారు. ఒకవేళ టీడీపీ గెలిచినా.. కేంద్రంతో ఘర్షణ తప్పే పరిస్థితి కనిపిం చడం లేద ని వ్యాఖ్యానించారు. ఏపీలో మాత్రం బీజేపీ పనైపోయిందని వ్యాఖ్యానించారు. రాజధాని కట్టా లంటే ఎంత కష్టమో తనకు తెలుసన్నారు. రాష్ట్రాభివృద్ధికి బీజేపీ అడ్డుపడుతుందనే కార‌ణం తోనే తాను టీడీపీలో చేరా నని చెప్పుకొచ్చారు. రాజధాని గురించి చాలా మంది గ్రాఫిక్స్ అంటూ వెకిలిగా మాట్లాడుతున్నారని విమ‌ర్శిం చారు. హైదరాబాద్ నిర్మాణంలో తెలుగు ప్రజల కృషి ఉందన్న సంగతి మరిచిపోవద్దని స‌బ్బం హ‌రి సూచిం చారు. తిరిగి అధ‌ఙ‌కారంలోకి రావ‌టం చంద్ర‌బాబు కృషి కార‌ణ‌మ‌ని చెప్పుకొచ్చారు.

2014 లో..తెలంగాణ ఎన్నిక‌ల వేళ‌

2014 లో..తెలంగాణ ఎన్నిక‌ల వేళ‌

స‌బ్బం హ‌రి వైయ‌స్ తో సన్నిహితంగా ఉండేవారు. ఆ త‌రువాత జ‌గ‌న్ తోనూ స‌ఖ్య‌త‌గా నే వ్య‌వ‌హ‌రించా రు. స‌రిగ్గా 2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో ఆయ‌న జ‌గ‌న్ తో విబేధించారు. విశాఖ‌లో విజ‌య‌మ్మ పోటీ చేయ గా..పోలింగ్ ముందు రోజు మీడియా సమావేశంలో వైసిపి గెలిస్తే ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని హెచ్చరించారు. ఇక‌, తెలంగాణ ఎన్నిక‌ల స‌మ‌యంలో పోలింగ్ అయిన త‌రువాత టిడిపి..కాంగ్రెస్ కూట‌మిని ప్ర‌జ‌లు ఆద రించార‌ని స‌బ్బం హ‌రి జోస్యం చెప్పుకొచ్చారు. కేసీఆర్ పై వ్య‌తిరేక‌త ఉంద‌ని నాడు విశ్లేషించారు. ఇక‌, ఇప్పుడు టిడిపి అభ్య‌ర్దిగా పోటీ చేసిన ఆయ‌న టిడిపి గెలుస్తుంద‌ని చెబుతున్నారు. వైసిపి శ్రేణుల్లో ఇక ఇప్పుడు స‌బ్బం హ‌రి చేసిన వ్యాఖ్య‌లు చ‌ర్చ నీయాంశంగా మారాయి.

స‌బ్బం పై అవంతి పోటీ..

స‌బ్బం పై అవంతి పోటీ..

స‌బ్బం హ‌రి 2014 ఎన్నిక‌ల స‌మ‌యం నుండి చంద్ర‌బాబుకు మ‌ద్ద‌తుగా ఉన్నారు. కానీ, ఆయ‌న అధికారి కంగా టిడిపి లో చేర‌లేదు. అయితే, ఈ ఎన్నిక‌ల్లో ఆయ‌న అన‌కాప‌ల్లి ఎంపీగా పోటీ చేస్తార‌ని భావించారు. అయితే, అనూహ్యంగా చంద్ర‌బాబు భీమిలి సీటు కేటాయించారు. టిడిపి నుండి అన‌కాప‌ల్లి ఎంపీగా ఉం టూ వైసిపి లో చేరిన అవంతి శ్రీనివాస రావు ను భీమిలి నుండి ఎమ్మెల్యే అభ్య‌ర్దిగా బ‌రిలోకి దిగారు. ఈ ఇద్ద‌రి మ‌ధ్య గ‌ట్టి పోటీ జ‌రిగింద‌ని చెబుతున్నారు. అయితే, స‌బ్బం హ‌రి 2014 ఎన్నిక‌ల్లో విజ‌య‌మ్మ ఓట మికి టిడిపికి స‌హ‌క‌రించార‌ని భావించిన వైసిపి శ్రేణులు నాటి నుండి స‌బ్బం కు వ్య‌తిరేకంగా ఉన్నారు. ఇక‌, ఇప్పుడు స‌బ్బం హ‌రి వ్యాఖ్య‌ల పై వైసిపి నేత‌లు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

English summary
TDP leader Sabbam Hari predicted TDP will win in AP Assembly elections. Hari says women supported TDP unanimously in this elections. YCP cadre not trusting his statements.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X