వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబు వల్లే వానల్లేవ్: 'టీడీపీ నేతలు క్షమాపణ చెప్పాలి'

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sadoo Parishat supports Swaroopanandendra
హైదరాబాద్: శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామికి తెలుగుదేశం పార్టీ నాయకులు క్షమాపణ చెప్పాలని ఉత్తరాంధ్ర సాధు పరిషత్ బుధవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నంలో డిమాండ్ చేసింది. పీఠాధిపతులు, స్వామీజీలను కించపరచడం టీడీపీకి తగదన్నారు.

రాష్ట్రంలో నెలకొన్న సంక్షోభం, వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రాత్రిపూట ప్రమాణ స్వీకారం చేయకూడదని చంద్రబాబుకు స్వరూపానందేంద్ర సూచించారన్నారు. స్వామీజీలను కించపరిస్తే చట్టపరమైన చర్యలకు సిద్దమన్నారు.

కాగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం చేసిన నాటి నుంచి వర్షాలు కురవడం లేదని విశాఖ శారదా పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి అన్నట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. గతంలో కూడా చంద్రబాబు హయాంలో పరిస్థితి ఇలాగే ఉన్నదని ఆయన అన్నారు.

వర్షాలు రాకపోవడానికి కారణం చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం ఉదయం కాకుండా సూర్యస్తమయం తర్వాత చేశారనీ, అది మంచిది కాదని అన్నారు. గతంలో ఇలా సూర్యాస్తమయం తర్వాత ప్రమాణం చేసినవారు దుష్ఫలితాలు పొందారని గుర్తు చేశారు. అయితే, ఆయన వ్యాఖ్యల పైన టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆయన క్షమాపణ చెప్పాలని సాధు పరిషత్ డిమాండ్ చేస్తోంది.

English summary
Making controversial comments Sharada Peetham Sri Swaroopanandendra Blamed Andhra Pradesh CM Chandrababu Naidu for dry spells.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X