వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అవసరమైతే కాళ్లు పట్టుకొని: బాలకృష్ణకు సాయికుమార్ కౌంటర్, 'పవన్ చెబితే గానీ కనిపించలేదా'

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్/అమరావతి: ప్రధాని నరేంద్ర మోడీపై హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఆయన వ్యాఖ్యలను చాలామంది ఖండించారు. సోషల్ మీడియాలో ఆయనపై సెటైర్లు వచ్చాయి. అయితే టీడీపీ నేతలు మాత్రం వక్రీకరించారని కొందరు, ఏపీ ప్రజల ఆగ్రహాన్ని చెప్పారని మరికొందరు అంటున్నారు.

Recommended Video

NTR biopic:ఎన్టీఆర్ జీవిత చరిత్రలో నందమూరి వారసులు

బీజేపీకి షాక్, ఇంత అవమానమా?: వైసీపీలోకి కన్నా-కాటసాని, జగన్‌కు కన్నా 2 షరతులుబీజేపీకి షాక్, ఇంత అవమానమా?: వైసీపీలోకి కన్నా-కాటసాని, జగన్‌కు కన్నా 2 షరతులు

ఈ నేపథ్యంలో బాలయ్య వ్యాఖ్యలపై నటుడు సాయి కుమార్ స్పందించారు. ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శలు చేయడం సరికాదని వ్యాఖ్యానించారు. అది మంచిది కాదన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం అవసరమైతే తాను ప్రధాని నరేంద్ర మోడీ కాళ్లు పట్టుకొని న్యాయం చేయమని అడుగుతానని చెప్పారు.

బాలకృష్ణను పిలవడం లేదు

బాలకృష్ణను పిలవడం లేదు

నటుడు సాయి కుమార్ కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో చిక్‌బళ్లాపూర్ జిల్లా బాగేపల్లి నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీ చేస్తున్నారు. 2008 కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసి సాయి కుమార్ ఓడిపోయారు. ఇప్పుడు మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఎన్నికల ప్రచారానికి తాను నటుడు బాలకృష్ణను పిలవడం లేదని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

పవన్ కళ్యాణ్ చెబితే గానీ కనిపించలేదా?

పవన్ కళ్యాణ్ చెబితే గానీ కనిపించలేదా?

బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మాణిక్యాల రావు పైన మంత్రి అయ్యన్న పాత్రుడు మండిపడ్డారు. టీడీపీపై అవినీతి ఆరోపణలు చేయడాన్ని ఆయన ఖండించారు. మంత్రి పదవిలో ఉన్నంత కాలం కనిపించని అవినీతి ఇప్పుడు కనిపించిందా అన్నారు. పవన్ కళ్యాణ్ చెబితే కానీ మీకు అవినీతి కనిపించలేదా అని ఎద్దేవా చేశారు. నిరాధారమైన ఆరోపణలు మానుకోవాలన్నారు. అవినీతి నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పారు. సీఎం చంద్రబాబును ఉరి తీయాలని జగన్ అంటున్నారని, ఆయనలా టీడీపీ రాష్ట్రాన్ని దోచుకోలేదన్నారు.

మోడీయే మోసం చేస్తే ఎవరికి చెప్పుకోవాలి?

మోడీయే మోసం చేస్తే ఎవరికి చెప్పుకోవాలి?

ప్రధాని మోడీ మాట తప్పి మోసం చేreస్తే ఎవరికి చెప్పుకోవాలని రాష్ట్ర మరో మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. రాష్ట్రానికి అన్ని విధాలా మేలు చేస్తామని మాటిచ్చి మోడీ మోసం చేశారన్నారు. రాష్ట్రానికి నష్టం జరిగితే అయిదు కోట్ల మంది ప్రజలు ముఖ్యమంత్రి చంద్రబాబుకు అండగా నిలుస్తున్నారన్నారు. జగన్ మాత్రం బీజేపీతో జత కడుతున్నారన్నారు. 25 మంది ఎంపీలను గెలిపించి రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రికి అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు.

 బెదిరించి లోంగదీసుకోవాలనుకుంటే ఎలా?

బెదిరించి లోంగదీసుకోవాలనుకుంటే ఎలా?

ప్రత్యేక హోదా, విభజన హామీలపై అడిగితే బెదిరింపులకు దిగుతున్నారని, రాష్ట్రాన్ని బెదిరించి లొంగదీసుకోవాలని చూస్తున్నారని, అలా చేస్తే సహించమని సీపీఎం నేత మధు సోమవారం అన్నారు. రెండు రోజులుగా గవర్నర్, ఇంటెలిజెన్స్ బ్యూరో చంద్రబాబును కలిసి మాట్లాడుతున్నట్లు వార్తలు వస్తున్న అంశంపై ఆయన స్పందించారు. సమస్యను పరిష్కరించాల్సిన కేంద్రం బెదిరింపులకు దిగడం సరికాదన్నారు.

English summary
Actor Sai Kumar responded on Hindupuram MLA Nandamuri Balakrishna comments on PM Narendra Modi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X