వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రత్యేక సీమకైతే సరే: సాయి ప్రతాప్, క్రిమినల్: నారాయణ

By Pratap
|
Google Oneindia TeluguNews

Sai Pratap demands for separate rayalaseema
హైదరాబాద్: కావాలంటే నెల్లూరు, ప్రకాశం జిల్లాలను నాలుగు రాయలసీమ జిల్లాలతో కలిపి ప్రత్యేక రాయలసీమ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెసు రాజంపేట పార్లమెంటు సభ్యుడు సాయి ప్రతాప్ అన్నారు. రాయల తలంగాణ ప్రతిపాదనను ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు.

రాయల తెలంగాణకు అంగీకరించే ప్రసక్తి లేదని ఆయన అన్నారు. రాయలసీమ అస్తిత్వాన్ని దెబ్బ తీయాలని చూస్తే సహించబోమని ఆయన అన్నారు. రాయలసీమను ఢిల్లీ పెద్దలు విడదీయాలని అనుకోవడం హేయమైన చర్య అని సాయి ప్రతాప్ అన్నారు.

రాయల తెలంగాణ అనేది ఓ క్రిమినల్ ప్రతిపాదన అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ వ్యాఖ్యానించారు. రాయల తెలంగాణ ప్రతిపాదనపై ఆయన గురువారం తీవ్రంగా మండిపడ్డారు. ప్రజలను నిరాశలోకి నెట్టడానికే రాయల తెలంగాణ ప్రతిపాదన చేస్తున్నారని ఆయన విమర్శించారు.

రాయల తెలంగాణ ప్రతిపాదనను నిరసిస్తూ గురువారంనాడు హైదరాబాదులోని హిమాయత్ నగర్ జంక్షన్ వద్ద సిపిఐ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. జివోఎం శవయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడారు.

English summary

 Congress MP Sai Pratap has rejected the proposal of Rayala Telangana. CPI secretary K Narayana termed it as criminal proposal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X