వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విజయ సాయిరెడ్డి చెక్ పెట్టేసారు : సీఎం ఆగ్రహంతో..ఇంత రిలాక్స్డ్ గా: వీడియో వైరల్..!

|
Google Oneindia TeluguNews

వైసీపీలో సీఎం జగన్ తరువాతి స్థానం దాదాపు విజయ సాయి రెడ్డిదే. రాజ్యసభ సభ్యుడిగా ఉంటూ పార్టీ అటు కేంద్రానికి..ఇటు ఏపీ ప్రభుత్వానికి మధ్య సంధాన కర్తగా వ్యవహరిస్తున్నారు. నిత్యం అటు ఢిల్లీలో లేదా ఏపీలో బీజీగా కనిపించే విజయ సాయిరెడ్డి ఆదివారం ఆటవిడుపుగా కనిపించే వీడియో ఇప్పుడు ఒకటి హల్ చల్ చేస్తోంది. సండే సరదాగా సన్నిహితులతో చెస్ ఆడుతున్న వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రిలాక్స్ మూడ్ వీడియో ను వైసీపీ అభిమానులు షేర్ చేస్తున్నారు.

 సీఎం జగన్ సీరియస్

సీఎం జగన్ సీరియస్

నెల్లూరు జిల్లాకు చెందిన విజయ సాయిరెడ్డి తాజాగా ఆ జిల్లా టీడీపీలో కీలకం గా ఉన్న తన స్నేహితుడు బీదా మస్తాన రావును వైసీపీలోకి తీసుకొచ్చారు. అదే విధంగా తాజాగా సీనియర్ నేత ఆనం రామనారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో సీఎం జగన్ సీరియస్ అయ్యారు. ఆ అంశాన్ని పర్యవేక్షించే బాధ్యత సీఎం జగన్ ఎంపీ విజయ సాయిరెడ్డికే అప్పగించారు. దీంతో..ఇప్పుడు ఈ వీడియోలో ఆయన చెక్ పెడుతున్న తీరు..రాజకీయ సమీకరణాలతో పోల్చుతూ కామెంట్లు షేర్ అవుతున్నాయి.

ఆనంకు సాయి రెడ్డి చెక్ పెట్టారా..

ఆనంకు సాయి రెడ్డి చెక్ పెట్టారా..

పి విజయ సాయిరెడ్డి నాడు వైయస్సార్ కు ..నేడు సీఎం జగన్ కు విధేయుడుగా ఉంటున్నారు. ఆయన జగన్ తో పాటుగా జైలుకు కూడా వెళ్లారు. ఇక, జగన పార్టీ ఏర్పాటు చేసిన సమయం నుండి ఆయనతో పాటే వెంట నడిచారు. ఇప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత పార్టీలో దాదాపు జగన్ తరువాతి స్థానం ఆయనదే. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉంటూ..నిత్యం కేంద్ర.. రాష్ట్ర రాజకీయాలు..పార్టీ వ్యవహారంతో బిజీగా ఉండే విజయసాయిరెడ్డి తీరిగ్గా చెస్ ఆడుతున్న వీడియో వైరల్ అవుతోంది. నిన్నటి వరకూ నెల్లూరు జిల్లా రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించి ఆనం కు చెక్ పెట్టిన సాయిరెడ్డి ఇప్పుడు చెస్ ఆడుతు న్నారంటూ కామెంట్స్ షేర్ అవుతున్నాయి. ఎప్పుడూ వర్క్ బిజిలో కనిపించే సాయిరెడ్డి సరదాగా ఉన్న వీడియో మొదటిసారి కావడంతో వైసీపీ నేతలు ఉత్సహంగా కామెంట్స్ చేస్తున్నారు..

నెల్లూరు జిల్లా కేంద్రంగా కొత్త సమీకరణాలు

నెల్లూరు జిల్లా కేంద్రంగా కొత్త సమీకరణాలు

నెల్లూరు జిల్లాలో వైసీపీ ఎంపీ స్థానంలో పాటుగా జిల్లాలోని మొత్తం 10 స్థానాలను క్లీన్ స్వీప్ చేసింది. తాజాగా టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే బీదా మస్తాన రావు విద్యార్ధి దశ నుండి విజయ సాయిరెడ్డికి స్నేహితుడు. వైసీపీ అధికారంలోకి వచ్చిన సమయం నుండి ఆయన్ను పార్టీలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేసారు. తాజాగా ఆయన్ను ఎట్టకేలకు వైసీపీలో చేర్చించారు. అదే సమయంలో రాజకీయ భవిష్యత్ మీద ముఖ్యమంత్రి నుండి హామీ ఇప్పించగలిగారు. ఇక, జిల్లాలో తొలి నుండి సాయిరెడ్డికి రాజకీయంగా దూరంగా ఉండే ఆనంను తాజా వ్యాఖ్యల ద్వారా ముఖ్యమంత్రి సీరియస్ గా ఉన్నారని...ఎవరినీ ఉపేక్షించరని చెబుతూ హెచ్చరించటం చర్చనీయాంశంగా మారింది. ఇక, ఇప్పుడు ఆయన చెస్ ఆడుతున్న వీడియో ఆధారంగానూ ఇవే పొలిటికల్ కామెంట్స్ ను ఆయన చెస్ ఆటకు పోల్చుతూ వైసీపీ అభిమానులు పోస్టింగ్ లు పెడుతూ సందడి చేస్తున్నారు.

English summary
YCP MP Vijaya Sai Reddy playing Chess in Relaxed mood video became viral in YCP groups. Many persons compating his chess game with latest Nellore dist political developments.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X