అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ సర్కారుపై చంద్రబాబు అసత్య ప్రచారం: టీడీపీ-బీజేపీని ఏకిపారేసిన సజ్జల రామకృష్ణారెడ్డి

|
Google Oneindia TeluguNews

అమరావతి: ఏపీ ప్రభుత్వంపై ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అసత్య ప్రచారం చేస్తున్నారని ప్రభుత్వ సలహాదారు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. గురువారం ఆయన తాడేపల్లిలోని వైయస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.

రైతులపై చంద్రబాబుది కపట ప్రేమ..

రైతులపై చంద్రబాబుది కపట ప్రేమ..

రాష్ట్రంలోని రైతాంగం పట్ల చంద్రబాబు నాయుడు కపట ప్రేమ ఒలకబోస్తున్నారని విమర్శించారు. ధాన్యం సేకరణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందంటూ అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రెండు, మూడు అంశాలపై సీఎం వైఎస్ జగన్‌కు చంద్రబాబు లేఖ రాశారని, ఆ లేఖలో పూర్తిగా అబద్ధాలు ప్రస్తావించారని ధ్వజమెత్తారు.
రైతుల సమస్యలపై చంద్రబాబు లేఖ రాయడం విడ్డూరంగా ఉందని విమర్శించారు.

చంద్రబాబు అసత్య ప్రచారాలు మానుకుంటే మంచిది

చంద్రబాబు అసత్య ప్రచారాలు మానుకుంటే మంచిది

టీడీపీ హయాంలోని బకాయిలను తమ ప్రభుత్వం తీర్చిందని సజ్జల గుర్తు చేశారు. చంద్రబాబు సహజ స్వభావానికి అనుగుణంగానే ఆయన లేఖ కూడా ఉందని, తన హయాంలో 48 గంటల్లోనే ధాన్యం సేకరణ సొమ్ము చెల్లించామని చంద్రబాబు అసత్యాలు చెతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు చేస్తోన్న ఆరోపణలపై ఒక్కసారి తనను తాను ప్రశ్నించుకోవాలన్నారు. మిల్లర్లు, వైసీపీ నేతలు కలిసి ఎలా దోచుకుంటున్నారో చంద్రబాబు చెప్పాలని నిలదీశారు. అసత్య ఆరోపణలు మానుకోవాలని చంద్రబాబుకు సజ్జల హితవు పలికారు.

ఏపీలో టీడీపీ, బీజేపీలు జతకలిశాయా?

ఏపీలో టీడీపీ, బీజేపీలు జతకలిశాయా?

ఏపీలో టీడీపీ-బీజేపీ నేతలు జత కలిశాయా? అనే అనుమానం వస్తుందని సజ్జల వ్యాఖ్యానించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన పాత బకాయిలు రూ. 399 కోట్లు ఉన్నాయని, ఈ సీజన్‌కు సంబంధించి రూ. 1200 కోట్లు ఇంకా కేంద్రం నుంచి రావాల్సి ఉందన్నారు. ఏపీ బీజేపీ నేతలు.. బకాయిలను విడుదల చేయించేలా చర్యలు తీసుకుని.. క్రెడిట్ తీసుకోవచ్చన్నారు. ఎప్ఆర్బీఎం చట్టం నిబంధనలను తాము పాటిస్తున్నామని తెలిపారు.

అదే జగన్ సర్కారు లక్ష్యం..

అదే జగన్ సర్కారు లక్ష్యం..

అభివృద్ధిలో ప్రతి ఒక్కరినీ రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యం చేస్తోందని, రిజిస్ట్రేషన్ వాల్యూ ప్రకారం ఆస్తుల విలువ లెక్కగట్టి హేతుబద్ధంగా ఆస్తి పన్ను విధిస్తున్నామని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. బీజేపీ పాలిత కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లోనూ ఆస్తి పన్ను పెంచి అమలు చేస్తున్నారని.. ఆస్తి పన్న పెంపు వల్ల కేవలం రూ. 186 కోట్లు మాత్రమే ప్రజలపై భారం పడుతుందని చెప్పారు. విత్తనం దగ్గర నుంచి విక్రయం వరకు రైతుకు లాభసాటిగా ఉండాలన్నదే జగన్ ప్రభుత్వ లక్ష్యమని సజ్జల స్పష్టం చేశారు.

English summary
Sajjala Ramakrishna Reddy hits out at chandrababu and ap bjp leaders.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X