• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

'చంద్రన్న మరుగుదొడ్లు'.. మరీ ఇలాంటి పేర్లు మేమైతే పెట్టలేదు.. సజ్జల కౌంటర్...

|

టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పిన అబద్దాలనే పదేపదే చెబుతున్నారని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. మతిమరుపు జనానికి కాదని... చంద్రబాబుకేన‌ని వ్యంగ్యాస్త్రం సంధించారు. 108చ104 వాహనాల కొనుగోళ్లలో అవినీతి జరిగిందని,కరోనా కిట్లు,బ్లీచింగ్ కొనుగోళ్లలోనూ అవినీతి జరిగిందని చంద్రబాబు ఆరోపిస్తున్న నేపథ్యంలో సజ్జల వాటిని తిప్పికొట్టారు. కనీసం చంద్రబాబు కొడుకైనా ఆయనలా తయారవకుండా జాగ్రత్తపడాలని హితవు పలికారు. గురువారం(జూలై 2) తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు.

చంద్రబాబు అవినీతి ఆరోపణలపై ఆగ్రహం

చంద్రబాబు అవినీతి ఆరోపణలపై ఆగ్రహం

వైఎస్ జగన్ నిబద్దత,విశ్వసనీయతకు ప్రజలు పట్టం కట్టారని... అన్ని వర్గాలకు సంక్షేమ ఫలితాలు అందిస్తున్న ఘనత ఆయనకే దక్కుతుందని అన్నారు. ఏడాది కాలంలోనే మేనిఫెస్టోలో పెట్టిన హామీలన్నింటినీ నెరవేర్చామ‌న్నారు. కరోనా కష్టకాలంలోనూ పేదల కోసం రూ.28వేల కోట్లు ఖర్చు చేశామన్నారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని తాజాగా 1088 అత్యాధునిక 104, 108 వాహనాలను అందుబాటులోకి తెచ్చామన్నారు. వీటి కొనుగోలుకు ప్రభుత్వం రూ.200 కోట్లు ఖర్చు చేస్తే... చంద్రబాబు మాత్రం రూ.307కోట్లు అవినీతి జరిగిందని ఆరోపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అప్పుడే ఉంటే ఎక్కడ దాచారు...

అప్పుడే ఉంటే ఎక్కడ దాచారు...

తెలుగుదేశం హ‌యాంలో 1800 అంబులెన్స్‌లు ఉండేవని, వాటిల్లో లైప్ స‌పోర్టింగ్ సిస్ట‌మ్స్‌ కూడా పెట్టామని... ఈ ప్రభుత్వం కొత్తగా చేసిందేంటని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై సజ్జల ఫైర్ అయ్యారు. ఒకవేళ చంద్రబాబు హయాంలోనే 1800 అంబులెన్సులు ఉంటే... వాటిని ఎక్కడ పెట్టారో చెప్పాలన్నారు. టీడీపీ హయాంలో పెండింగ్ బకాయిలన్నింటినీ వైసీపీయే చెల్లించిందన్నారు. దొంగ దీక్షల పేరుతో వేల కోట్లు నొక్కేసింది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. అచ్చెన్నాయుడు కేసులో టీడీపీ అర్థం పర్థం లేని ఆరోపణలు చేస్తోందన్నారు.

చంద్రన్న మరుగుదొడ్లు... మరీ అలాంటి పేర్లు మేమేమీ పెట్టలేదు..

చంద్రన్న మరుగుదొడ్లు... మరీ అలాంటి పేర్లు మేమేమీ పెట్టలేదు..

సంక్షేమ పథకాలకు వైఎస్సార్ పేరు పెట్టడాన్ని విమర్శించడంపై సజ్జల మండిపడ్డారు. రాజశేఖర్ రెడ్డి ప్రజా నాయకుడు కాబట్టే పథకాలకు ఆయన పేరు పెట్టామన్నారు. మీలాగా చంద్రన్న మరుగుదొడ్లు అని పేర్లు పెట్టలేదని చంద్రబాబును ఎద్దేవా చేశారు. తాము మొదటి నుంచి పార్టీతోనే ఉన్నామని... తమకు ప్రత్యేక అధికారాలేవీ లేవని... కార్యకర్తలతో సమన్వయం కోసమే తమకు జగన్ బాధ్యతలు అప్పగించారని చెప్పారు. లోకేష్‌కు ఏమి అర్హత ఉందని జాతీయ ప్రధాన కార్యదర్శి పదవితో పాటు మంత్రి పదవులు కట్టబెట్టారని ప్రశ్నించారు.

  Shyam K Naidu మళ్లీ మోసం చేశాడంటూ మరోసారి ఫిర్యాదు చేసిన సాయిసుధ! || Oneindia Telugu
  చంద్రబాబు ఆరోపణలు...

  చంద్రబాబు ఆరోపణలు...

  అంతకుముందు,చంద్రబాబు మాట్లాడుతూ... విజయసాయిరెడ్డికి పుట్టినరోజు కానుకగా రూ.307 కోట్లు ఇచ్చారని, దానికోసం అంబులెన్సుల పేరుతో పెద్ద షో చేశారని విమర్శించారు. అనుభవం ఉన్న సంస్థను పక్కనపెట్టి, విజయసాయిరెడ్డి వియ్యంకుడికి కాంట్రాక్ట్ కట్టబెట్టారని ఆరోపించారు.తెలుగుదేశం హ‌యాంలో 1800 అంబులెన్స్‌లు ఉండేవని, అందులో లైప్ స‌పోర్టింగ్ సిస్ట‌మ్స్‌ ఉండేవని... జగన్ కొత్తగా తెచ్చిందేంటి అని ప్రశ్నించారు.రాష్ట్రంలో రూ.2 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టినవారంతా వెనక్కి వెళ్లిపోయారని అన్నారు.

  English summary
  AP CM YS Jagan Mohan Reddy's advisor Sajjala Ramakrishna Reddy criticised TDP chief Chandrababu naidu for making allegations against 108,104 vehicles which were introduced by government recently.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more