వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇది చంద్రబాబు ప్లాన్: పవన్ కల్యాణ్ స్క్రిప్టు చదివేశారా?

By Pratap
|
Google Oneindia TeluguNews

Recommended Video

Pawan Kalyan Dramas Over 'No Confidence Motion'

అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను తప్పు పడుతూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌కు చెందిన సాక్షి మీడియా ఓ వార్తాకథనాన్ని ప్రచురించింది. జగన్ అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తే తాను మద్దతుగా నిలుస్తానని, అప్పుడు టిడిపి పంథా ఏమిటో తెలుస్తుందని పవన్ కల్యాణ్ సోమవారం సాయంత్రం మీడియా సమావేశంలో అన్న విషయం తెలిసిందే.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ కుమ్మక్కయి నాటకం ఆడుతున్నారనే పద్ధతిలో సాక్షి మీడియా ఆ కథనాన్ని ప్రచురించింది. ఇదీ... బాబు అండో కో బండారం అనే శీర్షిక పెట్టి దుమ్మెత్తి పోసింది.

విలేకరుల సాక్షిగా బండారం బయటపడిందని...

విలేకరుల సాక్షిగా బండారం బయటపడిందని...

ఐదు కోట్ల మంది ఆంధ్రులకు సంజీవని వంి ప్రత్యేక హోదాపై ఎంపీల రాజీనామాకు సిద్ధమని ప్రతిపక్ష, నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించినప్పుడు గానీ మీరు కలిసి రండి కేంద్రంపై ఒత్తిడి తీసుకొద్దామని విజ్ఞప్తి చేసినప్పుడు గానీ స్పందించకుండా లీకులతో కాలక్షేపం చేస్తూ వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుక్షణం ఆయన రక్షణకు ఎంతగానో శ్రమపడుతున్న పార్టనర్ పవన్ కల్యాణ్‌ల బండారం విలేకరుల సాక్షిగా బయపడిందని సాక్షి రాసింది.

ఇద్దరి విన్యాసాలూ వ్యాఖ్యానాలు చూసి...

ఇద్దరి విన్యాసాలూ వ్యాఖ్యానాలు చూసి...

సోమవారంనాడు కొద్ది గంటల వ్యవధిలో వీరిద్దరి వ్యాఖ్యానాలు, విన్యాసాలు చూసి రాష్ట్ర ప్రజానీకం ఆశ్చర్యపోతోందని చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లపై సాక్షి మీడియా అభిప్రాయపడింది. మేం అవిశ్వాస తీర్మానానికి సిద్ధమే... తెలుగుదేశం పార్టీని కూడా సిద్దం చేయండి అని జగన్ పవన్ కల్యాణ్‌కు సూచించిన నేపథ్యంలో చంద్రబాబు నోరు విప్పారని సాక్షి రాసింది.

ప్రిపేరయిన స్క్రిప్టును చదివేసి...

ప్రిపేరయిన స్క్రిప్టును చదివేసి...

చంద్రబాబు పోలవరం పర్యటన సందర్భంగా మీడియాతో మాట్లాడుతు జగన్‌పై విమర్శల వర్షం కురిపించరు. చంద్రబాబు మాట్లాడిన కాసేపటి తర్వాత భాగస్వామి పవన్ కల్యాణ్ హైదరాబాదులో ప్రెస్ మీట్ పెట్టిన విషయాన్ని సాక్షి మీడియా ప్రస్తావిస్తూ తను ప్రిపేరయిన స్క్రిప్టును అప్పగించేసి.. ప్రశ్నలడుగుతున్న విలేకరులన పట్టించుకోకుండా వెళ్లిపోయారని వ్యాఖ్యానించింది. ఈ ఇద్దరూ విలేకరులతో మాట్లాడిన అంశాలను గమనించిన వారికి క విషయం స్పష్టంగా అర్థమయింది... బాబు - భాగస్వామి... ఇద్దరి బంధం చాలా బలమైనదని అర్థమవుతోందన్నది రాజకీయ విశ్లేషకుల మాట అంటూ వ్యాఖ్యానించింది.

చంద్రబాబు ఇలా అన్నారు...

చంద్రబాబు ఇలా అన్నారు...

సోమవారం మధ్యాహ్నం మూడున్నర గంటలకు ముఖ్యమంత్రి పోలవరం వద్ద మాట్లాడిన విషయాన్ని సాక్షి మీడియా ప్రస్తావించింది. "అవిశ్వాస తీర్మానం ఆలోచన తలాతోకా లేనిది. దానివల్ల ఎలాంటి ఉపయోగమూ లేదు. రాజీనామాలు చేస్తే పార్లమెంటలో ఎవరు పోరాడుతారు. అసలు అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే మెజారిటీ ఎవరికి ఉందో తెలుసుకోవాలి. మెజార్టీ ఉన్నా అవిశ్వాసం పెడితే ఆరు నెలలు ఆ విషయంపై అసలు మాట్లాడే అవకాశం ఉండదు. అవిశ్వాసానికి కూడా పద్ధతులు, స్టేజీలు ఉంటాయి" అని చంద్రబాబు అన్నారు.

సాక్షి మీడియా ట్విస్ట్ ఇలా...

సాక్షి మీడియా ట్విస్ట్ ఇలా...

అవిశ్వాసం పెట్టాలనే ఆలోచన ఎవరిది, ఆయన పార్టనర్ పవన్ కల్యాణ్‌ది కాదా, పవన్ కల్యాణ్ సూచించిన తర్వాతనే దా దానికి కూడా సిద్ధమేనని జగన్ ప్రకటించిందని, అలాంటప్పుడు పవన్ కల్యాణ్‌ను ఏమీ అనకుండా జగన్‌ను ఉద్దేశించి చంద్రబాబు విమర్శల వర్షం కురిపించడమేమిటి, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలని, ఇది చంద్రబాబుకు, పవన్‌కు మధ్య ఉన్న బంధాన్ని బయటపెట్టడం లేదా అని వైయస్సార్ కాంగ్రెసు నాయకులు అంటున్నారంటూ సాక్షి రాసింది.

పవన్ కల్యాణ్ ఏమన్నారు...

పవన్ కల్యాణ్ ఏమన్నారు...

చంద్రబాబు మధ్యాహ్నం మాట్లాడగా, పవన్ కల్యాణ్ సాయంత్రం విలేకరుల సమావేశం పెట్టారు. "నేను జగన్ మోహన్ రెడ్డి సవాల్‌ను స్వీకరిస్తున్నా. ఆయనయ అవిశ్వాస తీర్మానం పెట్టాలి. ఒక్కరు తీర్మానం పెట్టినా సరిపోతుంది. జగన్ అవిశ్వాస తర్మానం పెట్టిన తర్వాత అవసరమైతే కర్ణాటక వెళ్తాను... తమిళనాడు వెళ్తాను... వామపక్షాలను, ఎస్పీని, ఆప్‌ను, కాంగ్రెసును అందరినీ ఒప్పిస్తాను. తీర్మానానికి మద్దతుగా ఎంపీలను కూడగడుతా" అని పవన్ కల్యాణ్ అన్నారు. కానీ మాటమాత్రంగానైనా తన పార్టనర్ చంద్రబాబును, తెలుగుదేశం పార్టీని ఒప్పిస్తాననిపవన్ ఎక్కడా చెప్పకపోవడాన్ని సాక్షి మీడియా ప్రస్తావించింది.

జగన్ అలా, పవన్ కల్యాణ్ అలా.

జగన్ అలా, పవన్ కల్యాణ్ అలా.

పార్లమెంటు జరిగినన్ని రోజులు పోరాటం చేసి, అప్పటికీ కేంద్రం లొంగకపోతే రాజీనామాలు చేసిస వారి మొహాన కొట్టివద్దామని జగన్ చెప్పితే పవన్ కల్యాణ్ మరో విధంగా మాట్లాడారని సాక్షి మీడియా రాసింది. రాజీనామాల వల్ల ఒరిగేదేముంది, అవిశ్వాసం పెడితేనే పని జరుగుతుందని పవన్ కల్యాణ్ అన్నారు. అవిశ్వాస తీర్మానం పెట్టడానికి మీకు భయమెందుకని ఆయన జగన్‌ను ప్రశ్నించారు. అవిశ్వాసంతోనే కేంద్రం దిగి వస్తుందని చెప్పారు. దాంతో జగన్ తాము అవిశ్వాస తీర్మానానికి సిద్ధమేనని ప్రకటించారు.

ఇలా జరుగుతుందని జగన్ భావించారు...

ఇలా జరుగుతుందని జగన్ భావించారు...

రాష్ట్రంలోని 25 మంది ఎంపీలు ఒక్క తాటికి మీదికి వస్తే కేంద్రం దిగి వస్తుందనే ద్దేశంతోనే పవన్ కల్యాణ్ సూచనకు జగన్ సై అన్నారని సాక్షి మీడియా రాసింది. అంటే, తెలుగుదేశం పార్టీ ఎంపీలు కూడా అవిశ్వాస తీర్మానానికి ముందుకు వస్తారనే ఉద్దేశంతో జగన్ సరేనన్నారని సాక్షి మీడియా సారాంశం. అవిశ్వాస తీర్మానానికి తాను సిద్ధమేనని, పవన్ కల్యాణ్ చంద్రబాబును అందుకు ఒప్పించాలని జగన్ అన్న మాటను గుర్తు చేసింది.

పవన్ కల్యాణ్ అసలు రంగు...

పవన్ కల్యాణ్ అసలు రంగు...

పవన్ కల్యాణ్ మీడియా సమావేశంలో మాట్లాడిన మాటల ద్వారా అసలు రంగును బయటపెట్టుకున్నారని సాక్షి వ్యాఖ్యానించింది. రాజీనామాలు చేద్దామన్న జగన్ ప్రతిపాదనను పక్కనపెట్టి చంద్రబాబును, తెలుగుదేశం పార్టీని రక్షించడమే ఎజెండాగా పవన్ కల్యాణ్ మాట్లాడారని సాక్షి మీడియా దుమ్మెత్తిపోసింది. జగనే అవిశ్వాసం పెట్టాలని పవన్ కల్యాణ్ అంటున్నారని, అవిశ్వాసమే తలాతోక లేనిదని చంద్రబాబు వ్యాఖ్యానిస్తున్నారని, అలాంటి చంద్రబాబును ఒప్పించకుండా చంద్రబాబు మాటలకు సమాధానమివ్వకుండా జగన్మోహన్ రెడ్డిపై మాటల దాడి చేయాలని చూడడం ద్వారా పవన్ కల్యాణ్ అసలు రంగు బయటపెట్టుకున్నారని అభిప్రాయం వ్యక్తమవుతోందని సాక్షి రాసింది.

నాలుగేళ్లుగా పవన్ కల్యాణ్

నాలుగేళ్లుగా పవన్ కల్యాణ్

నాలుగేళ్ల క్రితం చంద్రబాబుకు మద్దతు పలికి, ఆయన ఇస్తున్న వాగ్దానాలన్నీ అమలు చేయించే పూచి తనదని బహిరంగ సభల్లో ప్రకటించి, ఏ తప్పు జరిగినా ప్రశ్నిస్తానని పలికిన పవన్ కల్యాణ్ నాలుగేళ్లుగా చంద్రబాబుకు రక్షణ కవచంలా పనిచేస్తున్నారని విమర్శకులంటున్నట్లు సాక్షి వ్యాఖ్యానించింది.

అందుకే అజ్ఞాతవాసికి రాయితీలు...

అందుకే అజ్ఞాతవాసికి రాయితీలు...

చంద్రబాబుకు ఎప్పుడు ఎలాంటి ఇబ్బంది వచ్చినా, ఏ చిన్న అసౌకర్యం కలిగినా మీడియా ముందుకు వచ్చి, జనం ముందుకు వచ్చి ఆయన్ను రక్షించే విధంగా సమస్యను పక్కదోవ పట్టించడమే పవన్ కల్యాణ్ చేస్తున్న పని అన్న సంగతి అందరికీ తెలిసిన విషయమేనని విమర్శకులు పేర్కొంటున్నారంటూ రాసింది. దీనికి ప్రతిఫలంగానే పవన్ కల్యాణ్ అజ్ఞాతవాసి సినిమాకు తెలుగు సినిమా చరిత్రలోనే ఎన్నడూ కనీవినీ ఎరుగని విదంగా చంద్రబాబు రాయితీలిచ్చారని సాక్షి విమర్శించింది.

వాటిపై మాట్లాడని పవన్ కల్యాణ్.

వాటిపై మాట్లాడని పవన్ కల్యాణ్.

అన్ని రంగాలనూ అవినీతిమయం చేశారంటూ చంద్రబాబు ప్రభుత్వ అవినీతిని కాగ్ వంటి సంస్థలు ఏటా ఏకిపారేస్తున్నాయని, ఓటుకు నోటు కేసులో ఆడియో వీడియో టేపుల్లో చంద్రబాబు అడ్డంగా దొరికారని, ప్రజాస్వామ్య విలుపలనూ రాజ్యాంగ నియమాలనూ కాలరాస్తూ ఒక పార్టీపై గుర్తుపై గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలకు ప్రలోభాలతో ఎరవేసి కోట్లు కుమ్మరించి చంద్రబాబు కొనుగోలు చేశారని, అందులో నలుగురికి పదవులు కట్టబెట్టారని దుమ్మెత్తిపోస్తూ ఇలాంటివి ప్రత్యక్షంగా కంటికి కనిపిస్తున్నా పవన్ కల్యాణ్ ఎన్నడూ నోరు మెదపలేదని సాక్షి మీడియా విమర్శించింది.

చంద్రబాబును విమర్శించాల్సింది పోయి...

చంద్రబాబును విమర్శించాల్సింది పోయి...


అవిశ్వాస తీర్మానం తలా తోకా లేని ఆలోచన అని వ్యాఖ్యానించిన చంద్రబాబును విమర్శించాల్సింది పోయి ప్రత్యేక హోదా కోసం ఎలాంటి పోరాటానికైనా సిద్ధమని ముందుకొస్తున్న ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డిపై పవన్ కల్యాణ్ విమర్శలు చేయడం విస్తుగొలుపుతున్నదని రాజకీయ విశ్లేషకులంటున్నరంటూ సాక్షి తన వార్తాకథనానికి ముక్తాయింపు ఇచ్చింది.

English summary
YSR Congress party president YS Jagan's Sakshi media accused Jana Sena chief Pawan Kalyan that he is protecting Andhra Pradesh CM and Telugu Desam pary chief Nara Chandrababu Naidu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X