• search
  • Live TV
శ్రీకాకుళం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

హిందువుల సొమ్ముతో పాస్టర్లకు,ఇమామ్ లకు జీతాలా ! .. ఏపీ సీఎం జగన్ పై స్వామీజీల ఆగ్రహం

|

ఏపీలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిననాటి నుండి ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పాలనకు శారదా పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి ప్రశంసల వర్షం కురిపిస్తుంటే, తాజాగా సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయంతో చాలా మంది హిందూ స్వామీజీలు జగన్మోహన్ రెడ్డి పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని పలువురు హిందూ స్వామీజీలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

జనసేనాని డెడ్ లైన్ ముగిసింది: ప్రభుత్వ భారీ ప్రకటనల వెనుక: తాజాగా...జగన్..పవన్ పిలుపు ఏంటంటే..!

వైసీపీ ప్రభుత్వం పాస్టర్లకు,ఇమామ్ లకు జీతాలు ఇచ్చే నిర్ణయంపై ఆగ్రహం

వైసీపీ ప్రభుత్వం పాస్టర్లకు,ఇమామ్ లకు జీతాలు ఇచ్చే నిర్ణయంపై ఆగ్రహం

ఏపీలో పాస్టర్లకు,ఇమామ్ లకు నెలకు ఐదు వేలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న వైసీపీ ప్రభుత్వం వారికి నెల జీతాలు ఇవ్వటానికి ముందడుగు వేస్తుంది. ఈ క్రమంలో హిందూ సంఘాలు సీఎం జగన్మోహన్ రెడ్డి హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ప్రవర్తిస్తున్నారని మండిపడుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో జరిగిన ఏపీ సాధుపరిషత్ హిందూ సమ్మేళనానికి వచ్చిన పలువురు స్వామీజీలు ఈ సందర్భంగా జగన్ తీసుకున్న నిర్ణయంపై తమ వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు.

 హిందువుల మనోభావాలు దెబ్బతినేలా వైసీపీ ప్రభుత్వం ప్రవర్తిస్తుందన్న స్వామీజీలు

హిందువుల మనోభావాలు దెబ్బతినేలా వైసీపీ ప్రభుత్వం ప్రవర్తిస్తుందన్న స్వామీజీలు

ఆనందాశ్రమ పీఠాధిపతి స్వామి శ్రీనివాసానంద సరస్వతి మాట్లాడుతూ, హిందువులు కష్టపడి చెల్లిస్తున్న కోట్లాది రూపాయల పన్నుల నుంచి వైసీపీ ప్రభుత్వం పాస్టర్లకు, ఇమామ్ లకు చెల్లిస్తుందని మండిపడ్డారు. నెలకు రూ. 5వేలు దోచిపెట్టేందుకు సిద్ధమవుతోందని ఫైర్ అయ్యారు. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరిస్తున్న ప్రభుత్వాలకు బుద్ధి చెబుతామని స్వామి శ్రీనివాసానంద సరస్వతి హెచ్చరికలు జారీ చేశారు. అంతేకాదు తిరుమల శ్రీవారితో కూడా వైసీపీ ప్రభుత్వం రాజకీయాలు చేస్తోందని,ఆచారాలకు విరుద్ధంగా ప్రవర్తిస్తోంది అని మండిపడ్డారు.

ధర్మ రక్షణకు హిందువులందరూ ఐక్యంగా పోరాటం సాగించాలని స్వామీజీల పిలుపు

ధర్మ రక్షణకు హిందువులందరూ ఐక్యంగా పోరాటం సాగించాలని స్వామీజీల పిలుపు

తిరుపతి ఇస్కాన్ ప్రతినిధి రాధా మనోహర్ దాస్ మాట్లాడుతూ, హిందువులు ఎంతో భక్తితో కొలిచే వేంకటేశ్వరస్వామితో కూడా ప్రభుత్వం రాజకీయాలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూ ధర్మ రక్షణకు హిందువులందరూ ఐక్యంగా పోరాటం సాగించాలని స్వామీజీలు పిలుపునిచ్చారు. హిందూ దేవాలయాలు కూల్చివేసిన పట్టించుకోవడంలేదని, పాస్టర్లకు ఇమామ్లకు మాత్రం నెలకు ఐదు వేలు ఇచ్చి ప్రోత్సహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న స్వామీజీలు వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెబుతామన్నారు.

జగన్ పై ఇప్పటికే ప్రతిపక్షాల మతపరమైన విమర్శలు .. ఇప్పుడు హిందూ సంఘాల ఆగ్రహం

జగన్ పై ఇప్పటికే ప్రతిపక్షాల మతపరమైన విమర్శలు .. ఇప్పుడు హిందూ సంఘాల ఆగ్రహం

ఇక మరోపక్క ఏపీలో జగన్ క్రిష్టియానిటీ ప్రోత్సహిస్తున్నారని అటు ప్రతిపక్ష నేతలు సైతం విమర్శలు గుప్పిస్తున్నారు. బీజేపీ,టీడీపీ జగన్ హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ప్రవర్తిస్తున్నారని విమర్శలు చేస్తున్నారు. ఇక ఏపీ మాజీ సీఎం తిరుమల పవిత్రత పాడు చేస్తున్నారని , సోనియా గాంధీ , మాన్ మోహన్ సింగ్ వంటి పెద్ద వాళ్లు సైతం తిరుమల సందర్శనకు వెళ్తే స్వామీ పట్ల విశ్వాసం ఉందని అఫిడవిట్ ఇచ్చి వెళ్తారని , కానీ సీఎం జగన్ తన మతాన్ని గురించి చెప్పకుండా , ఎలాంటి అఫిడవిట్ లేకుండా తిరుమల పవిత్రత నాశనం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక తాజాగా జగన్ తీసుకున్న నిర్ణయంతో వీరి వ్యాఖ్యలకు ఊతం ఇచ్చినట్టు అయ్యింది. హిందూ సంఘాల నుండి వ్యతిరేఖత వ్యక్తం అవుతుంది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The chief of the Anandashram, Srinivasananda Saraswati, said that the YCP government is paying back to the pastors and imams 5 thousand rupees per month . He alleged that Hindus are payingthe billions of rupees to the government and the government is paying to pastors and imamas .Swami Srinivasananda Saraswati has issued a warning to governments that are dealing with the sentiments of Hindus.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more