వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మంత్రి సునిత తల్లికి సారె, మహిళ వేషంలో శివ ప్రసాద్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Samaikyandhra movement, 60 days and counting…
చిత్తూరు: మంత్రి సునితా లక్ష్మా రెడ్డి తల్లి ఆదిలక్ష్మమ్మకు మంగళవారం చిత్తూరు జిల్లాలో సమైక్యవాదులు చీర, సారె అందజేశారు. చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తీశ్వరుడిని దర్శించుకునేందుకు సునితా లక్ష్మా రెడ్డి తల్లి వచ్చారు. ఈ సందర్భంగా కొందరు తెలుగుదేశం పార్టీ నాయకులు ఆమెకు సంప్రదాయం ప్రకారం పసుపు, కుంకుమ్, చీర, జాకెట్టు, తాంబూలం ఇచ్చారు. ఈ సందర్భంగా సమైక్యాంధ్రకు అనుకూలంగా మీ కూతురు మనసు మారేలా చూడాలని కోరుకున్నారు.

మహిళ వేషధారణలో శివ ప్రసాద్

చిత్తూరు తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యులు శివ ప్రసాద్ బుధవారం మహిళ వేషధారణలో సమైక్యాంధ్ర కోసం నిరసన తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు విజయనగరంలో పుట్టారని, ఆయన తన తనయుడు, ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావును గుంటూరులో చదివించారని చెప్పారు.

కెసిఆర్ తన కోడలును తూర్పు గోదావరి జిల్లా నుండి తీసుకు వచ్చుకున్నారని చెప్పారు. అలాగే పలువురు మంత్రులు, ఇతర తెలంగాణ నేతలు సీమాంధ్ర నుండి వియ్యమందుకున్నారని చెప్పారు. అలాంటప్పుడు మళ్లీ విడిపోదామని ఎలా అంటారని ప్రశ్నించారు.

అశోక్ బాబు, వంగపండులపై కేసు నమోదుకు కోర్టు ఆదేశం

ఎపిఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు, ప్రజా గాయకుడు వంగపండులపై కేసు నమోదు చేయాలని మంగళవారం రంగారెడ్డి జిల్లా న్యాయస్థానం ఆదేశించింది. సమైక్యాంధ్ర కోసం ఆదివారం కర్నూలులో నిర్వహించిన సభలో అశోక్ బాబు తెలంగాణ ప్రజలను కించపర్చేలా ప్రసంగించారని, తెలంగాణవాదులను దూషిస్తూ అసభ్య పదజాలంతో కూడిన పాటలను వంగపండు పాడారంటూ న్యాయవాది భార్గవ్ సైబరాబాద్ 11న మహానగర న్యాయస్థానంలో ప్రయివేటు ఫిర్యాదు చేశారు.

English summary

 To commemorate the 60th day of the ‘people’s movement’, Samaikyandhra supporters in the city organised various programmes at their respective protest camps.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X