వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్ర‌బాబూ..ఎందుకీ ఆయాసం : బాబు ఆత్రుత‌కు 23న ముగింపు : సామ్నాలో నిల‌దీత‌..!

|
Google Oneindia TeluguNews

కేంద్రంలో మోదీ అధికారంలోకి రాకుండా అడ్డుకోవాల‌ని విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తున్న ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు కు శివ‌సేన షాక్ ఇచ్చింది. గ‌తంలో ఎన్డీఏలోనే శివ‌సేన‌..టీడీపీ మిత్రులుగా ఉండేవారు. ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ వెల్ల‌డి అయిన త‌రువాత ప్ర‌ధాని ఎవ‌రో స్ప‌ష్ట‌త వ‌చ్చింద‌ని..ఇంకా చంద్ర‌బాబుకు ఎందుకీ ఆత్రుత అంటూ త‌మ ప‌త్రిక సామ్నా ద్వారా ప్ర‌శ్నించింది. సామ్నా వ్యాసంలో తొలి సారిగా చంద్ర‌బాబు పైన సెటైర్లు వేసింది.

ఎందుకింత ఆయాసం..చంద్ర‌బాబూ..
శివ‌సేన అధికారిక ప‌త్రిక సామ్నాలో టీడీపీ అధినేత చంద్ర‌బాబు పైన కీల‌క వ్యాఖ్యానాలు చేసింది. ఢిల్లీ వేదిక‌గా మోదీకి వ్య‌తిరేకంగా చంద్ర‌బాబు చేస్తున్న ప్ర‌య‌త్నాల‌ను ఎద్దేవా చేసింది. ప్ర‌ధాని ఎవ‌ర‌నేది ఇప్ప‌టికే స‌మాధానం ల‌భించింద‌ని గుర్తు చేసింది. ప్ర‌ధాని ప‌ద‌వికి ప్ర‌తిప‌క్షంలో అయిదుగురు పోటీ ప‌డుతున్నార‌ని..వీరి క‌ల‌లు క‌ల్ల‌ల‌య్యే అవ‌కాశాలే ఎక్కువ‌గా ఉన్నాయ‌ని పేర్కొంది. కేంద్రంలో ఎవ‌రు ప్ర‌భుత్వం ఏర్పాటు చేస్తార‌నే ప్ర‌శ్న‌కు ఇప్ప‌టికే ఎగ్జిట్ పోల్స్ ద్వారా స‌మాధానం ల‌భించ‌ద‌ని వ్యాఖ్యానించింది.

టీడీపీకి 110 సీట్ల పైమాటే : రేపు ఢిల్లీలో అఖిల‌ప‌క్ష ధ‌ర్నా: చంద్రబాబు ధీమా ల‌గ‌డ‌పాటేనా..!టీడీపీకి 110 సీట్ల పైమాటే : రేపు ఢిల్లీలో అఖిల‌ప‌క్ష ధ‌ర్నా: చంద్రబాబు ధీమా ల‌గ‌డ‌పాటేనా..!

బీజేపీ 300 సీట్లు గెలుస్తుందని అమిత్‌ షా ముందే చెప్పారు. ఐదో విడత ఎన్నికలు ముగిసేసరికే బీజేపీ తన లక్ష్యాన్ని చేరుకుందని శివసేన తెలిపింది. ఎటువంటి కారణం లేకుండానే చంద్రబాబు తనకు తానుగా ఎందుకు ఆయాసపడిపోతున్నారని ప్రశ్నించింది. ఆయన పడుతున్న ఆత్రుతకు ఈనెల 23న ఫుల్‌స్టాఫ్‌ పడనుందని వ్యంగ్యంగా సామ్నా వ్యాఖ్యానించింది.

Samna commented on chandra Babu Delhi tour : Babu did not get any positive results on 23rd..

మ‌హాకూట‌మికి మాయా షాక్..
టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఏపీ ఎన్నిక‌ల కంటే జాతీయ ఫ‌లితాల పైనే ఎక్కువ‌గా టెన్ష‌న్ ప‌డుతున్నారు. ఎలాగైనా మోదీ ప్ర‌ధాని కాకుండా అడ్డుకోవాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఇందు కోసం ఢిల్లీలో మ‌కాం వేసి కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత‌ల‌ను క‌లుస్తున్నారు. ల‌క్నో వెళ్లి అఖిలేష్‌..మాయావ‌తితోనూ స‌మావేశ‌మ‌య్యారు. ఇత‌ర పార్టీల‌కు చెందిన సీనియ‌ర్ నేత‌ల‌తో మంత‌నాలు సాగిస్తున్నారు.

అంద‌రిదీ ఒకే వేదిక అనే సంకేతం ఇచ్చేందుకు ఎన్నిక‌ల సంఘానికి వ్య‌తిరేకంగా ఢిల్లీలో 21న అఖిల‌ప‌క్ష ధ‌ర్నాకు నిర్ణ‌యించారు. ఇదే స‌మ‌యంలో బీఎస్పీ అధినేత్రి మాయావ‌తి త‌న ఢిల్లీ ప‌ర్య‌ట‌న ర‌ద్దు చేసుకున్నారు. షెడ్యూల్ ప్ర‌కారం ఢిల్లీలో సోనియాతో స‌మావేశం కావాల్సి ఉంది. అయితే, ఎగ్జిట్ పోల్స్ కార‌ణంగానే మాయావ‌తి త‌న ఢిల్లీ ప‌ర్య‌ట‌న ర‌ద్దు చేసుకున్న‌ట్లు స‌మాచారం.

English summary
Sivasena official daily Samna target Chandrababu in editorial. Sivasena says Chandrababu un necessarily meeting with non BJP leaders. Already exit polls indicated who will be the PM after 23rd results.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X