• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మహిళా కమిషన్ లో సంచైత- ఆ వ్యూహం అమల్లో పెట్టేందుకేనా-అశోక్ కు అల్టిమేట్ పంచ్

|

విజయనగరం మాన్సాస్ ట్రస్ట్ లో వైసీపీ వర్సెస్ టీడీపీగా సాగిపోతున్న రాజకీయాలు క్లైమాక్స్ కు చేరుకుంటున్నాయి. గతేడాది మాన్సాస్ ట్రస్టు ఛైర్మన్ గా ఉన్న అశోక్ గజపతిరాజును తొలగించి ఆయన స్ధానంలో అన్న ఆనందగజపతిరాజు కుమార్తె సంచైతను తెరైపిక తెచ్చిన వైసీపీ సర్కార్ కు తాజాగా హైకోర్టు తీర్పు భారీ షాకిచ్చింది. హైకోర్టు తీర్పుతో తిరిగి మాన్సాస్ ఛైర్మన్ అయిన అశోక్ ను తిరిగి తొలగించేందుకు ప్లాన్ చేస్తున్న వైసీపీ ప్రభుత్వానికి గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు గుర్తుకొచ్చింది. దీంతో ఆ తీర్పును మాన్సాస్ లో అమల్లో పెట్టేందుకు వేగంగా పావులు కదుపుతోంది. ఇందులో భాగంగానే హైకోర్టు తీర్పు తర్వాత తొలిసారిగా బయటికొచ్చిన సంచైత మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మను కలిశారు.

హైకోర్టు తీర్పు తర్వాత తొలిసారి కనిపించిన సంచైత

హైకోర్టు తీర్పు తర్వాత తొలిసారి కనిపించిన సంచైత

విజయనగరం మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్ గా ఉన్న బాబాయ్ అశోక్ గజపతిరాజును తప్పించి వైసీపీ సర్కార్ తనను నియమించిన తర్వాత దాదాపు 14 నెలల పాటు ఆ పదవిలో కొనసాగిన సంచైత గజపతిరాజుకు తాజాగా హైకోర్టు తీర్పు భారీ షాకిచ్చింది. హైకోర్టు తీర్పుతో మాజీ అయిన సంచైత సొంతంగా న్యాయపోరాటం చేయడం కంటే వైసీపీ ప్రభుత్వం మీదే ఆధారపడుతున్నట్లు కనిపిస్తోంది. దీంతో వైసీపీ పెద్దలు చెప్పినట్లుగా ఇన్నాళ్లూ వ్యవహరిస్తున్న ఆమె.. ఇప్పుడు అదే బాటలో మరో వ్యూహం అమలు చేసేందుకు హైకోర్టు తీర్పు తర్వాత తొలిసారి బయటికి వచ్చారు.

మహిళా కమిషన్ లో సంచైత గజపతిరాజు

మహిళా కమిషన్ లో సంచైత గజపతిరాజు

హైకోర్టు తీర్పు నేపథ్యంలో మాన్సాస్ మాజీ ఛైర్ పర్సన్ గా మారిన సంచైత గజపతిరాజు తొలిసారి విజయనగరం దాటి విజయవాడకు వచ్చారు. ఏపీ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మతో ఆమె భేటీ అయ్యారు. మాన్సాస్ పదవి కోల్పోయిన తర్వాత మహిళా కమిషన్ ను సంచైత సందర్శించడం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మతో సంచైత చర్చలు కీలకంగా మారాయి. తాజాగా మాన్సాస్ ట్రస్టులో లింగ వివక్షపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వాసిరెడ్డి పద్మ డిమాండ్ చేసిన నేపథ్యంలో సంచైతతో ఆమె భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.

లింగ వివక్ష అస్త్రంతో అశోక్ కు ఉద్వాసన ?

లింగ వివక్ష అస్త్రంతో అశోక్ కు ఉద్వాసన ?


అశోక్ గజపతిరాజు మాన్సాస్ ఛైర్మన్ పదవిని తిరిగి చేపట్టడాన్ని వైసీపీ జీర్ణించుకోలేకపోతోంది. దీంతో మాన్సాస్ ట్రస్ట్ లో గత అక్రమాలను తెరపైకి తెచ్చి ఆయన్ను తప్పించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అదే సమయంలో అవన్నీ విఫలమైనా మరో భారీ అస్త్రాన్ని ఆయనపై సంధించేందుకు సిద్దమవుతోంది. అందుకు లింగ వివక్ష అస్త్రాన్ని తెరపైకి తెస్తోంది. ఇప్పటికే మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ సాయంతో ఈ వ్యూహాన్ని అమల్లో పెడుతున్న వైసీపీ సర్కార్.. తాజాగా సంచైతను విజయవాడ పిలిపించి ఆమెకు అన్ని విషయాలు వివరిస్తున్నట్లు తెలుస్తోంది. ఫైనల్ గా లింగ వివక్ష అస్త్రంతో అశోక్ గజపతిరాజును పదవీచ్యుతుడిని చేయాలనేది వైసీపీ వ్యూహంగా కనిపిస్తోంది.

 శబరిమలపై సుప్రీంకోర్టు తీర్పే ఆధారం

శబరిమలపై సుప్రీంకోర్టు తీర్పే ఆధారం


గతంలో శబరిమల దర్శనం విషయంలో మహిళలకు కూడా సమాన హక్కు ఉందంటూ సుప్రీంకోర్టు ఓ తీర్పు ఇచ్చింది. శబరిమలలో లింగ వివక్ష చెల్లదని పేర్కొంది. అలాగే మిగతా ఆలయాల్లోనూ మహిళలకు ప్రవేశం కల్పించాలని ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఇప్పుడు ఈ తీర్పుల్ని ఆధారంగా చేసుకుని మాన్సాస్ నుంచి అశోక్ గజపతిరాజుకు ఉద్వాసన పలకాలని వైసీపీ సర్కార్ యోచిస్తోంది. అందుకు మహిళా కమిషన్ ను సైతం పావుగా వాడుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే సంచైత గజపతిరాజు మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ తో భే్టీ అయ్యారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అదే నిజమైతే అతి త్వరలో వైసీపీ ఈ దిశగా అడులు వేసే అవకాశముంది. ఇప్పటికే అశోక్ పై అన్ని అస్త్రాలు విఫలం కావడంతో హైకోర్టు తీర్పుపై అప్పీలు చేసే అవకాశం కూడా లేదని భావిస్తున్న వైసీపీ సర్కార్ త్వరలో ఈ వ్యూహం అమల్లో పెట్టనుందనే ప్రచారం సాగుతోంది.

English summary
former mansas trust chairperson sanchaita gajapati raju on today met ap women commission chairperson vaisreddy padma to discuss gender discrimination issue in mansas.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X