వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అందరికీ అందుబాటులోకి రానున్న ఇసుక ..ఆన్ లైన్ బుకింగ్ కు సర్వం సిద్ధం

|
Google Oneindia TeluguNews

ఏపీలో కరోనా లాక్ డౌన్ దెబ్బకు ఇసుక సరఫరా కూడా నిలిచిపోయింది. దీంతో నిర్మాణ రంగం మరోమారు కరోనా లాక్ డౌన్ దెబ్బకు కుదేలైంది. ఇక తాజాగా ఇసుక అందరికీ అందుబాటులోకి తీసుకురావటానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఒకటి రెండురోజుల్లో ఇసుక ఆన్‌లైన్‌ బుకింగ్‌కు అనుమతి లభించనుంది. లాక్‌డౌన్‌ కారణంగా కుదేలైన నిర్మాణ రంగాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. అందులో భాగంగానే ఇసుక సరఫరాపై దృష్టి పెట్టింది.

ఇసుక సరఫరాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రభుత్వం

ఇసుక సరఫరాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రభుత్వం

49 రోజులుగా నిర్మాణ రంగ కార్మికులు పనుల్లేక కూలీలు సైతం అల్లాడిపోతున్నారు. లాక్ డౌన్ కారణంగా మార్చి నెల 22 నుంచి ఇప్పటివరకు ఇసుక నిర్మాణ రంగానికి కావలసిన ఇసుక సరఫరా కాలేదు . ఇక ఇప్పుడు నిర్మాణ రంగంలో పనులు ఊపందుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సర్కార్ ఇసుక కొరతను తీర్చేందుకు పక్కాగా ఏర్పాట్లు చేస్తోంది. రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసిన నేపధ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆన్ లైన్ లో ఇసుక బుకింగ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

 ఆన్‌లైన్‌లో కూడా బుకింగ్‌ చేసుకునేలా ప్రభుత్వ చర్యలు

ఆన్‌లైన్‌లో కూడా బుకింగ్‌ చేసుకునేలా ప్రభుత్వ చర్యలు

ఇక ఇసుక తరలింపునకు ప్రభుత్వం ఓకే చెప్పింది. లాక్‌డౌన్‌ సడలింపుల నేపథ్యంలో గతంలో బుక్‌ చేసుకున్న వారికి, ప్రభుత్వ పనులకు ప్రస్తుతం డోర్‌ డెలివరీ ప్రారంభించారు. ఇక దీంతో ఇసుక అవసరం ఉన్నవారు ఆన్‌లైన్‌లో కూడా బుకింగ్‌ చేసుకునేలా ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతుంది . ఈ వ్యవస్థను పర్యవేక్షించేందుకు జిల్లాకు ప్రత్యేక డిప్యూటీ డైరెక్టర్‌ను కూడా నియమించి మరీ ఇసుక సరఫరాపై దృష్టి పెట్టింది ఏపీ ప్రభుత్వం.

Recommended Video

PM Modi Address Nation at 8PM Today | Lockdown Extension Or Lockdown Exit...
భవిష్యత్ లో ఇసుక కష్టాలు లేకుండా ఏర్పాట్లు

భవిష్యత్ లో ఇసుక కష్టాలు లేకుండా ఏర్పాట్లు

ఇక మే తర్వాత జూన్ నెలలో వర్షాలు మొదలయ్యే అవకాశం ఉన్న నేపధ్యంలో ఇసుక కొరత లేకుండా ఉండే విధంగా అన్ని చర్యలు చేపట్టినట్టు తెలుస్తుంది. ముందస్తుగా స్టాకు యార్డులకు ఇసుక తరలించి నిల్వ చేయడం ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్న అధికార యంత్రాంగ భవిష్యత్ లో ఇసుక కష్టాలు లేకుండా చెయ్యాలని ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇప్పటికే అన్ని చోట్ల ర్యాంపులను తెరిచి ఇసుకను స్టాక్‌ యార్డులకు తరలిస్తున్నారు. ఇక ఇప్పుడు ప్రజల నిర్మాణ అవసరాలకు ఇసుక ఇవ్వనున్న నేపధ్యంలో ఏపీలో నిర్మాణ రంగ పనులు మొదలయ్యే అవకాశం ఉంది.

English summary
The supply of sand to the corona lock-down at AP has also stalled. This caused the construction sector to restart again. Arrangements are being made to make fresh sand available to all. Sand online booking will be allowed in one or two days. The government has initiated measures to curb the construction sector which was affected by the lockdown. Part of that is focusing on the supply of sand.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X