వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ధూలిపాళ్ల నరేంద్రకు కరోనా నెగిటివ్.. రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలింపు..!

|
Google Oneindia TeluguNews

అమరావతి: టీడీపీ నేత సంఘం డెయిరీ అధినేత ధూలిపాళ్ల నరేంద్రకు కరోనా నెగిటివ్ వచ్చింది.గత కొద్ది రోజులుగా కరోనాతో బాధపడుతున్న ధూలిపాళ్ల గుంటూరులోని ఆయుష్ హాస్పిటల్‌లో అడ్మిట్ అయి చికిత్స పొందుతున్నారు. బుధవారం మరోసారి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా ఆయనకు నెగిటివ్ వచ్చింది. దీంతో ఏసీబీ అధికారులు ఆయన్ను తిరిగి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. అయితే నెగిటివ్ వచ్చినప్పటికీ ధూలిపాళ్లను వారం రోజుల పాటు ఐసొలేషన్‌లో ఉంచాలని వైద్యులు సూచించారు. జైలులోనే ప్రత్యేక ఐసొలేషన్ గదిని ఏర్పాటు చేస్తామని ఏసీబీ అధికారులు చెప్పారు. సంగం డెయిరీ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ధూలిపాళ్లను ఇప్పట్లో విచారణ చేసే అవకాశం లేదు. ఐసొలేషన్ పూర్తయ్యాకే ఆయన్ను ఏసీబీ అధికారులు విచారణ చేసే అవకాశం ఉంది.

సంగం డెయిరీలో అక్రమాలు చోటు చేసుకున్నాయనే కారణంతో ధూలిపాళ్ల నరేంద్ర కుమార్‌ను అవినీతి నిరోధక విభాగం అధికారులు అరెస్ట్ చేసిన అతి కొద్దిరోజుల్లోనే దాన్ని పాడిపరిశ్రమాభివృద్ధి సంస్థ పరిధిలోకి తీసుకుని రావడానికి కిందటి నెల 27వ తేదీన ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఏపీడీడీసీ తరఫున గుంటూరు జిల్లా పాల ఉత్పత్తిదారుల సహకార యూనియన్ లిమిటెడ్.. ఈ డెయిరీ రోజువారీ కార్యకలాపాలను పర్యవేక్షిస్తుందంటూ తెలిపింది. దీనికోసం ప్రభుత్వం ప్రత్యేక అధికారిని కూడా నియమించింది. గుంటూరు జిల్లా తెనాలి డివిజన్ సబ్ కలెక్టర్‌ను ప్రత్యేకాధికారిగా నియమించింది.

Sangam dairy case main accused Dhulipalla Narendra tested negative for covid,sent to Rajahmundry jail

మూడునెలల పాటు సంగం డెయిరీ.. గుంటూరు జిల్లా పాల ఉత్పత్తిదారుల సహకార యూనియన్ లిమిటెడ్ పర్యవేక్షణలో కొనసాగుతుంది. ఆ తరువాత అప్పటి పరిస్థితుల ఆధారంగా.. దీన్ని పొడిగించడమా? లేక మళ్లీ పాత యాజమాన్యానికి బదలాయించడమా అనేది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఈ మేరకు పశు సంవర్ధక, పాడిపరిశ్రమాభివృద్ధి, మత్స్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య అప్పట్లో ఉత్తర్వులు జారీ చేశారు. గుంటూరు జిల్లా వడ్లమూడిలో ఉన్న సంగం జాగర్లమూడి డెయిరీ ఇక మూడు నెలల పాటు ప్రత్యేకాధికారి పర్యవేక్షణలో కొనసాగుతుందని పేర్కొన్నారు.

దీనిపై సంస్థ డైరెక్టర్లు కోర్టుకెక్కారు. హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దీన్ని విచారణకు స్వీకరించిన ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలను జారీ చేసింది. సంఘం డెయిరీని తెనాలి సబ్ కలెక్టర్‌కు స్వాధీన పరుస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 19ని తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. డెయిరీ రోజువారీ కార్యకలాపాల్లో ఐఏఎస్ అధికారి జోక్యం చేసుకోవడం సరికాదంటూ డైరెక్టర్ల బోర్డు తరఫు న్యాయవాది వినిపించిన వాదనలతో హైకోర్టు ఏకీభవించింది. సంగం డెయిరీ కార్యకలాపాలను యధాతథంగా నిర్వహించుకోవచ్చని హై కోర్టు తీర్పు ఇచ్చింది.

English summary
TDP leader and former MLA Dhulipalla Narendra has been grnted bail in Sangam dairy case by AP high court.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X