వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముఖ్యమంత్రిని కావాలనుకున్నా: సర్వే, సిగ్గుంటే..: కోట్ల

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sarve Satyanarayana
హైదరాబాద్: తాను ఆంధ్రప్రదేశ్‌‍కు ముఖ్యమంత్రి కావాలనుకున్నానని అయితే, రాష్ట్రం విడిపోతున్నందువల్ల భవిష్యత్తులో గవర్నర్‌గా వెళ్తానని కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ శనివారం అన్నారు. మల్కాజిగిరిలోని ఆర్డీవో కార్యాలయంలో ఓ కార్యక్రమంలో సర్వే మాట్లాడారు. రాష్ట్ర విభజన ప్రక్రియ లేకుంటే మంత్రి రఘువీరా రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేవారన్నారు. రఘువీరాను ముఖ్యమంత్రి చేయడంపై ఢిల్లీలో చర్చలు జరిగాయని చెప్పారు.

సిగ్గుంటే బయటకెళ్లి మాట్లాడాలి: కోట్ల

సిగ్గుంటే కాంగ్రెస్ పార్టీని వీడి విమర్శలు చేయాలని కేంద్ర సహాయమంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలనుద్దేశించి కర్నూలు జిల్లాలో అన్నారు. అన్నారు. కాంగ్రెస్ పార్టీ టికెట్‌పై ఎమ్మెల్యేలుగా, ఎంపిలుగా గెలిచి పార్టీ ఇచ్చిన పదవులను అనుభవిస్తూ కొంతమంది నాయకులు నేడు పార్టీని విమర్శించడం సరికాదన్నారు. పార్టీలో అన్ని ప్రయోజనాలు పొందుతూ తెలంగాణపై సోనియా తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించడం విచారకరమన్నారు.

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అవుతుందని సొంత పార్టీ నాయకులే చెప్పడం బాధాకరమని, పార్టీ ఖచ్చితంగా విజయం సాధిస్తుందన్నారు. పార్టీలో నాయకులు ఎవరూ లేరని, అంతా కార్యకర్తలమేనన్నారు. సమైక్యాంధ్ర కోసం పదవికి రాజీనామా చేసి ప్రొటోకాల్‌ను పక్కన పెట్టానన్నారు. కార్యాలయానికి వెళ్లడం మానేశానన్నారు. సమైక్యాంధ్ర కోసం కేంద్రంతో పోరాడుతున్నానని చెప్పారు. ఒకవేళ రాష్ట్రం విడిపోతే కర్నూలును రాజధానిని చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.

కర్నూలు రాజధానిని సాధించి తీరుతామన్నారు. రాయల తెలంగాణ ప్రతిపాదనను బిజెపి తిరస్కరించింది కాబట్టే ఆ డిమాండ్‌ను కాంగ్రెస్ పార్టీ పక్కన పెట్టిందని వివరించారు. అయినప్పటికీ రాయల తెలంగాణ ఏర్పాటు చేస్తే తాగు, సాగునీటి సమస్య పరిష్కారమవుతుందన్నారు. మొదట్లో టిడిపి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు తెలంగాణ ఇవ్వాలని ప్రకటించాయని, అయితే సీమాంధ్రలో జరిగిన ఉద్యమాన్ని చూసి ఆ పార్టీలు తమ నిర్ణయాన్ని మార్చుకున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్‌పై సొంత ఎంపిలే అవిశ్వాస తీర్మానం పెట్టడాన్ని తాను సమర్థించలేదన్నారు.

English summary
Union Minister Sarve Satyanarayana on Saturday said High Command was considered Minister Raghuveera Reddy's name for CM post.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X