వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబు..సతీష్ రెడ్డి మాటలతో అయినా సిగ్గు తెచ్చుకో: మంత్రి పెద్దిరెడ్డి

|
Google Oneindia TeluguNews

స్థానిక సంస్థల ఎన్నికల వేళ చంద్రబాబుకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు కడప టీడీపీ నేత సతీష్ రెడ్డి . టీడీపీకి రాజీనామా చెయ్యటంతో పాటు పులివెందుల నియోజకవర్గ ఇంచార్జ్ గా తప్పుకున్నారు. ఇక చంద్రబాబుకు తనపై నమ్మకంలేదని , సుదీర్ఘ కాలం టీడీపీలో పని చేసినా తగిన గుర్తింపు లేదని ఆయన కార్యకర్తల సమావేశంలో అన్నారు. ఇక వైఎస్ కుటుంబంతో దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నా తనకు గుర్తింపు లేదని,చంద్రబాబుతో గ్యాప్ పెరిగిందని సతీష్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఈ నేపధ్యంలో సతీష్ రెడ్డి వ్యాఖ్యలతో చంద్రబాబు బుద్ధి తెచ్చుకోవాలని వ్యాఖ్యానించారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి .

Recommended Video

Minister Peddireddy Ramachandra Reddy Counters On Chandrababu & TDP | Oneindia Telugu
సతీష్ రెడ్డి మాటలకు బాబు సిగ్గు పడాలి అన్న మంత్రి

సతీష్ రెడ్డి మాటలకు బాబు సిగ్గు పడాలి అన్న మంత్రి

14 ఏళ్లు సీఎంగా ఉన్నప్పటికీ చిత్తూరు జిల్లాలో బాబు మెజారిటీ సీట్లు గెలవలేకపోయారని ఎద్దేవా చేశారుమంత్రి . సతీష్‌రెడ్డి , డొక్కా మాణిక్యవరప్రసాద్‌, రెహమాన్ టీడీపీకి ఎందుకు రాజీనామా చేశారో చంద్రబాబు ఆత్మ పరిశీలన చేసుకోవాలని మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రా రెడ్డి హితవు పలికారు. రాజీనామా చేసిన సతీష్ రెడ్డి మాట్లాడిన మాటలకు చంద్రబాబు సిగ్గు తెచ్చుకోవాలన్నారు.

ఎన్నికల్లో డిపాజిట్లు రావని తెలిసే బాబు దుష్ప్రచారాలు

ఎన్నికల్లో డిపాజిట్లు రావని తెలిసే బాబు దుష్ప్రచారాలు

స్థానిక సంస్థల ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రావని తెలిసే చంద్రబాబు వైసీపీపై ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని, కానీ ప్రజల మద్దతు అధికార వైసీపీకే ఉందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. పారదర్శకంగా ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. వైఎస్సార్‌సీపీ అక్రమంగా, దౌర్జన్యంగా ఎన్నికలు నిర్వహిస్తోందని దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

గ్రామ వాలంటీర్లు వైసీపీ కోసం పనిచేస్తున్నారన్నది అబద్ధం అన్న మంత్రి

గ్రామ వాలంటీర్లు వైసీపీ కోసం పనిచేస్తున్నారన్నది అబద్ధం అన్న మంత్రి


ఓడిపోతారని తెలిసే వైసీపీ అక్రమంగా ఎన్నికలు నిర్వహిస్తుందని చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇక గ్రామ వాలంటీర్లను వాడుకుంటున్నామని టీడీపీ దుష్ప్రచారానికి దిగిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వాలంటీర్లు వాళ్ల పని వాళ్లు చేస్తున్నారని వాళ్ళు రేషన్ కార్డుల పంపిణీ, ఇళ్ల పట్టాలు ఇతరత్రా 60 రకాల పనులు చేస్తున్నారని పేర్కొన్నారు. ఉక్రోషంతోనే చంద్రబాబు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు .

చంద్రబాబు మాటలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా అన్న పెద్దిరెడ్డి

చంద్రబాబు మాటలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా అన్న పెద్దిరెడ్డి

తనపై పరుష పదజాలం వాడిన చంద్రబాబు తీరును అతని విజ్ఞతకే వదిలేస్తున్నాను. బాబు మాటలతో ఇలాంటి నాయకుడా సీఎంగా మనల్ని పాలించింది అని రాష్ట్ర ప్రజలు సిగ్గుపడుతున్నారు అని మంత్రి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు.14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ చిత్తూరు జిల్లాలో మెజారిటీ స్థానాల్లో చంద్రబాబు ఎందుకు గెలవలేకపోయారు అని ప్రశ్నించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.

English summary
Despite being a 14-years CM, Babu did not win a majority of seats in Chittoor district. peddi Reddy asked chandrababu Sathish Reddy, Dokka Manikavaraprasad and Rahman to resign from the TDP ?. Chandrababu should be ashamed of the words of Satish Reddy who resigned minister Peddireddy ramachandra reddy said
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X