వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ వద్దన్నారు: శత్రుచర్ల సంచలనం, కిరణ్‌పై బండారు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Satrucharla Vijaya RajM Raju
హైదరాబాద్: మంత్రి శత్రుచర్ల విజయ రామరాజు సోమవారం అసెంబ్లీ లాబీల్లా సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి, కాంగ్రెసు పార్టీ సీనియర్ శాసన సభ్యులు ధర్మాన ప్రసాద రావుకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి టిక్కెట్ ఇవ్వనని చెప్పారని తెలిపారు.

తాను నియోజకవర్గంలో లక్ష మందితో సమావేశం పెడతానని జగన్‌తో ధర్మాన అంటే.. జనం నిన్ను చూసి వస్తారా లేక నన్ను చూసి వస్తారా అని జగన్ ఎద్దేవా చేశారని చెప్పారు. ధర్మాన ప్రసాద రావుకు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ టిక్కెట్ ఇచ్చే పరిస్థితి లేదన్నారు.

సీమాంధ్రలో కాంగ్రెసు పార్టీ తరఫున పోటీ చేసే పరిస్థితి కనిపించడం లేదన్నారు. తాను తెలుగుదేశం పార్టీలో గానీ, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో గానీ చేరనని చెప్పారు. అవసరమైతే స్వతంత్ర అభ్యర్థిగా తాను 2014 ఎన్నికలలో పోటీ చేస్తానని చెప్పారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సొంత పార్టీ పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయన్నారు.

ఇతర పార్టీల వైపు చూస్తున్నారు: బండారు

విభజన నిర్ణయం నేపథ్యంలో సీమాంధ్రలో ఎవరు కూడా కాంగ్రెసు వైపు చూడటం లేదని, అందరూ ఇతర పార్టీల వైపు చూస్తున్నారని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానంద రావు అన్నారు. తనతో పాటు చాలామందికి ఇతర పార్టీల నుండి ఆహ్వానం అందిందన్నారు. కిరణ్ పార్టీ పెడతారనే వార్తలు వస్తున్నాయని కానీ, ఆ పార్టీ ఎన్నికల్లో గెలుస్తుందన్న గ్యారెంటీ లేదన్నారు. విభజన జరిగినా, జరగకపోయినా కాంగ్రెసు వైపు ఎవరు చూడటం లేదన్నారు. చాలామంది నాయకులు 23వ తేదీ తర్వాత నిర్ణయం తీసుకుంటారన్నారు.

English summary
Minister Satrucharla Vijaya Raja raju on Monday make hot comments on former minister Dharamana Prasad Rao.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X