• search
  • Live TV
విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

అయేషా హత్య: కేసు ఏమిటి, జరిగిందేమిటి, అసలు దోషులెవరు..

By Ramesh Babu
|

విజయవాడ: అయేషా మీరా హత్య కేసులో సత్యం బాబును హైకోర్టు నిర్దోషిగా ప్రకటించడంపై అయేషా తల్లి షంషాద్‌ బేగం హర్షం వ్యక్తం చేశారు. చివరికి న్యాయమే గెలిచిందన్నారు. న్యాయ వ్యవస్థ మంచి తీర్పు ఇచ్చిందని చెప్పారు. సత్యం బాబుకు పోలీసులు రూ.కోటి నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

ఆయేషా హత్య కేసుతో సత్యంబాబుకు ఎలాంటి సంబంధం లేదని వారు చెప్పారు. నిబధ్దత కలిగిన అధికారులతో కేసును మళ్లీ రీఓపెన్ చేయించాలని, ఈ కేసు విషయంలో నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు ఆనాడు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఆయేషా తల్లి కోరింది. మరోవైపు ఆయేషా కేసులో సత్యంబాబుకు ఎలాంటి సంబంధం లేదని బాధితులు కూడా చెబుతున్నారు.

అసలేమిటీ ఈ కేసు?

అసలేమిటీ ఈ కేసు?

2007 డిసెంబర్‌ 27న బీ ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా విజయవాడలోని హాస్టల్‌లో హత్యకు గురయింది. వసతి గృహంలోని బాత్రూంలో రక్తపు మడుగులో పడి ఉన్న ఆయేషాను గుర్తించిన అక్కడివారు పోలీసులకు సమాచారమిచ్చారు. మృతదేహం పక్కన ఓ లేఖ ఉంది. తన ప్రేమను తిరస్కరించడంతోనే ఆయేషాను అత్యాచారం చేసి, చంపేసినట్లు నిందితుడు లేఖలో పేర్కొన్నాడు. అప్పట్లో ఈ ఘటన సంచలనం సృష్టించింది.

సత్యంబాబు ప్రధాన నిందితుడన్న పోలీసులు...

సత్యంబాబు ప్రధాన నిందితుడన్న పోలీసులు...

ఈ కేసులో కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం అనాసాగరం గ్రామానికి చెందిన సత్యం బాబుని ప్రధాన నిందితుడిగా గుర్తిస్తూ 2008 ఆగస్టులో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. అయితే సత్యంబాబు అరెస్టు ఈ కేసులో ఎన్నో అనుమానాలకు దారి తీసింది. అసలు నేరస్థులను రక్షించే ఉద్దేశ్యంలో భాగంగా సత్యం బాబును అరెస్ట్ చేశారంటూ అతడి బంధువులు, మానవహక్కుల కార్యకర్తలు ఆరోపించారు. జైలులో ఉన్న సమయంలో సత్యం బాబుకు అనారోగ్యం కారణంగా పక్షవాతం వచ్చింది. మరోవైపు సత్యం బాబు జైలు నుంచి తప్పించుకున్నాడని, అతడిని మళ్లీ అరెస్టు చేశామని అప్పట్లో పోలీసులు తెలిపారు.

నడవలేని స్థితిలో.. ఎలా తప్పించుకుంటాడు?

నడవలేని స్థితిలో.. ఎలా తప్పించుకుంటాడు?

అయితే కనీసం సొంతంగా నడవలేని పరిస్థితిలో ఉన్న సత్యం బాబు జైలు నుంచి ఎలా తప్పించుకుంటాడని అతడి తల్లిదండ్రులు ప్రశ్నించారు. డాక్టర్లు కూడా అతడు నడవడం కష్టమని చెప్పడంతో ఈ కేసులో అనుమానాలు బలపడ్డాయి. అయితే ఇవేవీ రుజువు కాకపోవడంతో విజయవాడ మహిళా సెషన్స్‌ కోర్టు సత్యం బాబుకు యావజ్జీవ ఖైదు విధిస్తూ తీర్పు చెప్పింది. ఈ నేపథ్యంలో శుక్రవారం హైకోర్టు సత్యం బాబుని నిర్దోషిగా ప్రకటిస్తూ తీర్పు వెలువరించింది. అంతేకాకుండా దర్యాప్తు అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని, పరిహారంగా రూ.లక్ష చెల్లించాలని ఆదేశించింది. పరిహారం కోసం పిటిషన్‌ దాఖలు చేసుకోవాలని సత్యం బాబుకు హైకోర్టు సూచించింది.

‘‘ఎవరో చేసిన నేరానికి నా కొడుకు బలి..’’

‘‘ఎవరో చేసిన నేరానికి నా కొడుకు బలి..’’

హైకోర్టు తీర్పు నేపథ్యంలో సత్యంబాబు తల్లి మరియమ్మ ఆనందం వ్యక్తం చేసింది.

చేయని నేరానికి తన కొడుకు సత్యంబాబు 8 ఏళ్లు జైలు శిక్ష అనుభవించాడని ఆవేదన వ్యక్తం చేసింది. ఎవరో చేసిన నేరానికి తన కొడుకును బలిపశువు చేశారని, ఎప్పటికైనా న్యాయం గెలుస్తుందని ఈ తీర్పు రుజువు చేసిందని వ్యాఖ్యానించింది. అసలైన దోషులను పట్టుకుని శిక్షించడంతోపాటు తమ కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలని మరియమ్మ డిమాండ్ చేసింది. అన్యాయంగా శిక్ష అనుభవించిన తన కుమారుడికి జీవనోపాధి, కుమార్తె వివాహానికి ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని కోరింది. ప్రస్తుతం కూలి పనులు చేసుకుంటూ తాను జీవనం సాగిస్తున్నాని, తమకు పక్కా గృహం మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని వేడుకుంది. తన కొడుకుపై అన్యాయంగా కేసు పెట్టి జైలుకు పంపినా అనాసాగరం గ్రామస్తులు తనకు అండగా నిలిచారని ఆమె సంతోషం వ్యక్తం చేసింది. హైకోర్టు తీర్పు పై సత్యంబాబు బంధువులు, ఆ ప్రాంతవాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

English summary
In a landmark judgment, the Hyderabad High Court on Friday not only acquitted the accused in the sensational Ayesha Meera murder case but also awarded him Rs1 lakh compensation for putting him in jail for eight years.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X