వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'సత్యం' రాజు కోర్టుకు: డిసెంబర్ 23న తీర్పు? (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ : సత్యం కంప్యూటర్‌ సర్వీసెస్‌ ఆర్థిక మోసాలకు సంబంధించిన కేసులో ప్రత్యేక కోర్టు తీర్పు డిసెంబర్‌ 23న వెలువడే అవకాశం ఉంది. గురువారం ప్రత్యేక న్యాయమూర్తి బివిఎల్‌ఎన్‌ చక్రవర్తి ఈ కేసు తీర్పు ప్రకటన తేదీ వచ్చే నెల 23గా నిర్ణయించారు. సత్యం కేసులో నిందితులుగా ఉన్న పది మంది గురువారం కోర్టుకు హాజరయ్యారు.

వీరిలో ప్రధాన నిందితుడిగా ఉన్న సత్యం కంప్యూటర్స్‌ వ్యవస్థాపక మాజీ చైర్మన్‌ బి రామలింగరాజు, ఆయన సోదరుడు, సత్యం మాజీ ఎండి బి రామలింగరాజు, కంపెనీ మాజీ సిఎఫ్‌ఒ వడ్లమాని శ్రీనివాస్‌, పిడబ్ల్యుసి మాజీ ఆడిటర్లు సుబ్రమణి గోపాలకృష్ణన్‌, టి శ్రీనివాస్‌, రాజు మరో సోదరుడు బి సూర్యనారాయణ రాజు, మాజీ ఉద్యోగులు జి రామకృష్ణ, డి వెంకటపతి రాజు, సిహెచ్‌ శ్రీశైలం, సత్యం మాజీ ఇంటర్నల్‌ చీఫ్‌ ఆడిటర్‌ విఎస్‌ ప్రభాకర్‌ గుప్తా ఉన్నారు.

ఈ సందర్భంగా కోర్టు ప్రాంగణంలో హడావుడి చోటు చేసుకుంది. కోర్టులోకి మీడియాను అనుమతించలేదు. కాగా సిబిఐ సమర్పించిన కొన్ని ఎలక్ర్టానిక్‌ సాక్ష్యాలను సవాలు చేస్తూ రాజు సమర్పించిన దరఖాస్తుపై విచారణ జరిగినట్టు తెలుస్తోంది.

రామలింగ రాజు ఇలా..

రామలింగ రాజు ఇలా..

సత్యం కుంభకోణం కేసులో రామలింగ రాజు ఇలా కోర్టుకు వచ్చారు. ఈ సందర్భంగా కోర్టు ప్రాంగణంలో హడావిడి చోటు చేసుకుంది.

రామలింగ రాజు ఇలా...

రామలింగ రాజు ఇలా...

సత్యం కుంభకోణం కేసులో రామలింగ రాజు హైదరాబాదులోని కోర్టుకు వచ్చారు. ఈ సందర్భంగా మీడియాను లోనికి అనుమతించలేదు.

రామలింగ రాజు ఇలా..

రామలింగ రాజు ఇలా..

సత్యం కుంభకోణం కేసులో తీర్పు డిసెంబర్ 23వ తేదీన వెలువడే అవకాశం ఉంది. గురువారంనాడు రామలింగ రాజు కోర్టుకు వచ్చారు.

రామలింగ రాజు ఇలా..

రామలింగ రాజు ఇలా..

సత్యం కుంభకోణం కేసులో కోర్టుకు వచ్చిన రామలింగ రాజు కాసేపు కోర్టులో ఉన్నారు. ఈ కేసు తీర్పు డిసెంబర్ 23వ తేదీన వెలువడే అవకాశం ఉంది.

English summary
The Special Court trying the case pertaining to the Satyam Computer Services scam here on Thursday, posted it to December 23. In all probability, the Court will pronounce the judgement on that day in the six year-old case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X