వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'సత్యం' రామలింగరాజు కేసు తీర్పు ఏప్రిల్ 9కి వాయిదా

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సత్యం కంప్యూటర్స్ కుంభకోణం కేసు తీర్పు ఏప్రిల్ 9కి వాయిదా పడింది. నేరపూరిత కుట్ర, నమ్మకద్రోహం, మోసం, నకిలీ పత్రాల అభియోగాలు అప్పటి సత్యం కంప్యూటర్స్ ఛైర్మన్ రామలింగరాజు నమోదయ్యాయి. ఆరేళ్ల నుంచి ఈ కేసు విచారణ కొనసాగుతోంది. కాగా, సోమవారం కోర్టు తీర్పును ఏప్రిల్ 9కి వాయిదా వేసింది.

కంపెనీ వాస్తవ ఆదాయాన్ని అధికంగా చూపి షేరు ధరను తాత్కాలికంగా భారీగా పెంచేసిన అప్పటి సత్యం కంప్యూటర్స్ ఛైర్మన్ రామలింగరాజు, షేర్ మార్కెట్‌ను మోసం చేశారు. 2009 జనవరి 7న ఒక్కసారిగా వాస్తవం వెలుగులోకి రావడంతో కంపెనీ షేరు భారీగా పడిపోయింది.

Satyam case verdict postponed to April 9th

దీంతో ఇన్వెస్టర్లు నిండా మునిగిపోయారు. స్టాఫ్ట్‌వేర్ రంగాన్ని పెను కుదుపు కుదిపిన ఈ కేసులో రామలింగరాజు సహా పలువురు అరెస్టయ్యారు. సుదీర్ఘకాలంగా ఈ కేసును విచారించిన ప్రత్యేక కోర్టు విచారణ ముగిసినట్లు గత డిసెంంబర్ 23న ప్రకటించింది.

విచారణలో భాగంగా 3వేల పత్రాలను పరిశీలించిన న్యాయస్థానం 226మంది సాక్షులను విచారించింది. 2015 మార్చి 9న తీర్పు వెలువరించనున్నట్లు వెల్లడించింది. మార్చి 9న ఈ కేసు తీర్పును ఏప్రిల్ 9కి వాయిదా వేస్తున్నట్లు కోర్టు పేర్కొంది.

English summary
Satyam Computers chairman Satyam Ramalinga Raju case verdict postponed to April 9th.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X