వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్‌ లేఖ కోర్టు ధిక్కారమే - పిటిషన్‌కు అనుమతివ్వాలని ఏజీని కోరిన సుప్రీం లాయర్‌

|
Google Oneindia TeluguNews

ఏపీలో వైసీపీ ప్రభుత్వాన్ని అస్ధిర పరిచేందుకు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీరమణ ఏపీ హైకోర్టులోని కొందరు న్యాయమూర్తులతో కలిసి ప్రయత్నాలు చేస్తున్నారంటూ ఛీఫ్‌ జస్టిస్‌ బాబ్డేకు సీఎం జగన్‌ రాసిన లేఖ దుమారం రేపుతూనే ఉంది. ఈ లేఖపై విచారణ జరగాలని కొందరు, వద్దని మరికొందరు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులోని ప్రభుత్వ న్యాయవాది ఒకరు అటార్నీ జనరల్‌కు చేసిన విజ్ఞప్తి ప్రాధాన్యం సంతరించుకుంది.

సుప్రీంకోర్టు ఛీఫ్‌ జస్టిస్‌ బాబ్డేకు సీఎం జగన్‌ రాసిన లేఖ కచ్చితంగా కోర్టు ధిక్కారమే అవుతుందని సుప్రీంకోర్టు న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ తెలిపారు. ఈ మేరకు కోర్టు ధిక్కార పిటిషన్‌ దాఖలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌ను ఆయన తాజాగా కోరారు. సీఎం జగన్‌ ప్రధాన న్యాయమూర్తికి రాసిన లేఖను బహిర్గతం చేయడం కోర్టు ధిక్కారంగా పరిగణనలోకి
తీసుకోవాలని అశ్విని ఉపాధ్యాయ కోరారు. 31 కేసుల్లో నిందితుడిగా ఉన్న జగన్‌ కోర్టులు, న్యాయమూర్తులను బెదిరించేలా ప్రవర్తిస్తున్నాడంటూ తెలిపారు.

sc lawyer aswini upadhyaya urges attorney general to file contempt plea on jagan letter

ఇప్పటికే జగన్‌ను సీఎం పదవి నుంచి తొలిగించేలా ఉత్తర్వులు ఇవ్వాలని ఇప్పటికే అశ్వినీ ఉపాధ్యాయ సుప్రీంకోర్టు ఛీఫ్‌ జస్టిస్‌కు కూడా లేఖ రాశారు. ప్రజాప్రతినిధులపై దాఖలైన కేసులను సత్వరం పరిష్కరించేలా ఆదేశాలు ఇవ్వాలని గతంలో అశ్విని సుప్రీంకోర్టును కోరారు. ఇదే కోవలో జగన్‌పైనా తీవ్రమైన ఆర్ధిక నేరాల ఆరోపణలు ఉన్నాయని, వీటి దృష్ట్యా జగన్‌ను పదవికి అనర్హుడిగా ప్రకటించాలని అశ్వినీ ఉపాధ్యాయ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి రాసిన లేఖలో కోరారు.

English summary
supreme court advocate aswini upadhyaya urges attorney general kk venugopal to allow filing contempt petition against andhra pradesh cm ys jagan's controversial letter to chief justce of india.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X