వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైసీపీ రంగులకు సుప్రీం నో: కాషాయ రంగు వేస్తే ఒప్పుకుంటారా: ఏపి ప్రభుత్వ పిటీషన్ కొట్టివేత..!

|
Google Oneindia TeluguNews

సుప్రీం కోర్టులో ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురైంది. గత వారం రాష్ట్ర ఎన్నికల సంఘం కరోనా కారణంగా ఎన్నికలను వాయిదా వేయటం పైన ఏపీ ప్రభుత్వం సుప్రీంని ఆశ్రయించగా..ఎన్నికల సంఘం నిర్ణయాన్ని సుప్రీం సమర్ధించింది. కొన్ని సూచనలు చేసింది. ఇక, ఇప్పుడు పంచాయతీ భవనాలకు వైసీపీ జెండా రంగులు వేయడంపై సుప్రీం కోర్టు కీలక తీర్పు ఇచ్చింది.

Recommended Video

Supreme Court Counters Jagan Govt | Govt Buildings Should Not Painted With Party Colours
పంచాయితీ కార్యాలయాలకు వైసీపీ రంగులు

పంచాయితీ కార్యాలయాలకు వైసీపీ రంగులు

స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు పంచాయితీ కార్యాలయాలతో పాటుగా ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉందని.. వెంటనే ఎన్నికల సంఘం స్పందించి రంగులు తొలగించాలని హైకోర్టులో పిటీషన్ దాఖలైంది. దీని పైన ఏపీ హైకోర్టు పది రోజుల సమయంలో వీటిని తొలిగించాలని ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం పిటీషన్ దాఖలు చేయగా..దీని పైన విచారించిన సుప్రీం ప్రధాన న్యాయమూర్తి కీలక తీర్పును వెల్లడించారు.

 కాషాయ రంగు వేస్తే ఒప్పుకుంటారా..

కాషాయ రంగు వేస్తే ఒప్పుకుంటారా..

ఏపీ ప్రభుత్వం హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల పైన సుప్రీంలో పిటీషన్ దాఖలు చేసింది. పిటిషన్‍ను విచారించిన ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. కేంద్ర ప్రభుత్వ భవనాలకు కాషాయ రంగు వేస్తే ఒప్పుకుంటారా అని ప్రశ్నించింది. ఇదే సమయంలో హైకోర్టు ఆదేశాలను సమర్థిస్తూ పిటిషన్‍ను కొట్టివేసింది. హైకోర్టు తీర్పును ఇప్పుడు సుప్రీం సమర్ధించటంతో గ్రామ సచివాలయ భవనాలకు రాజకీయ పార్టీల రంగులు తొలగించాలని ఆదేశాలు అమలు కావాల్సి ఉంటుంది. పంచాయతీ భవనాలకు రంగులు వేయాలంటూ.. 2019 ఆగష్టు11న పంచాయతీరాజ్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఇచ్చిన మెమోను హైకోర్టు రద్దు చేసింది. దీంతో..ఇప్పుడు దీని పైన ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించినా సర్వోన్నత న్యాయస్థానం సైతం అదే తీర్పును సమర్ధిస్తూ తీర్పు ప్రకటించింది.

 ఆ తీర్పును అమలు చేయాల్సిందే..

ఆ తీర్పును అమలు చేయాల్సిందే..


గుంటూరు జిల్లా పల్లపాడుకు చెందిన ముప్పా వెంకటేశ్వరరావు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది. గ్రామాల్లో పంచాయతీ కార్యలయాలకు రంగులు వేయడంపై ప్రతిపక్షం టీడీపీ కూడా అభ్యంతరం చెబుతోంది. స్థానిక సంస్థల ఎన్నికలు ఉండటంతో.. ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉందని.. వెంటనే ఎన్నికల సంఘం స్పందించి రంగులు తొలగించాలని డిమాండ్ చేశారు.పంచాయతీ భవనాలు, ప్రభుత్వ కార్యాలయాలకు సీఎస్‌ నిర్ణయం ప్రకారం పది రోజుల్లో మళ్లీ రంగులు వేయాలని నాడు హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ఇచ్చిన ఆదేశాలు అమలు చేసినట్లు ఆధారాలను నివేదిక రూపంలో సమర్పించాలని సీఎస్‌ను హైకోర్టు ఆదేశించింది. వైసీపీ జెండా రంగు తరహాలో రంగులు వేయాలని పంచాయతీరాజ్‌శాఖ కమిషనర్‌ జారీ చేసిన మెమోను హైకోర్టు రద్దు చేసింది. గ్రామాల్లోని పాఠశాలలు, పంచాయతీ భవనాలు, వాటర్‌ ట్యాంకులకు వైసీపీ జెండాను పోలిన రంగులు వేయడంపై ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలు ఆందోళన చేస్తున్నాయి. ఇక, ఇప్పుడు సుప్రీం ఆదేశాలతో ఏపీ ప్రభుత్వం రంగులు తొలిగించక తప్పని పరిస్థితి ఏర్పడింది.

English summary
In Yet another shock to AP govt the Supreme court upheld the High court's order over the party colour to the village offices.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X