వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో మోగిన బడిగంట ... తొలిరోజు స్కూలుకు విద్యార్థులు .. కరోనా మార్గదర్శకాలతోనే క్లాసులు

|
Google Oneindia TeluguNews

కరోనా మహమ్మారి కారణంగా ఆరు నెలల పాటు సుదీర్ఘ విరామం తీసుకున్న ఏపీలోని పాఠశాలలు, కళాశాలలు నేటి నుండి తిరిగి ప్రారంభం అయ్యాయి. బడిగంట మోగిన వేళ కరోనా నిబంధనలు పాటిస్తూ క్లాసులు నిర్వహించనున్నారు ఏపీ లోని పాఠశాలల నిర్వాహకులు. సామాజిక దూరాన్ని పాటిస్తూ, మాస్కులు ధరించి, శానిటైజేషన్ చేయగా నేడు పలువురు విద్యార్థులు క్లాసులకు హాజరు అయ్యారు.

ఏపీ ,తెలంగాణ లబ్దిదారులకు గుడ్ న్యూస్ .. వన్ నేషన్ వన్ రేషన్ లో ఇరు రాష్ట్రాల్లో ఎక్కడైనా రేషన్ !!ఏపీ ,తెలంగాణ లబ్దిదారులకు గుడ్ న్యూస్ .. వన్ నేషన్ వన్ రేషన్ లో ఇరు రాష్ట్రాల్లో ఎక్కడైనా రేషన్ !!

నేటి నుండి ఏపీలో 9వ తరగతి నుండి 12వ తరగతి వరకు క్లాసుల నిర్వహణ

నేటి నుండి ఏపీలో 9వ తరగతి నుండి 12వ తరగతి వరకు క్లాసుల నిర్వహణ

అన్ లాక్ 4.0 లో భాగంగా తొమ్మిదో తరగతి నుండి 12వ తరగతి వరకు క్లాసుల నిర్వహణకు కేంద్రం అనుమతి ఇవ్వడంతో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ పలు మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇక కరోనా మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని కేంద్రం స్పష్టం చేసింది. దీంతో ఆరు నెలల తర్వాత తెలుగు రాష్ట్రాల్లో స్కూళ్లు కాలేజీలు పునః ప్రారంభమయ్యాయి. దీంతో కొంత మంది విద్యార్థులు ఉత్సాహంగా స్కూల్ కి వస్తే, చాలా మంది విద్యార్థులను కరోనా భయంతో తల్లిదండ్రులు పాఠశాలలకు పంపించని పరిస్థితి ఉంది.

 స్కూల్స్ పంపాలా వద్దా .. నిర్ణయం తల్లిదండ్రులదే

స్కూల్స్ పంపాలా వద్దా .. నిర్ణయం తల్లిదండ్రులదే

కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాలలో భాగంగా తల్లిదండ్రుల అనుమతితోనే స్కూల్ కు వెళ్లాల్సి ఉంటుంది. ఒకవేళ తల్లిదండ్రులు తమ పిల్లల్ని స్కూల్ కు పంపించవద్దని నిర్ణయించుకుంటే వారికి ఆన్లైన్ ద్వారా తరగతులు వినే ఆప్షన్ ను ప్రభుత్వం కల్పిస్తుంది. ఇంటర్మీడిట్ కళాశాలలలో కూడా ఇదే విధానాన్ని అనుసరించనున్నట్లుగా తెలుస్తుంది. ఏపీ విద్యాశాఖ గైడ్లైన్స్ ప్రకారం కరోనా నిబంధనలు పాటిస్తూ తొమ్మిదవ తరగతి నుండి 12వ తరగతి వరకు విద్యార్థులకు నేడు స్కూల్స్ ప్రారంభమయ్యాయి. కరోనా కన్టైన్మెంట్ జోన్స్ లో తప్ప మిగతా అన్ని ప్రాంతాలలోనూ నేడు స్కూల్స్ తెరుచుకున్నాయి.

స్కూల్స్ లో కరోనా మార్గదర్శకాలు .. కఠినంగా అమలు

స్కూల్స్ లో కరోనా మార్గదర్శకాలు .. కఠినంగా అమలు

స్కూల్ గదులను, పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటుగా, ఉపాధ్యాయులు, స్కూల్ సిబ్బంది అందరూ సామాజిక దూరం పాటిస్తూ తరగతులను నిర్వహించాల్సి ఉంటుంది. విద్యార్థులు సైతం పక్క విద్యార్థులకు దూరంగా సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ కూర్చోవాల్సి ఉంటుంది . అదే విధంగా ఎప్పటికప్పుడు శానిటైజేషన్‌ కూడా నిర్వహించాల్సి ఉంటుంది.

కరోనా నిబంధనల మేరకు తరగతుల్లో ఉపాధ్యాయులు అనుసరించిన విధానాలను, బాధ్యతలను స్పష్టంగా చెప్పిన విద్యాశాఖ, ఉపాధ్యాయులు అటు ఆన్లైన్ ద్వారా తరగతులు నిర్వహించడానికి, స్కూల్ కి వచ్చిన విద్యార్థులకు పాఠాలు చెప్పడానికి తగిన విధంగా షెడ్యూలు కూడా రూపొందించింది.

Recommended Video

Schools Reopening Guidelines For Classes 9 To 12, తల్లిదండ్రుల కు ఇష్టమైతేనే ! || Oneindia Telugu
 మోగిన బడిగంట .. మార్గదర్శకాలతో క్లాసులు నిర్వహిస్తున్న టీచర్స్

మోగిన బడిగంట .. మార్గదర్శకాలతో క్లాసులు నిర్వహిస్తున్న టీచర్స్

రోజు విడిచి రోజు ఉపాధ్యాయులు విధులకు హాజరు కావాల్సి ఉంటుందని, కొన్ని చోట్ల వారంలో మూడు రోజుల చొప్పున హాజరయ్యేందుకు అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. విద్యార్థుల్లో ఎవరికైనా అనారోగ్య లక్షణాలు కనిపిస్తే వెంటనే అప్రమత్తమై వైద్య శాఖ అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. ఇక స్కూల్ కు విద్యార్థులు వచ్చి చదువుకునే దానికంటే, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆన్లైన్ ద్వారా చదువుకునే విద్యార్థులపై కూడా దృష్టిపెట్టాల్సిన బాధ్యత టీచర్స్ పై ఉంది. ఒకపక్క కరోనా నిబంధనలు పాటించడం, మరోపక్క విద్యార్థుల పై శ్రద్ధ పెట్టడం వంటి టాస్క్ లతో ఏపీలో స్కూల్స్ పునః ప్రారంభం అయ్యాయి. ఈ క్రమంలో నేడు బడి గంట మోగింది.

English summary
Schools started today for students from ninth grade to 12th grade following the corona rules according to the AP Education Guidelines. Schools are open today in all areas except Corona Containment Zones. The first day classes are held following social distance, sanitizing and wearing masks.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X