వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో తొలిరోజు స్కూల్స్ .. కరోనా నిబంధనల్లోనూ 80 శాతం హాజరైన విద్యార్థులు : మంత్రి ఆదిమూలపు సురేష్

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేడు బడి గంటలు మోగాయి. కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ఇంతకాలం స్కూల్స్ తెరుచుకోలేదు. నేటి నుండి పాఠశాలల పునఃప్రారంభం చేయడంతో విద్యార్థులు సంతోషంగా పాఠశాలలకు పరుగులు పెట్టారు. అటు టీచర్లు , ఇటు విద్యార్థులతో స్కూల్స్ లో సందడి నెలకొంది. చాలా కాలం సుదీర్ఘ విరామం తర్వాత విద్యార్థులు , టీచర్లు స్కూల్స్ లో కలుసుకున్నారు . తొలిరోజు పాఠాలు చెప్పగా , విద్యార్థులు ఆసక్తిగా విన్నారు .

ప్రైవేట్ స్కూల్స్ కు ఏపీ సర్కార్ భారీ షాక్ ... టీసీ లేకుండానే ప్రభుత్వ స్కూల్స్ లో చేరికలకు గ్రీన్ప్రైవేట్ స్కూల్స్ కు ఏపీ సర్కార్ భారీ షాక్ ... టీసీ లేకుండానే ప్రభుత్వ స్కూల్స్ లో చేరికలకు గ్రీన్

 మొదటి రోజు దాదాపు 80 శాతం హాజరు : మంత్రి ఆదిమూలపు సురేష్

మొదటి రోజు దాదాపు 80 శాతం హాజరు : మంత్రి ఆదిమూలపు సురేష్

మొదటి రోజు దాదాపు 80 శాతం హాజరు ఉన్నట్లుగా, విద్యార్థులు చాలా ఉత్సాహంగా స్కూల్స్ కు వచ్చినట్లుగా పేర్కొన్నారు ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ .కరోనా నేపథ్యంలో స్కూల్స్ లో అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని, ప్రైవేటు విద్యాసంస్థలు కరోనా కష్టకాలంలో 70 శాతం మాత్రమే ఫీజులు వసూలు చేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామని పేర్కొన్న మంత్రి ఆదిమూలపు సురేష్ దాదాపు కరోనా కారణంగా ఆరునెలలపాటు స్కూల్స్ కొనసాగలేదని పేర్కొన్నారు. అలాంటప్పుడు మొత్తం ఫీజు ఎలా వసూలు చేస్తారన్న మంత్రి ఆదిమూలపు సురేష్ ఎవరైనా ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరించి ఫీజుల వసూళ్లకు పాల్పడితే తల్లిదండ్రులను ఫిర్యాదు చేయాలని సూచించారు.

ఫీజుల విషయంలో ప్రభుత్వ ఆదేశాలు పాటించకుంటే చర్యలు

ఫీజుల విషయంలో ప్రభుత్వ ఆదేశాలు పాటించకుంటే చర్యలు

ఫీజుల వసూళ్ళ విషయంలో ఫిర్యాదులు వస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు జారీచేశారు. కేవలం టీచర్లు, సిబ్బందికి జీతాలు ఇవ్వటం కోసమే ఫీజుల విషయంలో ఈ నిర్ణయం తీసుకున్నామని మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు . అంతేకాదు ప్రైవేట్ స్కూల్స్ లోనూ , కళాశాలల్లోనూ తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని ఆయన పేర్కొన్నారు. తల్లిదండ్రులు విద్యార్థులు కోవిడ్ పట్ల అవగాహన కల్పించేలా చర్యలు చేపట్టినట్లు ఆయన స్పష్టం చేశారు.

Recommended Video

Schools Reopen In AP : రోజు విడిచి రోజు విధానంలో ఏపీలో స్కూళ్లు, కాలేజీలు.. ప్రభుత్వం కీలక ప్రకటన!
 కార్పోరేట్ స్కూల్స్ కు దీటుగా గవర్నమెంట్ స్కూల్స్ .. స్కూల్స్ రీ ఓపెన్ జోష్ లో స్టూడెంట్స్

కార్పోరేట్ స్కూల్స్ కు దీటుగా గవర్నమెంట్ స్కూల్స్ .. స్కూల్స్ రీ ఓపెన్ జోష్ లో స్టూడెంట్స్

విద్యాసంస్థల్లో కరోనా నియమాలు పాటిస్తున్నారో లేదో తెలుసుకోవడం కోసం ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తామని మంత్రి స్పష్టం చేశారు . అంతేకాదు ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలలను నాడు ..నేడు కార్యక్రమం కింద అభివృద్ధి చేసినట్లుగా పేర్కొన్న మంత్రి ప్రభుత్వ స్కూల్స్ రూపు రేఖలు మారాయని చెప్పారు. కార్పోరేట్ స్కూల్స్ కి దీటుగా స్కూల్స్ తీర్చిదిద్దామని చెప్పారు . విద్యార్థులకు జగనన్న విద్యా కానుక ఇస్తున్నామని, అన్ని వసతులు వారికి అందుబాటులోకి తెచ్చామని పేర్కొన్నారు . విద్యార్థులు పాఠశాలలు పునః ప్రారంభం కావడంతో చాలా హుషారుగా ఈరోజు స్కూల్స్ కి వచ్చినట్లుగా మంత్రి తెలిపారు.

English summary
AP Education Minister Adimulapu Suresh said that the first day was almost 80 per cent attended and the students came to the schools very enthusiastically.Minister Suresh said that all precautions have been taken in the schools in the wake of the corona and that private educational institutions have already issued orders to charge only 70 per cent of the fees during the corona crisis.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X