• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఏపీలో కరోనా: స్కూళ్ల రీఓపెనింగ్‌ వాయిదా - జగనన్న విద్యా కానుక మాత్రం 5 నుంచే: మంత్రి సురేశ్

|

కరోనా బాధిత రాష్ట్రాల జాబితాలో దేశంలోనే నంబర్-2గా కొనసాగుతోన్న ఆంధ్రప్రదేశ్ లో స్కూళ్ల రీఓపెనింగ్ కు సంబంధించి జగన్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ముందుగా ప్రకటించిన తేదీల ప్రకారం అక్టోబర్ 5 నుంచి బడులు పున:ప్రారంభం కావాల్సి ఉండగా... కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఆ నిర్ణయాన్ని సర్కారు వాయిదా వేసుకుంది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ కీలక ప్రకటనలు చేశారు.

పవన్ కల్యాణ్ మూడుపెళ్లిళ్ల మాసికం - జైలు భయంతోనే జగన్ ఆ పని - బుద్ధి తక్కువై పొత్తు: సీపీఐ నారాయణ

నవంబర్ 2 నుంచి బడులు..

నవంబర్ 2 నుంచి బడులు..

అక్టోబర్‌ 5న స్కూళ్లు తెరవాలని నిర్ణయించినప్పటికీ, ప్రస్తుత పరిస్థితులు దృష్ట్యా వాయిదా వేసినట్లు మంత్రి సురేశ్ వెల్లడించారు. నవంబర్‌ 2న స్కూళ్లు తెరవాలని నిర్ణయించామని ఆయన చెప్పారు. అయితే, విద్యార్థుల కోసం తలపెట్టిన ‘జగనన్న విద్యా కానుక' కిట్లను మాత్రం అక్టోబర్ 5 నుంచే పంపిణీ చేస్తామని మంత్రి స్పష్టం చేశారు.

నవంబర్ 3న దుబ్బాక ఉపఎన్నిక - ఈసీ షెడ్యూల్- అమల్లోకి కోడ్ - జీహెచ్ఎంసీ పోల్స్ పైనా ఫోకస్

సీఎం చేతుల మీదుగానే..

సీఎం చేతుల మీదుగానే..

2020-21 విద్యా సంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి వరకు చదివే విద్యార్థులకు 7 రకాల వస్తువులను (3 జతల దుస్తులు, బెల్టు, ఒక జత షూ, రెండు జతల సాక్స్, పాఠ్యపుస్తకాలు, నోట్‌ బుక్స్, స్కూల్‌ బ్యాగ్‌)ను జగనన్న విద్యా కానుక పేరుతో కిట్‌ రూపంలో అందించాలని వైసీపీ సర్కారు డిసైడైన సంగతి తెలిసిందే. స్కూళ్ల పున:ప్రారంభం నవంబర్ 2కు వాయిదా పడినప్పటికీ, జగనన్న విద్యా కానుకను మాత్రం అక్టోబర్‌ 5నుంచే అందజేస్తామన్న మంత్రి సురేశ్.. ఆ రోజు సీఎం జగన్ ఏదో ఒక జిల్లాలోని స్కూల్‌కు వెళ్లి, విద్యార్థులకు కిట్స్ అందజేస్తారని పేర్కొన్నారు.

  థాంక్యూ CM Jagan గారూ.. ఇది భారతీయుల కోరిక అంటూ Kamal Haasan ప్రశంస! || Oneindia Telugu
  కరోనా విజృంభణ వల్లే..

  కరోనా విజృంభణ వల్లే..

  కరోనా కొత్త కేసులు, మరణాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ సోమవారం వెల్లడించిన గణాంకాలు తక్కువగా ఉండటం అందరికీ ఊరట కలిగించినప్పటికీ.. ఆదివారం మెజార్టీ సిబ్బందికి సెలవు కాబట్టే తక్కువ టెస్టులు చేయడం వల్లే కేసుల సంఖ్య తక్కువగా వచ్చినట్లు వెల్లడైంది. సోమవారం కొత్తగా 5487 కేసులు, 37 మరణాలు నమోదయ్యాయి. గడిచిన రెండు నెలల్లో ఇదే అతి తక్కువ సంఖ్య కావడంతో వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టిందేమోననే భావన వ్యక్తమైంది. కానీ, మంగళవారం విడుదలయ్యే లెక్కలను బట్టే రాష్ట్రంలో కరోనా పరిస్తితిని సరిగా అంచనావేయగలం. మహమ్మారి ప్రభావం వల్లే స్కూళ్ల పున:ప్రారంభం వాయిదాపడింది.

  English summary
  Although the schools were scheduled to reopen on October 5, it was postponed due to the current situation, Education Minister Adimulapu Suresh said. He told the media on Tuesday that the schools were scheduled to reopen on November 2. However, he said the government would provide 'Jagananna Vidya Kanuka' kits to children on October 5.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X