విశాఖ - తిరుపతి ప్రత్యేక రైలు, ఈ మార్గాల్లోనూ కొత్తగా.. ఇదీ షెడ్యూల్..!!
దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన చేసింది. తెలుగు రాష్ట్రాల్లో డిమాండ్ ఉన్న మార్గాల్లో అదనపు రైళ్ల నిర్వహణకు నిర్ణయించింది. దసరా, దీపావళి వేళ పెద్ద సంఖ్యలో రాకపోకలు సాగనున్నాయి. ప్రయాణీకుల రద్దీ కొనసాగుతున్న ప్రధాన రైళ్ల లో అదనపు కోచ్ ల ఏర్పాటు పైన కసరత్తు చేస్తున్న అధికారులు.. ముందుగా ప్రత్యేక రైళ్లను ప్రకటించారు. అందులో భాగంగా తొలి విడతలో పలు మార్గాల్లో 52 ప్రత్యేక రైళ్ల షెడ్యూల్ ను అధికారులు విడుదల చేసారు.
సెలవుల వేళ ప్రధాన రైళ్లల్లో భారీగా వెయిటింగ్ లిస్టు కొనసాగుతోంది. దీంతో, ప్రయాణికుల డిమాండ్ మేరకు వేర్వేరు ప్రాంతాల నుంచి 52 ప్రత్యేక రైళ్లను నడపడానికి దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. అక్టోబరు 5 నుంచి 27 వరకు తిరుపతి-అనకాపల్లె-తిరుపతి మధ్య 8 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈనెల 17 నుంచి నవంబరు 26 వరకు (బుధ) సంబల్‌పూర్- ఇరోడ్ (08311) మధ్య 11 రైళ్లు, ఈనెల 19నుంచి నవంబరు 28 వరకు (శుక్ర)ఇరోడ్- సంబల్‌పూర్ (08312) మధ్య 11 రైళ్లు, ఈనెల 15 నుంచి నవంబరు 24 వరకు (సోమ) విశాఖపట్నం- తిరుపతి (08583) మధ్య 11 రైళ్లు, ఈనెల 16నుంచి నవంబరు 25 వరకు (మంగళ) తిరుపతి-విశాఖపట్నం (08584) మధ్య 11 ప్రత్యేకరైళ్లు నడుస్తాయని వివరించారు.

అదే విధంగా తిరుపతిలో ఈ నెలలో జరిగే బ్రహ్మోత్సవాల వేళ పెద్ద సంఖ్యలో తిరుపతికి వెళ్లేందుకు ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నారు. దీంతో.. ఇప్పటికే కొనసాగుతున్న ప్రత్యేక రైళ్లను దీపావళి వరకు పొడిగిస్తూ నిర్ణయించారు. ఇక.. దసరా, దీపావళి సెలవులు పూర్తయ్యే వరకూ తెలుగు రాష్ట్రాల నుంచి పలు రైళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే పలు రైళ్ల వివరాలను వెల్లడించారు. కాగా.. ఈ వారంలో రద్దీకి అనుగుణంగా ప్రధాన మార్గాల్లో మరిన్ని రైళ్లను ప్రకటించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇక.. నడికూడీ - శ్రీకాళహస్తి మార్గం నుంచి తిరుపతికి నడుపుతున్న రైళ్లను కొనసాగించాలని డిసైడ్ అయ్యారు. సెలవుల వేళ భక్తులకు అవసరం మేర రైళ్లను కొనసాగిస్తామని అధికారులు వెల్లడించారు.












Click it and Unblock the Notifications