విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విజయవాడ-సికింద్రాబాద్ వందే భారత్ రైల్లో తనిఖీలు-ప్రయాణికుల ఫీడ్ బ్యాక్ ఇదే..!

|
Google Oneindia TeluguNews

తెలుగు రాష్ట్రాల్లో వందే భారత్ ఎక్స్ ప్రెస్ ల రాకపోకలు తాజాగా ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రయాణికుల నుంచి మంచి ఫీడ్ బ్యాక్ వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రయాణికుల నుంచి ఫీడ్ బ్యాక్ తెలుసుకునేందుకు ఇవాళ విజయవాడ నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న వందే భారత్ రైలులో దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.

దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ అరుణ్ కుమార్ జైన్ ఇవాళ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ తనిఖీ చేశారు. సికింద్రాబాద్ డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ ఎ.కె.గుప్తా, ఇతర అధికారులతో కలిసి రైల్లో తనిఖీలు చేపట్టారు.
తనిఖీలో భాగంగా జనరల్ మేనేజర్ విజయవాడ నుంచి సికింద్రాబాద్‌కు వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించారు . ప్రయాణీకులతో సంభాషించారు. వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణికుల అనుభవం గురించి అభిప్రాయాలను తెలుసుకున్నారు . ఈ సందర్బంగా ప్రయాణికులు రైలులో కల్పించిన సౌకర్యాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. రైలులో ప్రీమియం ఫీచర్లతో తమకు అత్యుత్తమ ప్రయాణ అనుభవాన్ని అందించడానికి రైల్వేలు చేస్తున్న ప్రయత్నాలను అభినందించారు .

scr officials sudden visit vja-sec vande bharat train to take feed back from passengers

ఈ సందర్భంగా అధికారులు.. రైలులోని ఆన్-బోర్డు సిబ్బందితో కూడా సంభాషించారు . రైలులో భద్రతా సౌకర్యాలు, క్యాటరింగ్ ఏర్పాట్లు, ప్రయాణీకులకు అందించే ఆహారం నాణ్యత పరిశీలించారు . తర్వాత ఖమ్మం-వరంగల్ స్టేషన్ల మధ్య జనరల్ మేనేజర్ రైలు ఇంజిన్ లో ప్రయాణిస్తూ ట్రాక్ పరిశీలించారు .

scr officials sudden visit vja-sec vande bharat train to take feed back from passengers

సెమీ హైస్పీడ్ రైళ్లలో లోకో పైలట్లు, ఇతర సిబ్బంది అనుసరిస్తున్న భద్రతా విధానాలను పరిశీలించారు. సెక్షన్ యొక్క సిగ్నల్ వ్యవస్థను మరియు ట్రాక్ సామర్థ్యాన్ని కుడా జనరల్ మేనేజర్ పరిశీలించారు. అంతకుముందు జీఎం అరుణ్ విజయవాడ రైల్వేస్టేషన్‌ను తనిఖీ చేశారు. విజయవాడ రైల్వేస్టేషన్‌ పునరాభివృద్ది పనులను పరిశీలించారు. స్టేషన్ ఆవరణలోని ప్లాట్‌ఫారమ్‌లు, వెయిటింగ్ హాళ్లు, ఫుడ్ కోర్టులతో సహా స్టేషన్‌లో అందుబాటులో ఉన్న ప్రయాణికుల సౌకర్యాలను సమీక్షించారు.

English summary
south central railway officials on today hold sudden visit in vande bharat train between vijayawada-secunderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X