చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆచూకీ దొరకని విమానం: కన్నీరు మున్నీరవుతున్న విశాఖవాసులు

By Pratap
|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: చెన్నై నుంచి పోర్టు బ్లెయిర్‌కు వెళ్తూ అదృశ్యమైన వాయుసేన విమానం (ఎఎన్ 32) ఆచూకీ శనివారం సాయంత్రానికి కూడా లభించలేదు. విశాఖకు చెందిన ఎనిమిది మంది విధి నిర్వహణలో భాగంగా బుధవారమే విశాఖ నుంచి బయలుదేరారు. గురువారం చెన్నై చేరుకున్నారు.

గల్లంతైన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానంలో 8మంది విశాఖవాసులుగల్లంతైన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానంలో 8మంది విశాఖవాసులు

శుక్రవారం ఉదయం వాయుసేన విమానంలో వీరంతా పోర్టు బ్లెయిర్‌కు బయలుదేరారు. అయితే, వీరు ప్రయాణిస్తున్న విమానం గల్లంతైన విషయం ఎన్‌ఎడి అధికారుల ద్వారా కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. దీంతో వారు పెను విషాదంలో మునిగిపోయారు.

Search For Missing Air Force Plane Crosses 24 Hours, Defence Minister Joins Sortie

విశాఖ నగరం గోపాలపట్నం, అప్పన్నపాలెం, బుచ్చిరాజుపాలెం, వేపగుంట ప్రాంతాలకు చెందిన వీరు ఈ నెల 20న విధి నిర్వహణలో భాగంగా పోర్టు బ్లెయిర్‌కు బయలుదేరారు. విమానం గల్లంతైందనే సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు శోకసముద్రంలో మునగిపోయారు.

గల్లంతైన విమానం: ఏఎన్-32 ప్లేన్ ప్రత్యేకతలు ఇవేగల్లంతైన విమానం: ఏఎన్-32 ప్లేన్ ప్రత్యేకతలు ఇవే

కాగా, రక్షణ శాఖ మంత్రి మనోహర్ పరికర్ శనివారంనాడు చెన్నై చేరుకున్నారు. నావిక, వైమానిక దళాలు, కోస్ట్ గార్డులు చేపట్టిన గాలింపు చర్యలపై ఆయన వివరించారు. ఆచూకీ తీయడానికి ప్రయత్నిస్తున్నామని ఆయన ట్వీట్ చేశారు.

English summary
As search for Indian Air Force's missing AN-32 plane crossed 24 hours, Defence Minister Manohar Parrikar reached Chennai today and joined a sortie conducted by the armed forces. The "courier flight" with 29 people on board went missing on Friday morning.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X